సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

చేతితో నేసిన ఖాదీ జాతీయ జెండాలు

Posted On: 24 JUL 2023 4:18PM by PIB Hyderabad

భారత జాతీయ పతాకం నియమావళి-2002ను 30.12.2021 నాటి ఆదేశం 02/01/2020- పబ్లిక్ (పార్ట్-III) ద్వారా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సవరించింది. “భారతదేశ జాతీయ జెండాను చేతితో లేదా యంత్రంతో తయారు చేయాలి. పత్తి/పాలిస్టర్/ఉన్ని/పట్టుతో రూపొందించాలి” అని సవరించింది.

అధికారిక కార్యక్రమాల్లో జాతీయ జెండా ప్రదర్శన మార్గదర్శకాల ప్రకారం, “భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్‌) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా, ఆ సంస్థ ప్రామాణిక గుర్తు ఉన్న పతాకాలను మాత్రమే అన్ని అధికారిక కార్యక్రమాల్లో ఉపయోగించాలి".

షాజహాన్‌పూర్‌లోని ఆర్డినెన్స్ క్లోథింగ్‌ ఫ్యాక్టరీలో తయారైన పట్టు జెండాను ఆగస్టు 15న ఎర్రకోటపై ఆవిష్కరిస్తారు. భారత జాతీయ పతాకం నియమావళికి అనుగుణంగా ఈ జెండా తయారవుతుంది.

ప్రజా/ప్రభుత్వ శాఖల కోసం, ఇండియన్ స్టాండర్డ్-I (ఐఎస్‌-I) జాతీయ జెండాను తయారు చేయడానికి మొత్తం 4 ఖాదీ సంస్థలకు బీఐఎస్‌ అనుమతి ఉంది. ఐఎస్‌-I జాతీయ పతాకాలను ఉత్పత్తి చేసే ఖాదీ సంస్థల పేర్లు ఇవి:

  1. కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ్ స్మౌక్త సంఘ్ సమాఖ్య, హుబ్లీ, కర్ణాటక
  2. మధ్య భారత్ ఖాదీ సంఘ్, గ్వాలియర్, మధ్యప్రదేశ్
  3. ఖాదీ డైర్స్ అండ్‌ ప్రింటర్స్, బొరివలి, మహారాష్ట్ర
  4. ధార్వాడ్ తాలూకా గరగ్ క్షేత్రీయ సేవ సంఘం, కర్ణాటక

కేంద్ర సూక్ష్మ, చిన్న & మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ ఇవాళ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

*****



(Release ID: 1942292) Visitor Counter : 79


Read this release in: English , Urdu , Hindi , Tamil