ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఐఐటీ మద్రాస్ ఆగస్టు 6న నిర్వహించనున్న ‘డిజిటల్ ఇండియా ఆర్‌ఐఎస్‌సి-వి’ సింపోజియమ్‌కు హాజరుకానున్న ఎంఓఎస్ రాజీవ్ చంద్రశేఖర్
Posted On:
05 AUG 2023 12:23PM by PIB Hyderabad
ఐఐటీ మద్రాస్ మరియు ఐఐటీ-ఎం ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ ఆదివారం చెన్నైలో నిర్వహిస్తున్న ‘డిజిటల్ ఇండియా ఆర్‌ఐఎస్‌సి-వి’ సింపోజియంలో కేంద్ర పారిశ్రామిక వ్యవస్థాపకత, నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పాల్గొననున్నారు.
'ఆర్‌ఐఎస్‌సి-వి మార్గం ద్వారా భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ భవిష్యత్తు'ను ప్రదర్శించే ఈవెంట్‌కు విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు, పరిశోధకులు మరియు భారతదేశంలో పెరుగుతున్న ఆర్‌ఐఎస్‌సి-వి పర్యావరణ వ్యవస్థ గురించి అంతర్దృష్టులను పొందడానికి ఆసక్తి ఉన్న వారందరూ హాజరవుతారు.
శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ మరియు ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి ఇతర ప్రముఖులతో కలిసి ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారు.
ఈ సింపోజియంలో విద్యావేత్తలు మరియు పరిశ్రమ నిపుణుల ద్వారా తెలివైన సాంకేతికత విజ్ఞాన చర్చలు, స్వదేశీ ఆర్‌ఐఎస్‌సి-వి ప్రాసెసర్‌లను ప్రదర్శించే ఇంటరాక్టివ్ స్టాల్స్, ఆకర్షణీయమైన హ్యాకథాన్ మరియు ప్రత్యేక పెట్టుబడిదారుల సెషన్ ఉంటాయి.
ఆర్‌ఐఎస్‌సి-వి గురించి
'ఆర్‌ఐఎస్‌సి' అంటే 'రిడ్యూస్డ్ ఇన్‌స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్' మరియు '' వి అంటే ఐదవ తరం. ఆర్‌ఐఎస్‌సి-వి ప్రాజెక్ట్ 2010లో ప్రారంభమైంది. ఆర్‌ఐఎస్‌సి-వి అనేది ఓపెన్ స్టాండర్డ్ సహకారం ద్వారా ప్రాసెసర్ ఆవిష్కరణ యొక్క కొత్త శకాన్ని ప్రారంభిస్తుంది. అలాగే ఆర్కిటెక్చర్‌పై కొత్త స్థాయి ఉచిత, విస్తరించదగిన సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్ స్వతంత్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది, ఇది రాబోయే 50 ఏళ్ల కంప్యూటింగ్ డిజైన్ మరియు ఆవిష్కరణ సాంకేతికత కు మార్గం సుగమం చేస్తుంది. ప్రొఫెసర్ కామకోటి ఆర్‌ఐఎస్‌సి-వి ఐ ఎస్ ఎ ఆధారంగా భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ-పరిజ్ఞానం తో రూపొందించిన మైక్రోప్రాసెసర్ 'శక్తి'ని అభివృద్ధి చేశారు.
ఆర్‌ఐఎస్‌సి-వి ఫౌండేషన్ 2015లో స్థాపించబడింది, ఐఐటీ మద్రాస్ వ్యవస్థాపక సభ్యులలో ఒకటిగా ఉంది. డీఐఆర్-వి (డిజిటల్ ఇండియా ఆర్‌ఐఎస్‌సి-వి) మైక్రోప్రాసెసర్ ప్రోగ్రామ్‌ను భారత్ 2022లో ప్రారంభించింది.డిసెంబర్ 2023 నాటికి భవిష్యత్తులో భారతదేశంలో ప్రపంచానికి పరిశ్రమ-గ్రేడ్ సిలికాన్ మరియూ డిజైన్ మైక్రోప్రాసెసర్‌ల ఉత్పత్తిని ప్రారంభించటం విజయాలను సాధించడం అనే ఉత్తమ లక్ష్యం తో పనిచేస్తోంది.
ఆర్‌ఐఎస్‌సి-వి ఐ ఎస్ ఎ ఆధారిత డిజైన్‌లను అనేక కంపెనీలు మరియు స్టార్ట్-అప్‌లు ఉపయోగిస్తున్నాయి. ఇది సార్వత్రిక మరియు ఉచిత సాంకేతిక . ఆర్‌ఐఎస్‌సి-వి ఐ ఎస్ ఎ యొక్క బోధనాశాస్త్రం విద్యావేత్తల కోసం అనేక ఉత్తేజకరమైన పరిశోధనలు మరియు అనువర్తనాలతో పరిశ్రమ సంబంధిత పాఠ్యాంశాలను ఆవిష్కరిస్తుంది.
***
(Release ID: 1946165)
Visitor Counter : 134