ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప్రత్యక్ష నగదు బదిలీ సబ్సిడీ పథకాల ద్వారా రెవిన్యూ పొదుపు.

Posted On: 24 JUL 2023 4:29PM by PIB Hyderabad

ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి), ప్రభుత్వం చేపట్టిన ఇతర సంస్కరణల ద్వారా నకిలీ లబ్దిదారులు, మోసపూరిత లబ్ధిదారుల వంటివి అరికట్టడానికి వీలు కలిగింది. దీనివల్ల వృధావ్యయాన్ని అరికట్టగలిగారు.దీనితో లక్షిత లబ్ధిదారులకు పథకాలు సక్రమంగా అందడానికి వీలు కలిగింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి  శ్రీ పంకజ్‌ చౌదరి లోక్‌ సభకు ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
ప్రత్యక్ష నగదు బదిలీ, ప్రభుత్వం చేపట్టిన ఇతర సంస్కరణల ద్వారా ప్రధాన కీలక కేంద్ర పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా పొదుపు అయిన మొత్తం కింది విధంగా ఉంది.
ఆర్థిక                    

సంవత్సరం    ..        అంచనా
                                పొదుపు  (రూ. కోట్లలో)
``````````````````````````````````````
2017`18                   32983.41
2018`19                   52157.19
2019`20                   36226.74
2020`21                   44571.78  

***



(Release ID: 1942301) Visitor Counter : 158