యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

భారతదేశంలో తొలిసారిగా జరుగుతున్న ఏసియన్ యూత్, జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలను గ్రేటర్ నోయిడాలో ప్రారంభించిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్సింగ్ ఠాకూర్

Posted On: 27 JUL 2023 8:17PM by PIB Hyderabad

 

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి  శ్రీ అనురాగ్  సింగ్ ఠాకూర్, 2023 జూలై 27 వ తేదీన ఏసియన్ యూత్,జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2023 పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలు
భారతదేశంలో తొలిసారిగా గ్రేటర్ నోయిడాలోని గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో జరుగుతున్నాయి.

ఈ అంతర్జాతీయ ఈవెంట్లో 30 మందికిపైఆ భారతీయ వెయిట్లిఫ్టర్లు పాల్గొంటున్నారు. ఇందులో ఎంతో మంది ఖేలో ఇండియా అథ్లెట్లు ఉన్నారు. వీరు గత నెలలో జరరిగిన కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గొని
భారతదేశానికి మొత్తం 61 మెడల్స్ సాధించిపెట్టినవారు.
ఈ ఈవెంట్ గురించి ప్రస్తావిస్తూ కేంద్ర  మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, " ఇండియా ఈ ప్రతిష్ఠాత్క ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తుండడం ఎంతో ఆనందంగా ఉంది. ఆసియా ప్రాంతం నుంచి 15కు పైగా దేశాలు
200 మంది అథ్లెట్లు, 50 మంది సాంకేతిక సిబ్బంది , కోచ్లు ఇందులో పాల్గొంటున్నారు. ఇలాంటి ఈవెంట్లు భవిష్యత్ క్రీడా విజయాలకు పునాదిగా నిలుస్తాయి. ఈ ఈవెంట్ లో పాల్గొంటున్న అథ్లెట్లందరికీ నా శుభాకాంక్షలు" అని ఆయన పేర్కొన్నారు.

వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను అభినందిస్తూ శ్రీ ఠాకూర్, " స్వల్పవ్యవధిలో ఇలాంటి భారీ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించడం సులభం కాదని నాకు తెలుసు, అయితే పట్టుదల ఉంటే కార్యసాధన   సాధ్యం మని , వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్
దాని అధ్యక్షుడు శ్రీ సహదేవ్ యాదవ్ నేతృత్వంలో నిరూపించి చూపారు. వారికి అభినందనలు" అని ఆయన అన్నారు.
భారతీయ  వెయిట్లిఫ్టర్లు సాధించిన విజయాల గురించి కూడా మంత్రి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన కరణం మల్లీశ్వరి, మీరా బాయ్ చాను ల పేర్లను ప్రస్తావించారు. మరింత శక్తితో పోటీపడడానికి యువతకు వీరు స్ఫూర్తిగా నిలుస్తారన్నారు.
మార్టినాదేవి, హర్షదా గరుడ్,ధనుష్ లోనాథన్లు గతలో ఖేలో ఇండియా పోటీలలో పలు మెడల్స్, ఇతర మెడల్స్ను సాధించిన విషయాన్నిప్రస్తావిస్తూ  వారికి అభినందనలు తెలిపారు.
ఏసియన్ యూత్, జూనియర్ వెయిట్ లిఫ్టిం ఛాంపియన్షిప్ పోటీలు జూలై 28న ప్రారంభమై, 2023 ఆగస్ట్ 5న  ముగుస్తాయి.

 

***



(Release ID: 1944947) Visitor Counter : 95