ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశంలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ మరింత వేగంగా అమలు జరిగేలా చూసేందుకు దేశవ్యాప్తంగా 100 మైక్రోసైట్స్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన నేషనల్ హెల్త్ అథారిటీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ తరహాలో చిన్న, మధ్యతరహా ఆరోగ్య కేంద్రాలతో కలిపి ఒక మైక్రో సైట్ ఏర్పాటు
Posted On:
28 JUL 2023 1:40PM by PIB Hyderabad
దేశంలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ మరింత వేగంగా అమలు జరిగేలా చూసేందుకు దేశవ్యాప్తంగా 100 మైక్రోసైట్స్ ప్రాజెక్ట్‌ను నేషనల్ హెల్త్ అథారిటీ ప్రారంభించింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ప్రారంభించిన మైక్రో సైట్ ప్రాజెక్టు వల్ల ఆరోగ్య సేవలు మరింత ఎక్కువగా అందుబాటులోకి వస్తాయి. ఏడిబిహెచ్ పరిధిలోకి వచ్చే అన్ని చిన్న, మధ్య తరహా క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు, ఆసుపత్రులు (ముఖ్యంగా <10 పడకలు), ల్యాబ్‌లు, ఫార్మసీలు, రోగులకు డిజిటల్ ఆరోగ్య సేవలు అందిస్తున్న ఇతర ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో కలిసి మైక్రోసైట్ ఏర్పాటవుతుంది. సమూహంగా ఉండాలి.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో మైక్రోసైట్లు ఏర్పాటవుతాయి. వీటిని ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ రాష్ట్ర మిషన్ డైరెక్టర్లు అమలు చేస్తారు దీనికి అవసరమైన ఆర్థిక వనరులు, మార్గదర్శకాలను నేషనల్ హెల్త్ అథారిటీ అందజేస్తుంది.
ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో, రోగులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని డిజిటల్ రూపంలో పొందుపరిచి ఆరోగ్య సేవలు అందించాలన్న లక్ష్యంతో మైక్రోసైట్స్ ప్రాజెక్ట్‌ను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలు చేస్తుంది. మైక్రోసైట్స్ ప్రాజెక్టు అభివృద్ధి చేయడానికి, నిర్వహించడానికి రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం భాగస్వామిని ఎంపిక చేస్తుంది. దీనికోసం ఒక ప్రత్యేక ఏజెన్సీ ఏర్పాటు చేయడానికి కూడా రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం చర్యలు అమలు చేయవచ్చు.మైక్రో సైట్ లో వివిధ వైద్య విధానాల ద్వారా అన్ని ఆరోగ్య సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు వివిధ రకాల ఔషధాలు అందుబాటులో ఉంచుతారు. ప్రైవేట్ రంగానికి చెందిన హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రీ (HPR), హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ (HFR) వంటి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ మాడ్యూల్స్‌లో నమోదు అవుతారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అప్లికేషన్‌లను నెలకొల్పాల్సి ఉంటుంది. ఈ కేంద్రాలను సందర్శించే రోగులు వారి ఆరోగ్య రికార్డులను వారి ఏబిహెచ్ఏ కి అనుసంధానం చేయడంతో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సేవలు పొందడానికి అర్హత సాధిస్తారు. ఆరోగ్య సేతు వంటి వారి మొబైల్ ఫోన్ అప్లికేషన్‌లలో ఏబిహెచ్ఏ వారికి అందుబాటులో ఉంటుంది.
ప్రాజెక్టు వివరాలను నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ వివరించారు. ' దేశవ్యాప్తంగా 100 మైక్రోసైట్‌లను స్థాపించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాము.ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పరిధిలోకి చిన్న-మధ్య తరహా ఆరోగ్య సంరక్షణ సంస్థలను తీసుకురావడానికి కేంద్రీకృత ప్రయత్నాలు జరుగుతాయి. దీనివల్ల ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రైవేటు రంగంలో కూడా అమలు జరుగుతుంది. ఈ చర్య వల్ల దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సేవలు మరింత ఎక్కువగా అందుబాటులోకి వస్తాయి.' అని నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓతెలిపారు.
ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందిస్తున్నచిన్న-మధ్యతరహా సంస్థలకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రయోజనాల గురించి అవగాహన కల్పించి వాటిని ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో నమోదు చేయడానికి మైక్రోసైట్‌ల ద్వారా నమోదు చేయడానికి కృషి జరుగుతుంది.ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ గుర్తించిన డిజిటల్ పరిష్కారాలు ఉపయోగించాలని , డిజిటల్ హెల్త్ రికార్డ్‌లను లింక్ చేయడం ప్రారంభించాలని ప్రాజెక్టు లక్ష్యంగా నిర్ణయించుకుంది. దీనివల్ల దేశంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ మరింత పటిష్టంగా, సమర్థంగా అమలు జరుగుతుంది.
2023మే 31న దేశవ్యాప్తంగా మైక్రోసైట్‌ల కోసం నేషనల్ హెల్త్ అథారిటీ మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరింత సమాచారాన్ని https://abdm.gov.in/microsites ద్వారా పొందవచ్చు.
***
(Release ID: 1943737)
Visitor Counter : 154