పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చెన్నైలో జరిగిన జీ20 పర్యావరణ, వాతావరణ మంత్రుల సమావేశంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి ప్రారంభోపన్యాసం పూర్తి పాఠం

Posted On: 28 JUL 2023 10:27AM by PIB Hyderabad

ప్రముఖులారా

ఈ చారిత్రాత్మక , చైతన్యవంతమైన చెన్నై నగరంలో , భారత ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో జి 20 పర్యావరణ , వాతావరణ సుస్థిరత మంత్రుల స్థాయి (మినిస్టీరియల్)  సమావేశానికి నేను మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను.

ప్రముఖులారా , చెన్నై ఒక నగరం మాత్రమే కాదు, ఒక సెంటిమెంట్. ఇది భారతదేశం గర్వించదగ్గ నగరం. దానికి కారణం లేకపోలేదు. ఇది నైపుణ్యం, రంగు, సృజనాత్మకత , చరిత్ర కలిగిన ప్రదేశం. చరిత్రతో పాటు, చెన్నై రుచికరమైన ఆహారం, ఆహ్లాదకర సంగీతం, నృత్యం, సినిమాను అందిస్తుంది. మీరు ప్రస్తుతం ఉన్న ఈ చెన్నై నగరం విద్య, వైద్యం, హెవీ ఇంజనీరింగ్, ఆటోమొబైల్స్, లెదర్ వస్తువులు , సాఫ్ట్ వేర్ మొదలైన వాటి శక్తికి కేంద్రం.

ఎలాంటి ప్రయత్నం లేకుండానే చెన్నై పాత, కొత్త ఆలోచనలను జీవితం, శక్తి, అవకాశాలతో మిళితం చేస్తుంది. తొలి నగరపాలక సంస్థ ఏర్పాటుకు ఈ నగరం సాక్ష్యంగా నిలిచింది.

చెన్నై నగరాన్ని  కలిగి ఉన్న తమిళనాడు రాష్ట్రం కూడా చోళ రాజుల భూమి, వారు ఒక పెద్ద సముద్ర సామ్రాజ్యాన్ని పరిపాలించారు.  పర్యావరణ , వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిలో మాస్టర్లుగా నిలిచారు. దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన మానవ నిర్మిత చెరువులు ,ఆనకట్టలు (లేదా డ్యాం లు ) నీటి ప్రవాహాన్ని నిల్వ చేయడానికి , నియంత్రించడానికి ఇప్పటికీ ఉపయోగంలో ఉన్నాయి.

రాష్ట్రంలోని వృక్షజాలం, జంతుజాలం, సుసంపన్నమైన తీర, సముద్ర వనరులు దాని చరిత్రలో సుస్థిర అభివృద్ధి విధానానికి నిదర్శనం.

ప్రముఖులారా

పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి,  వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి దృఢమైన చర్యల ద్వారా స్థిరమైన, స్థితిస్థాపక , సమానమైన భవిష్యత్తు కోసం ప్రపంచ ప్రయత్నాలకు నాయకత్వం వహించే బృహత్తర బాధ్యతను మనం పంచుకుంటాము.

సుస్థిర ప్రపంచం కోసం స్ఫూర్తిదాయకమైన ప్రసంగం, దార్శనికతను అందించిన గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ప్రముఖులారా

మన గ్రూప్ -  20 అభివృద్ధిలో వివిధ స్థాయిలలో ఉన్న దేశాలను కలిగి ఉంది. ఈ కారణంగా, మన అభివృద్ధి ప్రాధాన్యతలు , దృక్పథాలు భిన్నంగా ఉండవచ్చు.  ఏదేమైనా, ఈ భూగోళం మన భూమాత పట్ల మ ఉమ్మడి ఆందోళనతో మనం ఐక్యంగా ఉన్నాము ప్రస్తుత , భవిష్యత్ తరాల కోసం దానిని రక్షించే బాధ్యతను తప్పక పంచుకుంటాము.

అన్నింటికీ మించి, మనం ఒకే భవిష్యత్తు కలిగిన ఒకే ప్రపంచం , ఒకే కుటుంబం.  ఏ విభేదాలను అయినా అధిగమించడానికి, స్థిరమైన స్థితిస్థాపక ప్రపంచం ఉమ్మడి దార్శనికత కోసం మనం కలిసి పనిచేయడం కొనసాగించాలి.

2022 లో ఇండోనేషియా వాతావరణ,  పర్యావరణ మంత్రుల స్థాయి సమావేశంలో, వనరుల సమాన పంపిణీతో పాటు ఉద్యోగాలు, వృద్ధి,  సుస్థిరతను సమ్మిళితం చేసే విధానం అవసరాన్ని మనం స్పష్టంగా చెప్పాం.

ఇప్పుడు, మనం తీవ్రమైన వాతావరణ,  పర్యావరణ సవాళ్లపై మన సామూహిక అవగాహనను మరింత బలోపేతం చేయాలి.  వాటిని ఎదుర్కోవడంలో ప్రపంచ ప్రయత్నాలకు మనం ఎలా నాయకత్వం వహించగలం.

ప్రముఖులారా

2023 లో చర్చల కోసం మనం అనేక కొత్త ముఖ్యమైన  ఇతివృత్త ప్రాధాన్యతాంశాలను తీసుకున్నాము.

జి 20 ఫోరమ్ లో మొదటిసారిగా, అటవీ కార్చిచ్చు, మైనింగ్ క్షీణించిన ప్రాంతాలను ప్రాధాన్య అంశాలుగా మనం  పరిశీలించాము. మన అనుభవాలు,  వాటిని పునరుద్ధరించడానికి ఉత్తమ పద్ధతులు ప్రెసిడెన్సీ డాక్యుమెంట్లలో చేర్చబడ్డాయి . భూ క్షీణత తటస్థత కోసం మన లక్ష్యాన్ని సాధించడానికి చర్యలను అమలు చేయడంలో ఇవి ఉపయోగపడతాయి.

సమీకృత జలవనరుల నిర్వహణ అంశాన్ని కూడా పరిష్కరించాము. 

జి 20లో ఉత్తమ పద్ధతులను ఒక సంకలనంలో పొందుపరిచాము. ఇది ఉపయోగకరమైన వనరు. 

సముద్ర సంబంధ ఎజెండాలో, స్థిరమైన,  స్థితిస్థాపక నీలి ఆర్థిక వ్యవస్థ (బ్లూ ఎకానమీ) ను అభివృద్ధి చేయడానికి సంబంధించిన సవాళ్లపై మనం దృష్టి పెట్టాము. తీరప్రాంత, సముద్ర పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ, సముద్ర ప్రాదేశిక ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడం, సముద్ర వ్యర్థాలను ఎదుర్కోవడం,  ఆదాయాన్ని పెంచడంపై దృష్టి సారించి ఓషన్ 20 డైలాగ్ రెండవ ఎడిషన్ ను మనం  నిర్వహించాము.

'సముద్ర ప్లాస్టిక్ వ్యర్థాలకు వ్యతిరేకంగా చర్యలపై జి 20 నివేదిక' ఐదవ ఎడిషన్‘  ను తీసుకురావడానికి మనం జపాన్ తో కలిసి పనిచేశాము. సముద్ర వ్యర్థాల సమస్యపై దృష్టిని ఆకర్షించడానికి మనం అనేక జి 20 దేశాలలోనూ, ఆహ్వానిత దేశాలలోనూ మెగా బీచ్ ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహించాము.

సుస్థిర జీవనశైలికి మద్దతు ఇచ్చే , ప్రవర్తన మార్పు శక్తిని గుర్తించే భూగోళ అనుకూల సామూహిక ప్రజా ఉద్యమాన్ని ఎలా నిర్మించవచ్చో చూపించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని జి 20 , అతిథి దేశాలకు నేను కృతజ్ఞతలు తెలియ జేయాలనుకుంటున్నాను. సుస్థిర అభివృద్ధి కోసం ఎల్ఐఎఫ్ఇ శైలులపై సమగ్ర సూత్రాలను జి 20 దేశాలు అంగీకరించాయని అభివృద్ధి మంత్రుల ద్వారా పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను.

సుస్థిరమైన, స్థితిస్థాపక నీలి (బ్లూ) లేదా సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ కోసం 'జీ20 ఉన్నత స్థాయి సూత్రాలను' అభివృద్ధి చేయడానికి మనం  పనిచేశాము. ఈ సూత్రాలను సముద్ర ఆర్థిక వ్యవస్థలో సుస్థిరతను తీసుకురావడానికి ఒక ఫ్రేమ్ వర్క్ గా స్వచ్ఛంద ప్రాతిపదికన ఉపయోగించవచ్చు. ప్రపంచ సముద్రం దాదాపు మూడు బిలియన్ల ప్రజల జీవనోపాధికి మద్దతు ఇస్తోంది.

జి 20 సభ్య దేశాలన్నీ తీరప్రాంత దేశాలు.  తీర , సముద్ర వనరులను రక్షించడం,  సంరక్షించడం , వాటిని బాధ్యతాయుతంగా ఉపయోగించడంపై వాటికి ఎంతో బాధ్యత ఉంది.

ఉక్కు వంటి రంగాలు, ఎక్స్ టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ (ఇ పి ఆర్ ) వంటి అంశాలను కవర్ చేస్తూ వనరుల సామర్థ్యం, సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడంపై కూడా మన దృష్టి ఉంది. నిన్న అనేక పరిశ్రమ భాగస్వాములతో రిసోర్స్ ఎఫిషియెన్సీ అండ్ సర్క్యులర్ ఎకానమీ ఇన్ఫర్మేషన్ కొయిలేషన్ (ఆర్ఇసిఇ ఐసి) ను ప్రారంభించడంతో మన ప్రయత్నాలు ముగిశాయి.

ప్రముఖులారా

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ప్రజాస్వామ్య దేశంగా, శక్తివంతమైన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత దేశం వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రపంచ పోరాటానికి  జి 20 తో కలిసినాయకత్వం వహించాలని ఆశిస్తోంది.

ప్రపంచ సంచిత ఉద్గారాల్లో భారత్ వాటా 4 శాతం కంటే తక్కువగా ఉండడం,  మన తలసరి ఉద్గారాలు ప్రపంచ సగటులో మూడింట ఒక వంతు ఉండటం గమనార్హం.

చారిత్రాత్మకంగా సమస్యలలో భాగం కానప్పటికీ భారతదేశం నిరంతరం పరిష్కారాల వనరుగా ఉంది. మేము దేశీయంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నాము, ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించాము.  ఐఎస్ఏ, సిడిఆర్ఐ, మిషన్ లైఫ్ ,  ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ వంటి వివిధ కార్యక్రమాల ద్వారా అంతర్జాతీయ ప్రయత్నాలకు చురుకుగా మార్గనిర్దేశం చేశాము.

ప్రముఖులారా

మనం గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, మన అభివృద్ధి, వాతావరణ లక్ష్యాలను చేరుకునే మార్గంలో ఇంకా మనం లేము. పేదరిక నిర్మూలన, ఇంధనం, వనరుల సమాన ప్రాప్యత, ఆహారం, నీటి భద్రతపై దృష్టి సారించి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో మన ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లాలి.

వాతావరణ మార్పులు, జీవవైవిధ్య నష్టం, ఎడారీకరణ ,కాలుష్యం వంటి సంక్లిష్టమైన, పరస్పర సంబంధం ఉన్న సవాళ్లను ఎదుర్కోవటానికి దేశాల మధ్య సహకారం కీలకం.

రోజంతా జరిగే చర్చల కోసం, మా ఒప్పందంలోని కీలక అంశాలను ప్రతిబింబించే ప్రెసిడెన్సీ డాక్యుమెంట్లు, ఫలితాల పత్రం, చైర్మన్ల విశ్లేషణ సారాంశం విడుదల కోసం ఎదురు చూస్తున్నాం. సార్వజనీన శ్రేయస్సు మన అంతిమ లక్ష్యం.   ఈ రోజు చెన్నైలో మనం ఆమోదించే ఫలితాలు ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక వేగాన్ని సృష్టించడంలో సహాయపడతాయని నేను విశ్వసిస్తున్నాను.

ధన్యవాదాలు

 

***


(Release ID: 1943745) Visitor Counter : 155