రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో నాలుగు; ఆరు లేన్ల జాతీయ రహదారి నిర్మాణ విధానం

Posted On: 09 AUG 2023 3:33PM by PIB Hyderabad

జాతీయ రహదారి నిర్మాణ సంస్థ (NHAI) ద్వారా చేపట్టిన నాలుగు/ఆరు వరుసల పనులకు సంబంధించిన రాష్ట్రాల వారీ వివరాలు జతచేశారు. ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రాజెక్ట్‌ లను సాధారణంగా నేషనల్ హైవేస్,  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO); వివిధ రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్స్ (PWDలు) వంటి ఇతర నిర్వహణ ఏజెన్సీల ద్వారా మంత్రిత్వ శాఖ చేపడుతుంది. త్రిపుర రాష్ట్రంలో, జాతీయ రహదారుల మౌలికసదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా దాదాపు 25 కి.మీ పొడవుతో మొత్తం మూలధన వ్యయం రూ. 2026 కోట్ల తో ఒక పని ఇప్పటికే అమలులో  ఉంది

రాష్ట్ర రహదారులను (రాష్ట్ర రహదారులుSH s) కొత్త జాతీయ రహదారులు-NHలుగా ప్రకటించడం / అప్‌గ్రేడ్ చేయడం కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలను స్వీకరిస్తూనే ఉంది. రాష్ట్ర రహదారులు (ఎస్‌హెచ్‌లు) సహా రాష్ట్ర ఇతర రహదారులు ఎప్పటికప్పుడు సుస్థిరమైన సూత్రాల ఆధారంగా జాతీయ రహదారులు (ఎన్‌హెచ్‌లు)గా ప్రకటించనున్నారు. NHల ప్రకటనకు సంబంధించిన ముఖ్యమైన ప్రమాణాలు క్రింది వాటిని కలిగి ఉన్నాయి:

i. దేశంలోని పొడవు/వెడల్పులో ఉన్న రహదారులు.

ii. ప్రక్కనే ఉన్న దేశాలు, జాతీయ రాజధానులను రాష్ట్ర రాజధానులతో కలుపుతున్నవి/ పరస్పరం రాష్ట్ర రాజధానులు, ప్రధాన నౌకాశ్రయాలు, నాన్-మేజర్ ఓడరేవులు, పెద్ద పారిశ్రామిక కేంద్రాలు లేదా పర్యాటక కేంద్రాలను కలిపేవి.

iii.పర్వత ప్రాంత ; ఏకాంత ప్రాంతంలో ముఖ్యమైన వ్యూహాత్మక అవసరాలను కలిగి ఉన్న రహదారులు.

iv. ప్రయాణ దూరాన్ని గణనీయంగా తగ్గించి, గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించే ప్రాధాన్యతా మార్గాలు.

v. వెనుకబడిన ప్రాంతం; కొండ ప్రాంతాలలో పెద్ద ప్రాంతాలను తెరవడంలో సహాయపడే రోడ్లు.

vi. 100 కి.మీ జాతీయ రహదారుల గ్రిడ్ సాధనకు దోహదపడే రోడ్లు.

vii. PM గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ (NMP)తో సంఘటితమైనవి

 

ప్రమాణాల నెరవేర్పు, కనెక్టివిటీ ఆవశ్యకత, అంతర్-మార్గాల ప్రాధాన్యత; నిధుల లభ్యత ఆధారంగా ఎప్పటికప్పుడు రాష్ట్ర రహదారులు (SHs)తో సహా కొన్ని రాష్ట్ర రహదారులను NHలుగా ప్రకటించడాన్ని మంత్రిత్వ శాఖ పరిగణిస్తుంది.

  భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ- NHAI   చేపట్టిన నాలుగు/ఆరు లేన్ల పనులకు సంబంధించిన రాష్ట్రాల వారీ వివరాలు
 

Sr. No

రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం

చేపట్టిన మొత్తం పనులు

రహదారుల పొడవు (కిలోమీటర్లలో)

పూర్తి మూల వ్యయం   (కోట్ల రూపాయల్లో)

1

ఆంధ్రప్రదేశ్

23

514

16832

2

అస్సాం

10

220

7100

3

బీహార్

24

1033

37375

4

ఛత్తీస్‌గఢ్

6

250

6427

5

గుజరాత్

20

724

15535

6

హర్యానా

22

656

27363

7

హిమాచల్ ప్రదేశ్

8

160

8703

8

జార్ఖండ్

11

410

12539

9

కర్ణాటక

25

1179

36460

10

కేరళ

19

583

50458

11

మధ్యప్రదేశ్

25

820

17000

12

మహారాష్ట్ర

45

1967

50488

13

ఒడిశా

18

722

15845

14

పంజాబ్

23

816

31352

15

రాజస్థాన్

19

623

14864

16

తమిళనాడు

34

963

32545

17

తెలంగాణ

11

374

10829

18

ఉత్తర ప్రదేశ్

46

1684

63612

19

ఉత్తరాఖండ్

14

257

12827

20

పశ్చిమ బెంగాల్

7

405

10358

21

ఢిల్లీ

6

70

8664

22

జమ్మూ-కాశ్మీర్

16

340

24855

 

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈరోజు రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో అందించిన సమాచారం సమాచారం.
*****


(Release ID: 1947278)