పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
21 నూతన గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు సూత్రప్రాయ ఆమోదం
21 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలలో 12 విమానాశ్రయాలలో కార్యకలాపాలు ప్రారంభం
Posted On:
10 AUG 2023 2:49PM by PIB Hyderabad
విమానాశ్రయాలలో మౌలిక సదుపాయాల/ సౌకర్యాల ఆధునీకరణ అన్నది నిరంతర ప్రక్రియ. కార్యాచరణ అవసరాలు, ట్రాఫిక్, డిమాండ్, వాణిజ్యపరమైన సాధ్యత తదితర అంశాల ఆధారంగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) లేదా సంబంధిత విమానాశ్రయ ఆపరేటర్లు ఈ ప్రక్రియను చేపడతారు. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు అభివృద్ధి చెందుతున్న వివిధ గ్రీన్‌ఫీల్డ్ (సరికొత్తగా నిర్మించే) విమానాశ్రయాలను, బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధి/ ఆధునీకరణ/ నవీకరణను చేపట్టేందుకు 2019-24 కాలంలో ఎఎఐ కేటాయింపు రూ. 25,000 కోట్లు సహా మొత్తం రూ.98,000 కోట్లకు పైగా కాపెక్స్ ప్రణాళికతో ఎఎఐ, ఇతర ఎయిర్‌ఫోర్ట్ ఆపరేటర్లు ప్రయాణాన్ని ప్రారంభించారు.
ఎఎఐ అండమాన్& నికోబార్ ఐలాండ్స్‌లో పోర్ట్ బ్లెయిర్, ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి, విజయవాడ, అరుణాచల్ ప్రదేశ్‌లో ఇటానగర్, తేజు, అస్సాంలో దిబ్రూగఢ్, బీహార్‌లో దర్భంగా, పాట్నా, ఢిల్లీలో సఫ్దర్‌జంగ్, గోవాలో గోవా, గుజరాత్‌లో ధొలేరా, రాజ్‌కోట్, సూరత్, వడోదర, లడాఖ్‌లో లేహ్, కర్నాటకలో కాలబుర్గి, కేరళలో కాలికట్, మధ్యప్రదేశ్‌లో భోపాల్, గ్వాలియర్, ఇందోర్, జబల్‌పూర్, రేవా, మహారాష్ట్రలో జుహు, కోల్హాపూర్, పూణె, మణిపూర్‌లో ఇంఫాల్, ఒడిషాలో భుబనేశ్వర్, రాజస్థాన్‌లో జోధ్‌పూర్, తమిళనాడులో చెన్నై, కోయంబత్తూర్, మధురై, త్రిచి, ట్యూటికార్న్, త్రిపురలో ఆగర్తాలో, ఉత్తర్‌ప్రదేశ్‌లో అయోధ్య, గోరఖ్‌పూర్, కాన్పూర్, ముయీర్‌పూర్, సహరాన్‌పూర్, ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్, పశ్చిమబెంగాల్‌లో కోల్‌కతా విమానాశ్రయాల అభివృద్ధి / విస్తరణ పనులను చేపట్టింది. టెర్మినల్ భవనాలు, ఎటిసి టవర్ కమ్ సివిల్ ఎన్‌క్లేవ్‌ల విస్తరణ, పొడిగింపు, రన్‌వేల రీ కార్పెటింగ్ చేయడం, పటిష్టం చేయడంతో పాటు ఆప్రాన్‌లు, పార్కింగ్ బేలు, ఇతర అనుబంధ మౌలిక సదుపాయల మెరుగుదల,సహా పలు పెంపుదలల వరకు ఈ నవీకరణ కృషి ఆవరిస్తుంది.
దేశంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ (జిఎఫ్ఎ)ల విధానం, 2008ని రూపొందించింది. ఈ విధానం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం సహా ఎవరైనా డెవలపర్ ఒక విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని కోరినప్పుడు, అందుకు అనువైన భూమిని వారు గుర్తించి, విమానాశ్రయ నిర్మాణానికి ముందస్తు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి, సైట్ క్లియరెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనను సమర్పించి, ఆ పై సూత్రప్రాయ అనుమతిని పొందవలసి ఉంటుంది. ఇప్పటివరకూ, భారత ప్రభుత్వం 21 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు సూత్రప్రాయ అనుమతిని ఇచ్చింది. ఇందులో, 12 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలలో కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి.
ఇవే కాకుండా, విమానయానం సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడానికి దేశంలో సేవలందించిన, తక్కువ సేవలందిస్తున్న విమానాశ్రయాల నుంచి ప్రాంతీయ విమాన అనుసంధానతను మెరుగుపరచడానికి, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రాంతీయ అనుసంధాన పథకం (ఆర్‌సిఎస్) - యుడిఎఎన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) ను 21.10.2016లో ప్రారంభించింది.
అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థ (ఐసిఎఒ), అంతర్జాతీయ విమాన రవాణా అసోసియేషన్ (ఐఎటిఎ) తదితర అంతర్జాతీయ సంస్థలు నిర్దేశించిన నిర్ధిష్ట అంతర్జాతీయ ప్రమాణాలు/ నియమాలను విమానాశ్రయాల నవీకరణ నెరవేర్చేందుకు ఎఎఐ లేదా సంబంధిత ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు వాణిజ్య కోణం, ప్రయాణీకుల అవసరాలు, భూమి పరిస్థితి, ఎయిర్‌లైన్ ఎంపికలు వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని చేపడుతున్నాయి. ఒక విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించడం అన్నది రద్దీ సంభావ్యత, అంతర్జాతీయ విమానాలను నిర్వహణ కోసం ఎయిర్‌లైన్స్ నుంచి డిమాండ్‌ను, ద్వైపాక్షిక విమాన సేవల ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది.
ఇందులో గ్రౌండ్ లైటింగ్ సౌకర్యాలు, ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టం, రన్‌వే పొడవు, ఇమ్మిగ్రేషన్, ఆరోగ్యం, జంతు & వృక్ష క్వారంటీన్ సేవలు తదితరాలు కూడా ఇందులో ఉంటాయి. ప్రస్తుతం, దేశంలో 30 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి.
ఈ సమాచారాన్ని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కె. సింగ్ (రిటైర్డ్) లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక జవాబులో వివరించారు.
***
(Release ID: 1947683)
Visitor Counter : 117