గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 ప్రణాళిక మరియు అమలు

Posted On: 31 JUL 2023 2:03PM by PIB Hyderabad

నగరాల్లో పారిశుధ్యం మరియు వ్యర్థాల నిర్వహణ యొక్క మొత్తం అమలును అంచనా వేయడానికి, గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ - 'స్వచ్ఛ్ సర్వేక్షణ్' వార్షిక సర్వేను నిర్వహిస్తుంది. అంతేకాకుండా  వార్షిక బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్) నగరాలు  మరియు చెత్త రహిత నగరాల (జీఎఫ్సీ) ధృవీకరణలను థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా పొందుతాయి.  రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ పురోగతిని ట్రాక్ చేయడం అనేది వీడియో కాన్ఫరెన్స్‌లు, వెబినార్లు, వర్క్‌షాప్‌లు మొదలైన వాటి ద్వారా మరియు ప్రత్యేక స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ పోర్టల్‌ల ద్వారా కాలానుగుణ సమీక్ష మరియు అంచనాల ద్వారా కూడా చేయబడుతుంది.

ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం, వందశాతం చెత్తను వేరుచేయడం, వేరుచేసిన చెత్త శాస్త్రీయ నిర్వహణ ద్వారా దేశంలోని అన్ని నగరాలను ఐదు సంవత్సరాల్లో  చెత్త రహిత నగరాల స్థాయికి తీసుకొచ్చే లక్ష్యంతో  స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 అక్టోబర్ 1, 2021న ప్రారంభించబడింది. లక్షలోపు జనాభా ఉన్న పట్టణాల్లో వ్యర్థాలను సురక్షితమైన పల్లపు ప్రదేశాలలో  పారవేయడంతో సహా  శుద్ధి చేయని మల బురద లేదా ఉపయోగించిన నీరు పర్యావరణంలోకి విడుదల చేయకుండా తగిన చర్యలు తీసుకోవడం, ఉపయోగించిన నీటిని (మురుగునీరు మరియు సెప్టేజీ, బూడిద నీరు మరియు నల్లనీరుతో సహా) సురక్షితంగా శుద్ధి చేయడంతోపాటు  రవాణా చేయడం, శుద్ధి చేసిన నీటిని గరిష్టంగా పునర్వినియోగం చేయడం ఈ మిషన్లో చేపడతారు. అంతేకాకుండా ఎళ్లతరబడి ఉన్న డంప్ సైట్లను గ్రీన్ జోన్లుగా మార్చడం వంటి చర్యలు చేపడతారు.  

స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద వ్యర్థాల నుండి కంపోస్ట్ (వేస్ట్ టు కంపోస్ట్), వేస్ట్-టు-ఎనర్జీ (వేస్ట్ టు ఎనర్జీ), బయో- వంటి వివిధ రకాల మున్సిపల్ సాలిడ్ వేస్ట్ (ఎంఎస్డబ్ల్యూ) నిర్వహణ ప్లాంట్ల ఏర్పాటు, మెథనేషన్, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్ (ఎంఆర్ఎఫ్) మరియు డంప్‌సైట్‌ల నివారణ, నిర్మాణం & కూల్చివేత వ్యర్థాలు మొదలైనవి. ఇంకా (i) మురుగునీటి శుద్ధి కర్మాగారాల (ఎస్టీపీలు)/ ఎస్టీపీ -కమ్ -ఫెకల్ ఏర్పాటు  స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు; (ii) పంపింగ్ స్టేషన్ల సదుపాయంతో సహా ఇంటర్‌సెప్షన్ మరియు డైవర్షన్ నిర్మాణాలను వేయడం మరియు ఎస్టీపీ వరకు మెయిన్/గ్రావిటీ మెయిన్‌ను పంపింగ్ చేయడం; (iii) తగిన సంఖ్యలో సెప్టిక్ ట్యాంక్ డెస్లడ్జింగ్ పరికరాలను సేకరించడం  కోసం రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందించబడుతుంది.

మొత్తం ₹15,883 కోట్లు మరియు ₹10884.80 కోట్లు వరుసగా స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.0 యొక్క యూడబ్ల్యూఎం మరియు స్వచ్ఛభారత్ మిషన్ కాంపోనెంట్‌కి అదనపు సెంట్రల్ అసిస్టెన్స్ (ఏసీఏ)గా కేటాయించబడ్డాయి.

హౌసింగ్ & పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***



(Release ID: 1944864) Visitor Counter : 97