భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

భారత ఉపఖండంపై వాతావరణ మార్పుల ప్రభావం

Posted On: 02 AUG 2023 4:17PM by PIB Hyderabad

భారత ఉపఖండంపై వాతావరణ మార్పుల ప్రభావంపై సమగ్ర అంచనాలతో ‘భారత ఉపఖండంపై వాతావరణ మార్పుల అంచనా’ను కేంద్ర భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ 2020లో ప్రచురించింది. ఆ నివేదికలోని ముఖ్యాంశాలు:

  1. 1901-2018 మధ్య కాలంలో భారతదేశ సగటు ఉష్ణోగ్రత దాదాపు 0.7 డిగ్రీల సెంటీగ్రేడ్లు పెరిగింది.
  2. 1950-2015లో రోజువారీ వర్షపాతం తీవ్రత (వర్షపాతం తీవ్రత >  రోజుకు 150 మి.మీ.) 75% పెరిగింది.
  3. 1951-2015 మధ్యకాలంలో భారతదేశంలో కరవుల రాక, ప్రాదేశిక పరిధి గణనీయంగా పెరిగాయి.
  4. గత రెండున్నర దశాబ్దాల్లో (1993-2017), ఉత్తర హిందు మహాసముద్రంలో సముద్ర మట్టం సంవత్సరానికి 3.3 మి.మీ. పెరిగింది.
  5. 1998-2018 రుతుపవనాల అనంతర కాలంలో అరేబియా సముద్రం మీద తీవ్రమైన తుపానులు ఏర్పడడం పెరిగింది.

భారత వాతావరణ విభాగం (ఐఎండీ), భారత ఉపఖండంలోని వాతావరణాన్ని ప్రతిరోజు పర్యవేక్షిస్తుంది, "వార్షిక వాతావరణ సారాంశం" పేరుతో ఏడాదికి ఒకసారి నివేదిక విడుదల చేస్తుంది. నెలవారీ వాతావరణ సారాంశాన్ని కూడా ఐఎండీ జారీ చేస్తుంది. వార్షిక వాతావరణ సారాంశంలో, ఒక ఏడాది కాలంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం, తీవ్రమైన వాతావరణ సంఘటనల గురించిన వివరాలు ఉంటాయి.

కేంద్ర భూ శాస్త్ర శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

****



(Release ID: 1945283) Visitor Counter : 100