బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐదు సంవత్సరాలలో పదిహేను పర్యావరణ పార్కులు నిర్మించిన ప్రభుత్వ రంగ బొగ్గు/లిగ్నైట్ సంస్థలు వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు కానున్న మరో 19 పార్కులు

Posted On: 09 AUG 2023 2:10PM by PIB Hyderabad

ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న బొగ్గు/లిగ్నైట్ సంస్థలు  గత 5 సంవత్సరాలలో 15 ఎకో-పార్కులను స్థాపించాయి. ఎకో పార్కులకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. ఎకో-పార్కుల స్థాపన, నిర్వహణ, నిర్వహణ ఖర్చుల కోసం   సంబంధిత బొగ్గు/లిగ్నైట్ సంస్థలు  నిధులు సమకూరుస్తున్నాయి . ఎకో-పార్క్‌ల పార్కుల వివరాలు రాష్ట్రాల వారీగా, సంవత్సరం వారీగా, పూర్తయ్యే  సమయం, బొగ్గు/లిగ్నైట్ సంస్థలు  కేటాయించిన ప్రాథమిక మొత్తం , అవసరమైన అదనపు నిధులు అనుబంధం-లో ఉన్నాయి.

బొగ్గు/లిగ్నైట్ పిఎస్‌యుల ద్వారా కొత్త ఎకో-పార్క్‌ల కోసం అంచనా వేసిన నిధుల వివరాలు అనుబంధం-IIలో ఇవ్వబడ్డాయి.

ఎకో-పార్కులను బొగ్గు/లిగ్నైట్ సంస్థలు తమ  సమీపంలో ఉన్న ప్రాంతాల్లో  వినోద ప్రయోజనాల కోసం అభివృద్ధి చేశాయి  ఈ ఎకో-పార్కుల నుంచి వస్తున్నా  ఆదాయాన్ని మైనింగ్ ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేయడం లేదు. అయితే, కెనపరా ఎకో-పార్క్, ఎస్ఈసిఎల్ , ఛత్తీస్‌గఢ్ మైన్ టూరిజంను ప్రోత్సహించడానికి స్థానిక స్వయం-సహాయ బృందాలు నిర్వహిస్తున్నాయి..  స్వయం సహాయక బృందాలు తమ జీవనోపాధి కోసం కెనపరా ఎకో-పార్క్‌లో ఏర్పాటు చేసిన  ఫ్లోటింగ్ రెస్టారెంట్, పిసికల్చర్ మరియు బోటింగ్ సౌకర్యాల  ఆదాయాన్ని పొందుతున్నాయి.

 

***


(Release ID: 1947346) Visitor Counter : 102