భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సముద్ర గర్భంలోని వనరులను అధ్యయనం చేసేందుకు ముగ్గురు సిబ్బందిని 6 కిలోమీటర్ల లోతుకు సబ్‌మెర్సిబుల్‌లో పంపాలన్నది సముద్రయాన్ ప్రాజెక్ట్ లక్ష్యం: శ్రీ కిరణ్ రిజిజు


సాగర వనరులను ఉపయోగించుకోవడం 'డీప్ ఓషన్ మిషన్' ఉద్దేశం: శ్రీ రిజిజు

Posted On: 03 AUG 2023 2:00PM by PIB Hyderabad

సముద్రయాన ప్రాజెక్టు కోసం, ముగ్గురు సిబ్బందిని సబ్‌మెర్సిబుల్‌లో 6,000 మీటర్ల లోతుకు పంపడం, సముద్ర గర్భంలో ఉన్న వనరులను అధ్యయనం చేయడం, జీవవైవిధ్యాన్ని అంచనా వేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర భూ శాస్త్ర శాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు వెల్లడించారు. వనరులను అన్వేషించడానికి సబ్‌మెర్సిబుల్‌ను ఉపయోగిస్తున్నందున, ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణ వ్యవస్థకు ఇబ్బంది కలిగించదని ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ విషయాన్ని వివరించారు.

కేంద్ర ప్రభుత్వ నీలి ఆర్థిక వ్యవస్థ విధానానికి డీప్ ఓషన్ మిషన్ మద్దతునిస్తుందని, దేశ జీడీపీ వృద్ధికి అవకాశం కల్పింస్తుందని తన సమాధానంలో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశ ఆర్థికాభివృద్ధి, మెరుగైన జీవనోపాధి, ఉద్యోగాలు, సముద్ర పర్యావరణ వ్యవస్థ మెరుగుదల కోసం సముద్ర వనరుల స్థిర వినియోగం డీప్ ఓషన్ మిషన్ ఉద్దేశంగా వెల్లడించారు.

 

****


(Release ID: 1945460) Visitor Counter : 155