నౌకారవాణా మంత్రిత్వ శాఖ
దేశంలోని ఓడరేవులకు రైలు, రహదారి మార్గాల అనుసంధానం
Posted On:
08 AUG 2023 2:53PM by PIB Hyderabad
దేశంలోని అన్ని ప్రధాన ఓడరేవులు రైలు మార్గం, నాలుగు వరుసల రహదారి లేదా జాతీయ రహదారి ద్వారా అనుసంధానమై ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిన సమాచారం ప్రకారం, ప్రధాన నౌకాశ్రయాలు కాకుండా, ఇంకా 66 ఓడరేవుల్లో (నాన్-మేజర్ పోర్టులు) 13 రేవులకు రైలు మార్గం ఉంది. 24 నౌకాశ్రయాలు నాలుగు వరుసల రహదారి/జాతీయ రహదారి ద్వారా అనుసంధానమైన ఉన్నాయి.
దేశంలోని ఓడరేవుల వివరాలు రాష్ట్రాల వారీగా, నిర్వహిస్తున్న ఉత్పత్తుల వారీగా అనుబంధంలో ఉన్నాయి.
2022-23 ఆర్థిక సంవత్సరంలో, భారతీయ నౌకాశ్రయాలు నిర్వహించిన మొత్తం 1129.63 మిలియన్ టన్నుల సరకులో, గుజరాత్ & ఆంధ్రప్రదేశ్‌లోని ఓడరేవులు వరుసగా 493.85 మిలియన్ టన్నులు & 133.32 మిలియన్ టన్నులను నిర్వహించాయి.
అనుబంధం
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/యూటీ
|
బొగ్గును నిర్వహిస్తున్న నౌకాశ్రయాల సంఖ్య
|
ఎరువులను నిర్వహిస్తున్న నౌకాశ్రయాల సంఖ్య
|
సిమెంట్‌ను నిర్వహిస్తున్న నౌకాశ్రయాల సంఖ్య
|
పెట్రోలియం, పెట్రో రసాయనాల ఉత్పత్తులను నిర్వహిస్తున్న నౌకాశ్రయాల సంఖ్య
|
1
|
గుజరాత్
|
15
|
6
|
7
|
9
|
2
|
మహారాష్ట్ర
|
7
|
3
|
5
|
3
|
3
|
గోవా
|
2
|
1
|
0
|
1
|
4
|
కర్ణాటక
|
1
|
1
|
2
|
2
|
5
|
కేరళ
|
0
|
0
|
2
|
2
|
6
|
తమిళనాడు
|
2
|
1
|
2
|
7
|
7
|
ఆంధ్రప్రదేశ్
|
4
|
4
|
1
|
2
|
8
|
ఒడిశా
|
3
|
2
|
0
|
1
|
9
|
పశ్చిమ బంగాల్
|
2
|
2
|
2
|
2
|
10
|
పుదుచ్చేరి
|
1
|
0
|
1
|
2
|
11
|
అండమాన్&నికోబార్
|
0
|
0
|
9
|
2
|
కేంద్ర ఓడరేవులు, నౌకా రవాణా, జల మార్గాల శాఖ మంత్రి శ్రీ శర్వానంద సోనోవాల్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ విషయాన్ని తెలిపారు.
*****
(Release ID: 1946712)
Visitor Counter : 132