గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్
Posted On:
27 JUL 2023 4:05PM by PIB Hyderabad
కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల (MoHUA) మంత్రిత్వశాఖ వీధి వ్యాపారులకు పి.ఎం.స్వనిధి పేరుతో 2023 జూన్ 1న మొబైల్ యాప్ను ఆవిష్కరించింది.
ఈ మొబైల్ యాప్ ద్వారా వీధివ్యాపారులు రుణానికి , పిఎం స్వనిధి పథకం కింద లెటర్ ఆఫ్ రెకమండేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. వీధివ్యాపారులు, తమ రుణ దరఖాస్తులు ఏ దశలో ఉన్నాయి, నగదు ఎంత వచ్చింది వంటివి ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 26.04.2022 నాటి నిర్ణయం ప్రకారం, పిఎం స్వనిధి కింద నిర్దేశించిన టార్గెట్ 2024 డిసెంబర్ నాటికి మొదటి, రెండవ, మూడవ రుణాలకు వరుసగా రు 42 లక్షలు, రు12 లక్షలు, రు3 లక్షలు
ప్రధానమంత్రి వీధివ్యాపారుల ఆత్మనిర్బర్ నిధి (పిఎం స్వనిధి) పథకాన్ని, వీధివ్యాపారులు తమ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించేందుకు వారికి హామీ లేని వర్కింగ్ కాపిటల్ను సమకూర్చే లక్ష్యంతో తీసుకువచ్చారు.
2023 జూలై 20 వ తేదీ నాటికి ఈ పథకం కింద 50.63 లక్షల రుణాలు పంపిణీ చేశారు. వీటి విలువ రూ 6,492.02 కోట్లు. వీటిని 38.53 లక్షల మంది వీధి వ్యాపారులకు పంపిణీ చేశారు.
పట్టణ ప్రాంతాలలో వ్యాపారం చేసే వీధి వ్యాపారులకు పిఎం స్వనిధి పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ పథకాన్ని 2022 మార్చి నుంచి 2024 డిసెంబర్ వరకు పొడిగించారు. దీని వల్ల మరింత మంది వీధివ్యాపారులు
ఈ పథకం కిందికి రావడానికి వీలు కలుగుతుంది.
పిఎం స్వనిధి పథకం కింద, స్వనిధి సే సమృద్ధి అంశాన్ని 2021 జనవరి 4న ప్రారంభించారు. వీధివ్యాపారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు , లబ్ధిదారులకు అండగా ఉండేందుకు దీనిని ఏర్పాటు చేశారు.
ఈ పథకం లబ్దిదారులను ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న 8 సంక్షేమ పథకాలతో అనుసంధానం చేశారు. తద్వారా వారి సంపూర్ణ ప్రగతికి,సామాజిక ఆర్థిక పురోగతికి ఇది ఉపకరిస్తుంది. అనుసంధానం చేసిన పథకాలలో
పి.ఎం. జీవన జ్యోతి బీమా యోజన, పిఎం సురక్ష బీమా యోజన, పిఎం జన్ ధన్ యోజన, ఒక దేశం ఒక రేషన్ కార్డు, పిఎం శ్రమయోగి మాన్ధన్ యోజన, భవన, ఇతరనిర్మాణ వర్కర్ల (బిఒసిడబ్ల్యు), జనని సురక్ష యోజన,
పిఎం మాతృ వందన యోజన వంటివి ఉన్నాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ ఈరోజు లోక్సభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1943581)
Visitor Counter : 167