రక్షణ మంత్రిత్వ శాఖ
పపువా న్యూగినియాలోని పోర్ట్ మార్స్‌బైలో ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ కోల్‌కతా పోర్ట్ కాల్
प्रविष्टि तिथि:
03 AUG 2023 2:22PM by PIB Hyderabad
తూర్పు ఐఒఆర్‌లో మోహరించిన భారత నావికాదళ నౌకలు సహ్యాద్రి, కోల్కొటా, పపువా న్యూ గినియాతో నావికాదళ భాగస్వామ్యాన్ని, సహకారాన్ని పెంచేందుకు 02 ఆగస్టు 23న పోర్ట్ మోర్స్‌బైను చేరుకున్నాయి.
తన ప్రయాణంలో భాగంగా రేవును చేరుకున్న తర్వాత రెండు నౌకలకు చెందిన సిబ్బంది పిఎన్‌జి రక్షణ దళాలకు చెందిన సిబ్బందితో వృత్తిపరమైన పరస్పర చర్యలు, సాంస్కృతి మార్పిడి, యోగా సెషన్‌లు, నౌకల సందర్శనలతో సహా పలు కార్యకలాపాలలో పాల్గొంటారు. భారత్, పపువా న్యూ గినియా మధ్య సముద్ర/ నౌకా సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ పోర్ట్‌కాల్‌ను ఉద్దేశించారు.
దేశీయంగా రూపకల్పన చేసి, ప్రాజెక్ట్ -17 క్లాస్ మల్టీ రోల్ (బహుళ పాత్రలు పోషించగల) మూడవ రహస్య యుద్ధనావ అయిన ఐఎన్ఎస్ సహ్యాద్రికి కెప్టెన్ రాజ్‌కపూర్ నేతృత్వం వహిస్తున్నారు. దేశీయంగా రూపకల్పన చేసి, ప్రాజెక్ట్ -15 క్లాస్ కింద నిర్మించిన డెస్ట్రాయర్లలో ఐఎన్ఎస్ కోల్‌కతా మొదటిది. దీనికి కెప్టెన్ శరద్ సింసున్‌వాల్ నేతృత్వం వహిస్తున్నారు. రెండు నౌకలను ముంబైలోని మజాగాన్ డాక్ లిమిటెడ్‌లో నిర్మించారు. ఇవి మూడు కోణాలలో ముప్పులను ఎదుర్కోగల ఆధునిక ఆయుధాలు, సెన్సార్‌ల శ్రేణితో వాటిని సాయుధం చేశారు.
***
(रिलीज़ आईडी: 1945602)
आगंतुक पटल : 183