రైల్వే మంత్రిత్వ శాఖ
జగ్జీవన్ ఆర్పిఎఫ్ అకాడమీ లక్నోలో కొత్తగా నిర్మించిన జాతీయ అమరవీరుల స్మారక చిహ్నం ఆవిష్కరణ
1957 నుండి ఇప్పటి వరకు 1014 మంది అమరవీరులైన ఆర్పిఎఫ్ సిబ్బంది పేర్లు స్మారక చిహ్నంపై స్థానం
Posted On:
24 JUL 2023 4:40PM by PIB Hyderabad
జగ్జీవన్ ఆర్పిఎఫ్ అకాడమీ లక్నోలో కొత్తగా నిర్మించిన జాతీయ అమరవీరుల స్మారకం, రైల్వే భద్రతపై నేషనల్ మ్యూజియంను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ శ్రీ సంజయ్ చందర్ ఈరోజు ఆవిష్కరించారు.
ఈ అమరవీరుల స్మారకం 4800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ స్మారక చిహ్నంపై 1957 నుండి ఇప్పటి వరకు 1014 మంది అమరవీరుల ఆర్‌పిఎఫ్ సిబ్బంది పేర్లను చెక్కారు. వారికి ఆర్‌పిఎఫ్ తరపున నివాళులు అర్పించారు.
ఈ మ్యూజియం సందర్శకుడికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చరిత్ర, ఆవిర్భావం, విజయాలు, విధులు, బాధ్యతల పూర్తి సంగ్రహావలోకనం లభిస్తుంది. ఈ మ్యూజియం మొత్తం 9000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 37 థీమాటిక్ డిస్‌ప్లే ప్యానెల్‌లు, 11 డిస్‌ప్లే క్యాబినెట్‌లు, పోలీసింగ్ ఇన్ఫో-గ్రాఫిక్ హిస్టరీ, 87 కళాఖండాలు, నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా నుండి 500 పేజీలు, గత కాలానికి చెందిన 36 ఆయుధాలు, రైల్వేకు సంబంధించిన 150 ర్యాంక్‌లు, అనేక ఇతర ర్యాంక్‌లు, అనేక ఇతర రైల్వే అంశాలు ఉన్నాయి.
.
ఈ మ్యూజియం నినాదం జ్ఞానవర్ధనాయచసంరక్షణాయ ... ఇది 'జ్ఞానాన్ని ప్రోత్సహించడానికి, వారసత్వాన్ని సంరక్షించడానికి' అనే అర్థం. ఇది ఆర్పిఎఫ్ ని నిరంతరం ప్రేరేపిస్తుంది. ఇది కాకుండా, సెంట్రల్ ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్ డిపో కిర్కీ, ఖడ్కీ, పూణే నుండి వార్ ట్రోఫీ టి-55 ట్యాంక్‌ను స్వీకరించి, అకాడమీ క్యాంపస్‌లో కొత్తగా నిర్మించిన బ్యాడ్మింటన్, లాన్ టెన్నిస్ కోర్ట్, ఆర్పి ఎఫ్ స్పెషల్ బ్యాండ్‌ను కూడా డైరెక్టర్ జనరల్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆవిష్కరించారు.
******
(Release ID: 1942390)
Visitor Counter : 95