బొగ్గు మంత్రిత్వ శాఖ
అవసరాలకు అనుగుణంగా కొత్త బొగ్గు నిల్వ సౌకర్యాలు అభివృద్ధి
Posted On:
07 AUG 2023 3:51PM by PIB Hyderabad
ఉత్పత్తి, సరఫరా ఆధారంగా బొగ్గు గనుల వద్ద బొగ్గు నిల్వలు మారుతూ ఉంటాయి. కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్), సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సిసిఎల్) పిట్హెడ్లో గత ఐదేళ్లలో 31 మార్చి నాటికి, 2023 జూలై 31 నాటికి ఈ క్రింది విధంగా బొగ్గు నిల్వ ఉంది:
మిలియన్ టన్నులో గణాంకాలు (ఎంటీ )
సంవత్సరం
|
2018-19
|
2019-20
|
2020-21
|
2021-22
|
2022-23
|
2023-24*
(జూలై 31 వరకు )
|
సిఐఎల్
|
54.15
|
74.89
|
99.13
|
60.85
|
69.33
|
52.03
|
ఎస్సిసిఎల్
|
1.609
|
3.189
|
5.255
|
4.712
|
5.148
|
3.912
|
* తాత్కాలిక
బొగ్గు ఉత్పత్తిలో ఎటువంటి కొరత లేదు. గనుల్లో వెలికితీసిన బొగ్గు నిల్వ చేయడానికి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైనప్పుడు బొగ్గు నిల్వ చేయడానికి సౌకర్యాలు అభివృద్ధి చేస్తున్నారు. నిల్వ చేసే సౌకర్యం అందుబాటులో లేకపోవడం వల్ల బొగ్గు ఉత్పత్తిని తగ్గించడం లేదు. స్వీయ దహన / ఆకస్మిక వేడిని నిరోధించడానికి ఉత్పత్తి అయిన బొగ్గును తరలించడానికి కంపెనీలు తదనుగుణంగాప్రణాళిక రూపొందిస్తాయి. ప్రమాదాలను ఎదుర్కోవటానికి తగినన్ని నివారణ చర్యలు అమలు జరుగుతున్నాయి. అగ్నిమాపక ఏర్పాట్లు గనులలో అందుబాటులో ఉన్నాయి.
కేంద్ర బొగ్గు, గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1946544)
Visitor Counter : 98