ప్రధాన మంత్రి కార్యాలయం

మహిళల కుసాధికారిత కల్పన అంశం పై ఏర్పాటైన జి-20 మంత్రుల స్థాయి సమాశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


‘‘మహిళలు సంపన్నంఅయినప్పుడే, ప్రపంచం సమృద్ధంఅవుతుంది’’

‘‘భారతదేశం లోగ్రామీణ స్థానిక సంస్థల లో ఎన్నికైన ప్రతినిధుల లో 46 శాతం మంది ప్రతినిధులు అంటే 1.4 మిలియన్ మంది మహిళలు ఉన్నారు’’

‘‘భారతదేశం లో మహిళలు ‘మిశన్ లైఫ్’ - లైఫ్ స్ట‌యిల్ ఫార్ ఎన్ వైరన్ మంట్ కు ప్రధాన ప్రచార కర్తలు గా ఉన్నారు’’


‘‘ప్రకృతి తో మహిళలకు గల సన్నిహిత అనుబంధాన్ని పట్టి చూస్తే, వారు జలవాయు పరివర్తన  సంబంధి వినూత్న పరిష్కారాల సాధన లో కీలకం అనిచెప్పవచ్చును’’

‘‘బజారుల కు, గ్లోబల్ వేల్యూ- చైన్స్ కు మరియు తక్కువ ఖర్చు లో ఆర్థికసహాయం లభ్యత కు సంబంధించి మహిళల కు ఎదురవుతున్న అడ్డంకుల ను తొలగించడం కోసం మనంతప్పక పాటుపడాలి’’

‘‘జి-20 కి భారతదేశం అధ్యక్షత వహిస్తున్న తరుణం లో, ‘మహిళల కు సాధికారిత కల్పన’ అంశం పై ఒక క్రొత్త వర్కింగ్ గ్రూపు ను ఏర్పాటుచేయాలని నిర్ణయించడమైంది’’

Posted On: 02 AUG 2023 12:14PM by PIB Hyderabad

‘మహిళల కు సాధికారిత కల్పనఅంశం పై జి-20 మంత్రుల స్థాయి సమావేశం గుజరాత్ లోని గాంధీనగర్ లో ఏర్పాటు కాగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ సమావేశాన్ని ఉద్దేశించి ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించారు.

 

సమావేశం లో పాల్గొన్న జనసమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, గాంధీ మహాత్ముని పేరిట ఏర్పడ్డ గాంధీనగర్ యొక్క స్థాపన దినం సందర్భం లో ప్రముఖుల కు స్వాగత వచనాల ను పలికారు. వారి కి అహమదాబాద్ లోని గాంధీ ఆశ్రమాన్ని సందర్శించే అవకాశం లభిస్తున్నందుకు ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. జలవాయు పరివర్తన మరియు గ్లోబల్ వార్మింగ్ వంటి అంశాల కు సత్వర మరియు దీర్ఘకాలిక పరిష్కారాల ను కనుగొనవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, గాంధీ ఆశ్రమాన్ని సందర్శించడం ద్వారా గాంధీ జీ యొక్క జీవన శైలి తాలూకు సరళత్వాన్ని మరియు స్థిరత్వం, ఆత్మనిర్భరత, ఇంకా సమానత్వం ల వంటి దూరదృష్టి తో కూడిన ఆయన ఆలోచనల ను కూడాను గుర్తెరగవచ్చు అని ప్రధాన మంత్రి వివరించారు. ప్రముఖుల కు ఆశ్రమం సందర్శన ప్రేరణాత్మకం కాగలదన్న విశ్వాసాన్ని శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. దాండి కుటీర్ మ్యూజియమ్ ను కూడాను దర్శించవలసింది గా ఆయన సూచన చేశారు. గాంధీ గారు ఉపయోగించిన ఒక చరఖా అక్కడకు దగ్గరలోనే ఉన్న ఒక పల్లె లో గంగాబెన్ అనే ఒక మహిళ కు దొరికింది అని ఆయన వెల్లడించారు. అప్పటి నుండి గాంధీ గారు ఖాదీ ని ధరించడం మొదలుపెట్టారు, ఖాదీ అనేది ఆత్మనిర్భత కు మరియు సస్టేనబులిటీ కి ప్రతీక గా నిలచిపోయింది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

‘‘మహిళలు సంపన్నం అయినప్పుడు, ప్రపంచం సమృద్ధం అవుతుంది’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. మహిళల ఆర్థిక సాధికారత అభివృద్ధి కి ఊతం గా నిలుస్తుంది, మరి వారు చదువుకొన్నారంటే అది ప్రపంచాన్ని పురోగామి పథం లోకి తీసుకు పోతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. మహిళల నాయకత్వం సమాజం లో అన్ని వర్గాల ను కలుపుకొని ముందుకు పోవడాన్ని ప్రోత్సహిస్తుంది, అంతేకాక వారు వెల్లడించే అభిప్రాయాలు ఒక సకారాత్మకమైనటువంటి మార్పునకు స్ఫూర్తి ని ఇస్తాయి అని ఆయన అన్నారు. మహిళల సాధికారిత కల్పన కు అన్నింటి కంటే ప్రభావవంతం అయినటువంటి మార్గం ఏదంటే అది మహిళల నాయకత్వం లో అభివృద్ధి ని సాధించాలి అనేటటువంటి విధానమే అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. భారతదేశం ఈ దిశ లో పెద్ద పెద్ద అడుగుల ను వేస్తూ ముందుకు సాగిపోతున్నది అని ఆయన అన్నారు.

 

 

భారతదేశం యొక్క రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము స్వయం గా ఒక ప్రేరణ దాయకమైనటువంటి ఉదాహరణ ను అందిస్తున్నారు అని ప్రధాన మంత్రి నొక్కిపలికారు. ఆమె వినమ్రమైనటువంటి ఆదివాసి నేపథ్యం నుండి తాను వచ్చి ఉంటే వుండవచ్చును, అయినప్పటికీ కూడా ప్రపంచం లో అతి పెద్ద ప్రజాస్వామ్యాని కి ఆమె సారథ్యం వహిస్తున్నారు, అంతేకాదు ప్రపంచం లో కెల్లా రెండో అతి పెద్దదైనటువంటి రక్షణ బలగాని కి సర్వోన్నత కమాండర్ గా సైతం పాటు పడుతున్నారు అని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాని కి జనని అయినటువంటి ఈ దేశం లో వోటు వేసే హక్కును ఆది నుండి భారతదేశ రాజ్యాంగం మహిళలు సహా పౌరులు అందరికీ సమానం గా ధారదత్తం చేసింది. మరి అలాగే, ఎన్నికల లో పోటీ చేసేందుకు హక్కు ను సమానత్వం ప్రాతిపదిక నే మంజూరు చేయడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు. ఎన్నికైన మహిళా ప్రతినిధులు ఆర్థిక పరివర్తన కు, పర్యావరణ సంబంధి పరివర్తన కు మరియు సామాజిక పరివర్తన కు కీలకమైన ప్రతినిధులు గా ఉన్నారు. గ్రామ ప్రాంతాల స్థానిక సంస్థల లో ఎన్నికైన ప్రతినిధుల లో 46 శాతం మంది ప్రతినిధులు గా మహిళలే ఉన్నారు. వారి సంఖ్య 1.4 మిలియన్ గా ఉంది అని ప్రధాన మంత్రి వివరించారు. స్వయం సహాయ సమూహాల లో మహిళల కు ప్రేరణ ను అందించడం కూడాను మార్పు కు ఒక శక్తివంతమైన కారకం గా మారింది అని ఆయన నొక్కి చెప్పారు. ఎన్నికైన ప్రజా మహిళా ప్రతినిధులు మరియు స్వయం సహాయ సమూహాలు మహమ్మారి కాలం లో మన సముదాయాల కు దన్నుగా పని చేశాయి అని ప్రధాన మంత్రి వివరించారు. వారు సాధించిన కార్యసిద్ధుల ను గురించిన ఉదాహరణల ను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, మాస్కులు మరియు శానిటైజర్ ల తయారీ, మరి అలాగే సంక్రమణ ను అడ్డుకోవడం పట్ల చైతన్యాన్ని అంకురింపచేయడం గురించి మాట్లాడారు. ‘‘భారతదేశం లో నర్సులు మరియు ప్రసూతి వైద్యం అందించే వారిలో 80 శాతాని కి పైచిలుకు మహిళలే. మహమ్మారి కాలం లో, వారు మనకు ఒకటో పంక్తి రక్షణ వ్యవస్థ గా నిలచారు. మరి వారి కార్యసాధనల ను చూసుకొని మనం గర్వపడుతున్నాం’’ అని ఆయన అన్నారు.

 

 

మహిళల నేతృత్వం లో అభివృద్ధి సాధన అనేది ప్రభుత్వాని కి ఒక కీలక ప్రాధాన్యం గల అంశం గా ఉంటోంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి ముద్ర యోజన లో భాగం గా సూక్ష్మ స్థాయి యూనిట్ లకు సాయపడడం కోసం ఒక మిలియన్ రూపాయల వరకు సుమారు 70 శాతం రుణాల ను మహిళల కు మంజూరు చేయడం జరిగింది అని ఆయన అన్నారు. ఇదే విధం గా, స్టాండ్-అప్ ఇండియా లబ్ధిదారుల లో 80 శాతం మంది లబ్ధిదారులు గా మహిళలే ఉన్నారు. వారు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుల కోసం బ్యాంకుల నుండి రుణాల ను తీసుకొంటున్నారు అని ప్రధాన మంత్రి వివరించారు. స్వచ్ఛమైన వంట ఇంధనం పర్యావరణాన్ని నేరు గా ప్రభావితం చేస్తుంది అని ఆయన చెబుతూ, అది మహిళల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందన్నారు. ఈ సందర్భ లో ‘ప్రధాన మంత్రి ఉజ్జ్వల యెజన’ ను గురించి ఆయన ప్రముఖం గా పేర్కొంటూ, గ్రామీణ ప్రాంతాల మహిళల కు దాదాపు గా ఒక వంద మిలియన్ కుకింగ్ గ్యాస్ కనెక్శన్ లను అందించడమైంది అని తెలియ జేశారు. 2014 వ సంవత్సరం నాటి నుండి పారిశ్రామిక శిక్షణ సంస్థల లోని సాంకేతిక విద్య విభాగం లో మహిళ ల సంఖ్య రెట్టింపు అయింది. విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, ఇంజినీరింగ్, ఇంకా గణితం (ఎస్ టిఇఎమ్) పట్టభద్రుల లో భారతదేశం లో 43 శాతం పట్టభద్రులు గా మహిళలే ఉన్నారు. అంతేకాదు, భారతదేశం లో ఇంచుమించు నాలుగింట ఒక వంతు మంది అంతరిక్ష శాస్త్రవేత్తలు గా మహిళలే ఉన్నారు అని ఆయన వివరించారు. ‘‘చంద్రయాన్, గగన్ యాన్ మరియు మిశన్ మార్స్ ల వంటి మన ప్రతిష్టాత్మక కార్యక్రమాల సాఫల్యం వెనుక ఈ మహిళా శాస్త్రవేత్తల ప్రతిభ మరియు కఠోర శ్రమ ఉన్నాయి’’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం భారతదేశం లో పురుషుల కంటే మహిళలు ఉన్నత విద్య కోర్సుల లో ఎక్కువ గా చేరుతున్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. పౌర విమానయానం రంగం లో మహిళా పైలట్ ల శాతం అత్యధికంగా ఉన్న దేశాల లో భారతదేశం ఒక దేశం గా ఉంది, భారతదేశం యొక్క వాయు సేన లో మహిళా పైలట్ లు యుద్ధ విమానాల ను నడుపుతున్నారు అని ఆయన చెప్పారు. మన సాయుధ బలగాలన్నిటి లో మహిళా అధికారుల కు నిర్వహణ భూమికల ను ఇవ్వడం మరియు వారిని యుద్ధ రంగాల లో మోహరించడం జరుగుతోంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

 

గ్రామీణ ప్రాంతాల వ్యవసాయ కుటుంబాల కు వెన్నెముక గాను, అలాగే చిన్న వ్యాపారులు గాను మరియు దుకాణదారులు గాను మహిళలు ముఖ్య పాత్రల ను పోషిస్తున్న సంగతి ని ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొన్నారు. ప్రకృతి తో వారికి గల సన్నిహితమైన అనుబంధాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, జలవాయు పరివర్తన కు క్రొత్త క్రొత్త పరిష్కారాల ను కనుగొనడం లో కీలకమైన భూమిక ను మహిళలు పోషిస్తున్నారు అన్నారు. అమృత దేవి గారి నాయకత్వం లో రాజస్థాన్ లోని బిష్ణోయి సముదాయం 18 వ శతాబ్దం లో చిప్ కో ఉద్యమాన్నిఆరంభించి అడ్డూ ఆపు లేక చెట్ల ను నరికివేస్తున్న ధోరణి కి అడ్డుకట్ట ను వేశారు, తద్ద్వారా భారతదేశం లో మహిళలు తొలిసారిగా ప్రముఖమైన క్లయిమేట్ యాక్శన్ కు సారథ్యాన్ని ఏ విధం గా వహించిందీ ఆయన గుర్తు కు తీసుకువచ్చారు. ఆమె ఇతర పల్లెవాసులు అనేక మంది తో పాటుగా ప్రకృతి పరిరక్షణ ఆశయ సాధన లో తన ప్రాణాల ను అర్పించివేశారు అని ప్రధాన మంత్రి తెలియ జేశారు. ‘‘ ‘మిశన్ లైఫ్ - లైఫ్ స్ట‌యిల్ ఫార్ ఎన్ వైరన్ మంట్కు భారతదేశం లోని మహిళలు ప్రధాన ప్రచార కర్తలు గా కూడా ఉన్న సంగతి ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఇదే సందర్భం లో రెడ్యూస్, రీ యూస్, రీ సైకిల్, ఇంకా రీ-పర్పస్ సంబంధి అంశాల లో మహిళల లో ఉన్న సాంప్రదాయిక జ్ఞానాన్ని గురించి ప్రధాన మంత్రి వివరించారు. అనేక కార్యక్రమాల లో భాగం గా మహిళలు సౌర ఫలకాల ను మరియు దీపాల ను తయారు చేయడం లో శిక్షణ పొందుతున్నారన్నారు. గ్లోబల్ సౌథ్ దేశాల లో భాగస్వామ్య దేశాల తో అడుగులో అడుగు వేస్తూ సాగిపోవడం తో సఫలం అయినటువంటి సోలర్ మామాస్కార్యక్రమం గురించి ఆయన పేర్కొన్నారు.

 

 

‘‘మహిళా నవ పారిశ్రామికవేత్తలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కు చెప్పుకోదగిన తోడ్పాటు ను అందిస్తున్నారు అని’’ ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం లో మహిళా నవ పారిశ్రామికవేత్తల భూమిక ను గురించి ఆయన మాట్లాడారు. దశాబ్దాల కు పూర్వం 1959 వ సంవత్సరం లో గుజరాత్ కు చెందిన ఏడుగురు మహిళలు ముంబయి కి వెళ్ళి ఒక చరిత్రాత్మకమైనటువంటి సహకార ఉద్యమాన్ని మొదలు పెట్టారు. శ్రీ మహిళా గృహ ఉద్యోగ్ పేరు తో నడచిన ఆ ఉద్యమం లక్షల కొద్దీ మహిళ ల జీవనాన్ని మరియు వారి యొక్క కుటుంబాల జీవనాన్ని ఎంతగానో మార్చివేసింది అని ఆయన అన్నారు. వారు తీసుకు వచ్చిన ఉత్పాదనల లో లిజ్జత్ పాపడ్ అత్యంత ప్రఖ్యాతి ని దక్కించుకొందని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. ఆ తినుబండారం గుజరాత్ లో ఆహార పదార్థాల లో బహుశా చేరిపోయి ఉంటుందని ఆయన అన్నారు. పాడి రంగాన్ని గురించి కూడా ఆయన ఉదాహరణ గా పేర్కొంటూ, ఈ రంగం తో ముడిపడ్డ మహిళలు ఒక్క గుజరాత్ లోనే 3.6 మిలియన్ వరకు ఉన్నారని వెల్లడించారు. భారతదేశం లో దాదాపు గా 15 శాతం యూనికార్న్ స్టార్ట్-అప్స్ లో కనీసం ఒక మహిళ వ్యవస్థాపకురాలు గా ఉన్నారు అని శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు. మహిళల నేతృత్వం లోని ఈ యూనికార్న్ ల ఉమ్మడి విలువ 40 బిలియన్ డాలర్ కు పైచిలుకు గా ఉంది అని ఆయన అన్నారు. మహిళా కార్యసాధకులు ఆదర్శమూర్తులు గా నిలచేటటువంటి ఒక వేదిక ను నెలకొల్పవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. వారు బజారుల వద్ద కు , గ్లోబల్ వేల్యూ చైన్ ల వద్ద కు చేరుకోకుండాను మరియు ఆర్థిక సహాయాన్ని అందుకోకుండాను అడ్డు నిలుస్తున్న సమస్యల ను పరిష్కరించే దిశ లో కృషి సాగవలసి ఉంది అని ఆయన అన్నారు. అదే కోవ లో, సంరక్షణ సంబంధి భారాన్ని మరియు ఇంటి పనుల తాలూకు భారాన్ని సముచితమైన పద్ధతి ని అవలంబించడం ద్వారా తొలగించాలి అని కూడా ఆయన అన్నారు.

 

మహిళల నవ పారిశ్రామికత్వం, నాయకత్వం మరియు విద్య అంశాల పై మంత్రుల స్థాయి సమావేశం తీసుకొంటున్న శ్రద్ధ ను ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, మహిళల్లో డిజిటల్ లిటరసీ ని, ఇంకా ఫినాన్శల్ లిటరసీ ని వృద్ధి చెందింప చేయడం కోసం టెక్-ఈక్విటీ ప్లాట్ ఫార్మ్ను ప్రారంభించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, తన ప్రసంగాన్ని ముగించారు. జి-20 కి భారతదేశం అధ్యక్షత వహిస్తున్న ప్రస్తుత తరుణం లో మహిళల కు సాధికారిత కల్పన అంశం పై ఒక క్రొత్త వర్కింగ్ గ్రూపు ను ఏర్పాటు చేసే సన్నాహాలు సాగుతూ ఉన్నాయి అని కూడా ఆయన తెలియ జేశారు. గాంధీనగర్ లో ఎడతెగక సాగుతున్న ప్రయాస లు ప్రపంచవ్యాప్తం గా మహిళల కు బోలెడంత ఆశ ను మరియు ఆత్మవిశ్వాసాన్ని అందించగలుగుతాయి అనేటటువంటి నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

 

 

 

Addressing the G20 Ministerial Conference on Women Empowerment. @g20org https://t.co/mR5omtFHZf

— Narendra Modi (@narendramodi) August 2, 2023

*****

DS/TS



(Release ID: 1945145) Visitor Counter : 145