యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
రాబోయే వరల్డ్ యూనివర్శిటీ గేమ్స్ కోసం 4 ఫెన్సర్లకు ఎస్ ఏ ఐ ఆర్థిక సహాయం అందించనుంది
Posted On:
26 JUL 2023 4:40PM by PIB Hyderabad
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ ఏ ఐ) చైనాలోని చెంగ్డూలో జరగనున్న వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ కోసం ఎస్ ఏ ఐ నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ నుండి నలుగురు ఫెన్సర్లకు ఆర్థికంగా మద్దతు ఇస్తుంది. ఫెన్సర్‌లలో అభయ్ కృష్ణ షిండే (ఎన్ సి ఓ ఈ పాటియాలా మరియు టాప్స్ అథ్లెట్), దుర్గేష్ మిలింద్ జహగీర్దార్ (ఎన్ సి ఓ ఈ ఔరంగాబాద్ మరియు ఖేలో ఇండియా అథ్లెట్) మరియు ఎన్ సి ఓ ఈ పాటియాలా అథ్లెట్లు తన్ను గులియా మరియు శిక్షా బల్లూరియా ఉన్నారు.
వరల్డ్ యూనివర్శిటీ గేమ్స్ అథ్లెట్లకు అంతర్జాతీయ అనుభవం లాభిస్తుందనే ఉద్దేశ్యంతో ఫెన్సింగ్ యొక్క వార్షిక క్యాలెండర్ ఫర్ ట్రైనింగ్ అండ్ కాంపిటీషన్ (ACTC) ప్లాన్‌ల క్రింద ఈ ఈవెంట్ కవర్ చేయబడనందున అథ్లెట్లకు ప్రత్యేక కేసుగా నిధులు ఇవ్వాలని ఎస్ ఏ ఐ నిర్ణయించింది. పోటీ యొక్క 31వ ఎడిషన్ జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు షెడ్యూల్ చేయబడింది.
వరల్డ్ యూనివర్శిటీ గేమ్స్‌కు అర్హత సాధించిన వారిలో ఎన్ సి ఓ ఈ అథ్లెట్లు ఎన్ సి ఓ ఈ బెంగళూరు అథ్లెట్లు హర్దీప్ (రేస్ వాకింగ్) మరియు కీర్తి (హై జంప్), ఎన్ సి ఓ ఈ త్రివేండ్రం యొక్క తైక్వాండో క్రీడాకారిణులు శివంగి చనంబం మరియు పార్సిదా నొంగ్‌మైథం అలాగే ఎన్ సి ఓ ఈ ఇటానగర్ వుషు క్రీడాకారిణి సన్మా బ్రహ్మ తో సహా పలువురు వున్నారు.
****
(Release ID: 1943088)
Visitor Counter : 98