ఉక్కు మంత్రిత్వ శాఖ
2023 జూలై నాటికి రికార్డుస్థాయిలో ఉత్పత్తి సాధించిన ఎన్.ఎం.డి.సి 100 మిలియన్ టన్నుల మైనింగ్ కంపెనీగా రూపుదిద్దుకుంటున్న ఎన్.ఎం.డి.సి
Posted On:
02 AUG 2023 12:43PM by PIB Hyderabad
నేషనల్ మినరల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్.ఎం.డి.సి), కేంద ఉక్కు మంత్రిత్వశాఖ కింద పనిచేస్తున్న
నవరత్న కంపెనీ. ఈ సంస్థ 2023 జూలై నాటికి అద్భుత ఫలితాలను సాధించింది. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు ఈ సంస్థ రికార్డు ఫలితాలను సాధించింది. 100 మిలియన్ టన్నుల మైనింగ్ కంపెనీగా ఈ సంస్థముందుకు వెళుతున్నది. ఎన్.ఎం.డి.సి వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాలలో చరిత్రాత్మక 40 మిలియన్ టన్నుల ఉత్పత్తిని దాటి పోతున్నది.
ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో 2023 జూలై నాటికి 13.15 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని
ఉత్పత్తి చేయగా అందులో 14.18 మిలియన్ టన్నులు అమ్మివేసింది. ఉత్పత్తి ,అమ్మకాలలో ఇంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే వరుసగా 20 శాతం, 33.5 శాతం వృద్ధి సాధించింది.2023 జూలై ఒక్క నెలలోనే ఎన్.ఎం.డి.సి సంస్థ 2.44 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేయగా, 3.03 మిలియన్ టన్నులను విక్రయించింది. దీనితో నెలవారీ వృద్ధి ఉత్పత్తిలో 19 శాతం , విక్రయంలో 2.7 శాతం గా ఉంది.
****
(Release ID: 1945232)
Visitor Counter : 117