గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
పట్టణ ప్రాంతాలకు పురుషుల వలస
Posted On:
07 AUG 2023 3:24PM by PIB Hyderabad
జూలై 2020-జూన్ 2021 మధ్యకాలంలో నేషనల్ శాంపిల్ సర్వే కార్యాలయం (ఎన్.ఎస్.ఎస్.ఒ), స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పి.ఎల్.ఎఫ్.ఎస్)లో ఇంటి సభ్యుల వలస వివరాలపై సమాచారాన్ని సేకరించి 'భారతదేశంలో వలసలు 2020-21' ' అనే నివేదికను విడుదల చేసింది. మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 'మైగ్రేషన్ ఇన్ ఇండియా, 2020-21' అనే ఈ నివేదిక ప్రకారం రాష్ట్రాలలోగ్రామీణ ప్రాంతాల పరంగా చివరి సాధారణ నివాస స్థలం ద్వారా పట్టణ ప్రాంతాలకు వలస వచ్చిన పురుషుల (వయస్సుతో సంబంధం లేకుండా) శాతం 53.7. ఈ సమాచారాన్ని స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ, ప్రణాళికా మంత్రిత్వ శాఖ మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖల సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
*****
(Release ID: 1946560)
Visitor Counter : 132