శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ప్రపంచంలోనే తక్కువ ఖర్చుతో కూడుకున్న ఆరోగ్య సంరక్షణ గమ్యస్థానంగా అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం
భారతదేశం గత తొమ్మిదేళ్లలో ప్రివెంటివ్ హెల్త్‌కేర్, ఫిజికల్ హెల్త్‌కేర్ మరియు ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ రంగాలలో ముందంజలో ఉంది. ఇది అత్యుత్తమ వైద్య పర్యాటక గమ్యస్థానంగా కూడా గుర్తింపు పొందింది: డాక్టర్ జితేంద్ర సింగ్
గత 9 సంవత్సరాలుగా భారతదేశాన్ని తక్కువ ఖర్చుతో కూడుకున్న వైద్య గమ్యస్థానంగా మారింది. అనేక ఆరోగ్య సంరక్షణ సంస్కరణలు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన నిబంధనలను ప్రారంభించడం వల్ల ఇది సాధ్యమైంది: డాక్టర్ జితేంద్ర సింగ్
అర్బన్ రూరల్ హెల్త్‌కేర్ డైకోటమీని అంతం చేయడానికి ప్రభుత్వం తన శాయశక్తులా ప్రయత్నిస్తోందని..డాక్టర్స్ ఆన్ వీల్స్ దానికి ఉత్తమ ఉదాహరణ అని తెలిపిన డాక్టర్ జితేంద్ర సింగ్
ఆయుష్మాన్ భారత్ ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆరోగ్య బీమా పథకం మరియు దానిని రూపొందించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్రెడిట్ దక్కుతుంది: డాక్టర్ జితేంద్ర సింగ్
ఇండియన్ అకాడమీ ఆఫ్ ఒటోరినోలారిన్జాలజీ హెడ్ & నెక్ సర్జరీ వార్షిక సమావేశాన్ని ప్రారంభించిన డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
05 AUG 2023 4:57PM by PIB Hyderabad
కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ఎంఓఎస్ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలో తక్కువ ఖర్చుతో కూడుకున్న ఆరోగ్య సంరక్షణ గమ్యస్థానంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. భారతదేశం ఇప్పటికే ప్రివెంటివ్ హెల్త్‌కేర్ మరియు ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ రంగాలలో ముందంజలో ఉందని కూడా తెలిపారు.
జమ్మూలోని కన్వెన్షన్ సెంటర్‌లో శ్రీ మాతా వైష్ణో దేవి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహించిన ఇండియన్ అకాడమీ ఆఫ్ ఒటోరినోలారిన్జాలజీ హెడ్ & నెక్ సర్జరీ వార్షిక సదస్సును ప్రారంభిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ విషయం చెప్పారు.

ఆయుష్మాన్ భారత్ ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆరోగ్య బీమా పథకమని, దీనిని రూపొందించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోదీకే చెందుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ నొక్కిచెప్పారు. అప్పటికే ఉన్నవ్యాధికి కూడా బీమా రక్షణను పొందే అవకాశాన్ని అందించే ఏకైక ఆరోగ్య బీమా పథకం బహుశా ప్రపంచంలోనే ఇదే మొదటిదని చెప్పారు. ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించినట్లయితే అతను వెళ్లి చికిత్స కోసం ఆర్థిక సహాయాన్ని పొందేందుకు స్వయంగా బీమా చేయించుకోవచ్చని అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఈ విధానం ఎక్కడా కనిపించదని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్‌ను తీసుకురావడం ద్వారా భారతదేశం ఆరోగ్య సేవల పంపిణీ యొక్క రంగాల మరియు విభజన విధానం నుండి సమగ్ర అవసరాల ఆధారిత ఆరోగ్య సంరక్షణ సేవకు మారిందని అన్నారు.
గత 9 సంవత్సరాలుగా భారతదేశాన్ని తక్కువ ఖర్చుతో కూడుకున్న వైద్య గమ్యస్థానంగా మార్చామని 2014లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి అనేక ఆరోగ్య సంరక్షణ సంస్కరణలు మరియు తీసుకొచ్చిన నిబంధనల కారణంగా ఇది సాధ్యమైందని అన్నారు. గతంలో భారతదేశం ఎటువంటి నివారణ ఆరోగ్య సంరక్షణకు ప్రసిద్ది చెందలేదని కానీ ఇప్పుడు భారతదేశం డిఎన్‌ఏ ఆధారిత కోవిడ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసిన ప్రపంచ వ్యాక్సినేషన్ హబ్‌గా గుర్తించబడిందని అలాగే ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంట్రా నాసల్ కోవిడ్ వ్యాక్సిన్, గర్భాశయ క్యాన్సర్ నివారణకు దేశీయంగా అభివృద్ధి చేయబడిన వ్యాక్సిన్, “సెర్వావాక్”, వివిధ వ్యాధులకు అనేక ఇతర టీకాలను తయారు చేస్తున్నామని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
ఆరోగ్య సంరక్షణ సేవల కోసం మరింత ప్రమోషన్ పిపిపి(పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) మోడల్‌ని డా.జితేంద్ర సింగ్ నొక్కిచెప్పారు. ఆరోగ్య సంరక్షణ సేవల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న అంతరాలను నివారించడానికి ఇది అవసరమని తెలిపారు. దీని కోసం అనేక అనూహ్యమైన కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. అవసరంలో ఉన్న చివరి వ్యక్తికి కూడా వైద్యం అందించడానికి ప్రభుత్వం చేపట్టిన 'డాక్టర్స్ ఇన్ వీల్స్' కార్యక్రమం ఇలాంటిదే.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని కేవలం 145 మెడికల్ కాలేజీలు ఉన్న దశనుండి ప్రస్తుతం 260కి పెరిగిందని అలాగే 16 ఎయిమ్స్, వందల కొద్దీ డయాలసిస్ సెంటర్లు మొదలైన గణాంకాలను బట్టి ప్రభుత్వ విధానాలను అంచనా వేయవచ్చని చెప్పాకు.స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్, స్పేస్ టెక్నాలజీలో దూసుకుపోతున్న చంద్రయాన్-3, క్వాంటమ్ టెక్నాలజీ వంటివి ఇటీవల విజయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
వార్షిక సదస్సులో ఇతర ప్రముఖులతో పాటు ఐఏఓహెచ్‌ఎన్‌ఎస్ ఛైర్మన్ పద్మశ్రీ డాక్టర్ మోహన్ కామేశ్వరన్, ఐఏఓహెచ్‌ఎన్‌ఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ మదన్ కప్రే, ఐఏఓహెచ్‌ఎన్‌ఎస్ డిక్రీజ్ డాక్టర్.పి.విజయకృష్ణన్, ఐఏఓహెచ్‌ఎన్‌ఎస్ ఆర్గ్. డాక్టర్ సునీల్ కొత్వాల్, ఐఏఓ హెచ్‌ఎన్‌ఎస్ ఆర్గ్. కార్యదర్శి డాక్టర్ రోహన్ గుప్తా మరియు డాక్టర్ ఐ.పి.సింగ్, డాక్టర్ ఆర్.ఎస్. ఆనంద్ కుమార్‌లు పాల్గొన్నారు.
<><><><><>
(Release ID: 1946186)
Visitor Counter : 160