రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

సైన్యంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం

Posted On: 04 AUG 2023 2:00PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఉన్న 'పీస్‌ స్టేషన్ల'లో పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీలు) దశలవారీగా ప్రవేశపెట్టాలని భారత సైన్యం ఆలోచిస్తోంది. నూతన సాంకేతికతలను స్వీకరించడం, హరిత ఇంధనానికి మద్దతు ఇవ్వడం, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ ఆలోచన వెనకున్న ఉద్దేశం. భారత సైన్యం దేశవ్యాప్తంగా ఈ కింది ఈవీలను ప్రవేశపెడుతోంది:

  • తేలికపాటి వాహనాలు (ఎలక్ట్రిక్)
  • బస్సులు (ఎలక్ట్రిక్)
  • మోటారు సైకిళ్లు (ఎలక్ట్రిక్)

రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

****



(Release ID: 1945971) Visitor Counter : 75