బొగ్గు మంత్రిత్వ శాఖ
కార్యకలాపాలలో సుస్థిరతను నిర్ధారించడానికి సిపిఎస్ఇల ద్వారా పెద్ద ఎత్తున వైవిధ్యతను ప్రోత్సహిస్తున్న బొగ్గు మంత్రిత్వ శాఖ
రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్న ఎన్ఎల్‌సిఐఎల్
ఉత్తర్‌ప్రదేశ్‌కు 1478.28 మెగావాట్లను, అస్సాంకు 492.72 మెగావాట్లను ఘాతంపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రం సరఫరా చేస్తుందని అంచనా
తమిళనాడుకు 1450 మెగావాట్లను, పుదుచ్చేరీకి 100 మెగావాట్లను ఎన్ఎల్‌సిఐఎల్ కు చెందిన ఒడిషాలోని తలబిరా కేంద్రం సరఫరా చేయనుంది
2028 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్న కోల్ ఇండియా లిమిటెడ్
Posted On:
07 AUG 2023 11:41AM by PIB Hyderabad
భారతదేశ బొగ్గు రంగ భవిష్యత్తుకు సిద్ధం చేసేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ సానుకూల రీతిలో సిపిఎస్ఇలలో పెద్ద ఎత్తున వైవిధ్యతను ప్రోత్సహిస్తోంది. ఇందుకు అనుగుణంగా, ఎన్ఎల్‌సిఐఎల్ రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఒక కేంద్రాన్ని కాన్పూర్ సమీపంలోని ఘటంపూర్‌లో ఏర్పాటు చేస్తోంది. ఇది రూ. 19,406 వ్యయంతో 3 x 660 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. ఎన్ఎల్‌సిఐఎల్, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఉమ్మడి వెంచర్ అయిన ప్రాజెక్టు 1478.28 మెగావాట్లను ఉత్తర్ ప్రదేశ్‌కు, 492.72 మెగావాట్లను అస్సాం రాష్ట్రానికి సరఫరా చేస్తుంది. ప్రాజెక్టు అమలు దశలోకి వచ్చింది, ఈ కేంద్రం తొలి దశ ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇందుకు అదనంగా, ఒడిషాలోని తాలాబిరాలో 3X 800 మెగావాట్ల పిథెడ్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు ఎన్ఎల్‌సిఐఎల్ ప్రణాళికలను రూపొందించింది. రూ. 19,422 కోట్లుగా ప్రాజెక్టు వ్యయం అంచనా తో నిర్మించనున్న ఈ కేంద్రం 1450 మెగావాట్ల విద్యుత్‌ను తమిళనాడుకు, 100 మెగావాట్లను పుదుచ్చేరికీ, 400 మెగావాట్లను కేరళకు సరఫరా చేయనుంది. ఈ ప్రాజెక్టు ఈ ఏడాది చివరిలో ప్రారంభమై 2028-29 నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రక్రియలో కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) కూడా ఉంది. ఒకటి మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో ఉమ్మడి వెంచర్‌గా అమర్‌కాంతక్ వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం ప్రణాళికా బద్ధ సామర్ధ్యం 1x660 మెగావాట్లుగా ఉండనుంది,. దీని అంచనా వ్యయం రూ. 5,600 కోట్లు. ప్రస్తుతం, ప్రాజెక్టు అనుమతుల తుది దశలో ఉంది. ఎస్ఇసిఎల్ అనుబంధ సంస్థ సిఐఎల్ రూ. 857 కోట్లను ఈక్విటీగా పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టును ఎస్ఇసిఎల్ , మధ్యప్రదేశ్ పవర్ జనరేటింగ్ కంపెనీ లిమిటెడ్ మధ్య ఉమ్మడి వెంచర్‌గా అమలు చేయనున్నాయి. ఈ ప్రాజెక్టు పని ఈ ఆర్ధిక సంవత్సరం చివరిలో ప్రారంభమై, 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూమిని ఇప్పటికే సేకరించారు.
అంతేకాకుండా, సిఐఎల్ మరొక అనుబంధ సంస్థ అయిన మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసిఎల్) పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా మహానది బేసిన్ పవర్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. తనకు దగ్గరగా ఉన్న బసుంధరా గనుల వద్ద 2x800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఎంసిఎల్ యోచిస్తోంది. ఈ పిత్‌హెడ్ కేంద్రాన్ని రూ. 15,947 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని భావిస్తుండగా, 4000 మెగావాట్ల విలువైన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో వివిధ రాష్ట్రాల దీని పట్ల ఆసక్తిని కనబరచాయి. ఈ ప్రాజెక్టు పై పని వచ్చే ఏడాది మధ్యలో ప్రారంభమై, 2028నాటికి పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు.
నూతన పిథెడ్ థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు తగిన బొగ్గు తవ్వకాలు పూర్తి చేసిన భూములను కనుగొనవలసిందిగా సిఐఎల్ అనుబంధ సంస్థలన్నింటికీ బొగ్గు మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసింది. పిథెడ్ వద్ద విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయడం తక్కువ ఖర్చుతో కూడుకోవడమే కాక తాత్కాలికంగా నిర్ణయించిన దాదాపు రూ. 2.5 ధరతోనూ, యూనిట్‌కు రూ. 1.25 అస్థిర ఖర్చుతో యూనిట్‌ను రూ. 4 కన్నా తక్కువతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయడాన్ని సాధ్యం చేస్తుంది. భవిష్యత్తులో బొగ్గు మిగులు ఉంటుందనే సూచనలు అంతేకాకుండా, సిఐఎల్, ఎన్ఎల్‌సిఐఎల్ నూతన థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుతో నిలకడగా కార్యచారణకు హామీ ఇవ్వాలని లక్ష్యంతో చేసిన నిర్ణయమిది.
విద్యుత్ మంత్రిత్వ శాఖ విధానాల ప్రకారం, అవసరమైన పునరావృత ఇంధన సంభావ్యతను కూడా థర్మల్ విద్యుత్ కేంద్రాలతో పాటుగా సృష్టిస్తున్నారు. తద్వారా థర్మల్, సౌర శక్తి కలయికతో విద్యుత్ ఉత్పత్తిని పెంచవచ్చు. ఇది ఆఖరు వినియోగదారులకు తక్కువ ఖర్చుతో విద్యుత్‌ను సరఫరా చేసేందుకు తోడ్పడుతుంది.
****
(Release ID: 1946602)
Visitor Counter : 122