రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
జన ఔషధి పరియోజన కింద నూతన ఉత్పత్తులు & న్యూట్రాస్యూటికల్స్ జోడింపు
1800 మందులు, 285 సర్జికల్ పరకరాలతో పెరిగిన ఉత్పత్తి గంప
Posted On:
28 JUL 2023 2:55PM by PIB Hyderabad
ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన (పిఎంబిజెపి) అమలు ఏజెన్సీ ఫార్మాస్యూటికల్ & మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (పిఎంబిఐ - భారత ఔషధాలు & వైద్యపరికరాల బ్యూరో) తమ అందించే ఔషధాల గంపలో మధుమేహ వ్యాధికి డపాగి్లఫ్లొజిన్ 10 ఎంజి & మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ (ఎక్స్‌టెండెడ్ రిలీజ్) 1000ఎంజి మాత్రలను, జన ఔషధి ప్రోటీన్ (హైప్రోటీన్) పౌడర్, జన ఔషధి ప్రోటీన్ ఫర్ వుమెన్ (వే ప్రోటీన్ పౌడర్) తదితరాలను జోడించింది.
ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన (పిఎంబిజెపి) అమలు ఏజెన్సీ ఫార్మాస్యూటికల్ & మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (పిఎంబిఐ - భారత ఔషధాలు & వైద్యపరికరాల బ్యూరో) క్రమంతప్పకుండా వివిధ మార్కెట్ సరళులను విశ్లేషిస్తుంది. ఈ విశ్లేషణల ఆధారంగా మందులను, ఇతర ఉత్పత్తులను తమ కేంద్రాలలో అందుబాటు ధరలలో విక్రయించేందుకు తమ జాబితాలో జోడిస్తుంది. ఈ మార్గంలోనే పిఎంబిఐ చక్కెర వ్యాధికి సంబంధించిన మందుల కొత్త రూపాంతరాలు కొన్నింటిని, భిన్న రకాల పోషక ఔషధాలను అందుబాటు ధరలలో విక్రయించేందుకు జోడించింది.
దేశవ్యాప్తంగా 31 డిసెంబర్ 2023 నాటికి 10,000 జన ఔషధి కేంద్రాలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 30 జూన్ 2023 నాటికి 9512 జన ఔషధి కేంద్రాలను తెరిచారు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన (పిఎంబిజెపి) ఉత్పత్తి గంపలో 1800 మందులు, 285 సర్జికల్ పరకరాలు, వినయోగ వస్తువులు ఉన్నాయి. ఈ ఉత్పత్తులు మార్కెట్‌తో పోలిస్తే 50% నుంచి 90% తక్కువ ధరలకు లభిస్తాయి.
పెరుగుతున్న చక్కెర వ్యాధి కేసులు, మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, జన ఔషధి తన జాబితాలో దిఉగవ పేర్కొన్న ఉత్పత్తులను ప్రారంభించడం ద్వారా ఇప్పటికే ఉన్న జాబితాకు అదనంగా జోడించాలని నిర్ణయించుకుంది. ఈ ఉత్పత్తులు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన జన ఔషధి కేంద్రాలలో సాధారణ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.
సీ.నెం. డ్రగ్ కోడ్ మందు పేరు ప్యాక్ సైజు జన ఔషధి రూ.లో
ఎంఆర్‌పి
1, 2099 మెటాఫార్మిన్ 1000ఎంజి
(ఎక్స్‌టెండెడ్ రిలీజ్)
డపాగ్లిఫ్లొజిన్ 10 ఎంజి మాత్రలు
షీటుకి 10 55/-
2. 2100 మెటాఫార్మిన్ హూడ్రోక్లోరైడ్
(ఎక్స్‌టెండెడ్ రిలీజ్ 500ఎంజి
డపాగ్లిఫ్లొజిన్ 10 ఎంజి మాత్రలు
షీటుకి 10 51.00/-
3. 2240 డయాబెటిస్ కేర్ ప్రోటీన్
పౌడర్ 400 గ్రా. సీసా 400.00/-
4. 2241 రీనల్ కేర్ ప్రోటీన్ పౌడర్
(తక్కువ ప్రోటీన్) 400.00/-
5. 2242 రీనల్ కేర్ ప్రోటీన్ పౌడర్
డయాలసిస్ రోగులకు
(హైప్రోటీన్) 400 గ్రా సీసా 500.00/-
6. 2246 జన ఔషధి వుమెన్ ప్రోటీన్
(చాక్లెట్) 250 గ్రా సీసా 230.00/-
7. 2247 జన ఔషధి వుమెన్ ప్రోటీన్
( వెనిల్లా ) 250 గ్రా సీసా 230.00/-
8. 2248 జన ఔషధి పోషన్ విత్ 10.00/-
కొకోవా 30 గ్రా శాచెట్
గత 9 ఏళ్ల లో, కేంద్రాల సంఖ్య వంద రెట్లు పెరుగగా, అమ్మకాలు 170 రెట్లు పెరిగాయి. డిసెంబర్ 31, 2023 నాటికి 10వేల కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన (పిఎంబిజెపి) దేశంలోని 651 జిల్లాల నుంచి జన ఔషధి కేంద్రాలను నిర్వహించేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది.
ఉత్పత్తి వివరణ బ్రోచర్ ను ఇక్కడ చూడవచ్చు.
***
(Release ID: 1943868)