ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఖనిజాల సరఫరాను పెంచడానికి మరియు కోకింగ్ బొగ్గు లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు

Posted On: 08 AUG 2023 1:38PM by PIB Hyderabad

ఖనిజాల సరఫరాను పెంచడానికి భారత ప్రభుత్వం మైనింగ్ మరియు మినరల్ పాలసీ సంస్కరణలు తోపాటు వివిధ చర్యలు చేపట్టింది, వీటిలో మెరుగైన ఉత్పత్తి,లీజు గడువు ముగిసిన  గనుల ముందస్తు వేలం, నిర్వహణ, వ్యాపారం చేయడంలో సౌలభ్యం, చెల్లుబాటు అయ్యే హక్కులు అనుమతులు సత్వర బదిలీ చేయడం, మైనింగ్ కార్యకలాపాలను ప్రారంభించడం, రవాణాను ప్రోత్సహించడం, మైనింగ్ లీజులను బదిలీ చేయడం, క్యాప్టివ్ మైన్స్ కు ఉత్పత్తి చేయబడిన ఖనిజాలలో 50% వరకు  విక్రయించడానికి అనుమతించడం, అన్వేషణ కార్యకలాపాలను మెరుగుపరచడం మొదలైనవి ఉన్నాయి.

 

మిషన్ కోకింగ్ బొగ్గు

 

నేషనల్ స్టీల్ పాలసీ 2017లో అంచనా వేసిన దేశీయ కోకింగ్ బొగ్గు డిమాండ్‌ను తీర్చడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ ఎఫ్ వై 22లో మిషన్ కోకింగ్ కోల్‌ని ప్రారంభించింది. కోకింగ్ బొగ్గు దిగుమతిని తగ్గించడానికి, ఉక్కు రంగం లో కోకింగ్ బొగ్గును కలపడం ప్రస్తుతం వున్న 10-12% నుండి 30-35% కి పెంచబడుతుంది.  ప్రధానమంత్రి 'ఆత్మనిర్భర్ భారత్' చొరవ మరియు బొగ్గు మంత్రిత్వ శాఖ చేపట్టిన పరివర్తన చర్యల వల్ల దేశీయ ముడి కోకింగ్ బొగ్గు ఉత్పత్తి 2030 నాటికి 140 ఎం టీ కి చేరుకునే అవకాశం ఉంది, బొగ్గును కడిగిన తర్వాత సుమారు 48 ఎం టీ వినియోగించదగిన కోకింగ్ బొగ్గు దిగుబడి వస్తుంది.

 

ఇంకా, దేశీయ ఉత్పత్తిని పెంచడం, జీవ ఇంధనాలు, పునరుత్పాదకాలను స్వీకరించడం, ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం, రిఫైనరీ ప్రక్రియల్లో మెరుగుదల మరియు డిమాండ్ ప్రత్యామ్నాయం వంటి ఐదు-కోణాల వ్యూహాన్ని అనుసరించడం ద్వారా ఎల్‌ఎన్‌జితో సహా హైడ్రోకార్బన్‌లపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసింది.

 

దేశీయ ఉక్కు పరిశ్రమ ప్రస్తుత డిమాండ్/వినియోగానికి అనుగుణంగా దేశంలో తగినంత ఇనుము ఖనిజం మరియు నాన్-కోకింగ్ బొగ్గు నిల్వలు ఉన్నాయి. అయితే, ప్రధానంగా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఉత్పత్తిదారులు ఉపయోగించే డిమాండ్‌తో పోలిస్తే దేశంలో అధిక నాణ్యత గల బొగ్గు/ కోకింగ్ బొగ్గు (తక్కువ బూడిద బొగ్గు) సరఫరా పరిమితంగా ఉన్నందున కోకింగ్ బొగ్గు దిగుమతి అవుతుంది.

 

ఈ సమాచారాన్ని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఫగ్గన్ సింగ్ కులస్తే లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

 

***


(Release ID: 1946723)