ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ మదన్ దాస్దేవి కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
24 JUL 2023 9:27AM by PIB Hyderabad
ఆర్ఎస్ఎస్ కు చెందిన సీనియర్ నేత శ్రీ మదన్ దాస్ దేవి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
శ్రీ మదన్ దాస్ దేవి తన జీవనాన్ని దేశ సేవ లో సమర్పణం చేశారని ఒక ట్వీట్ లో శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మరణించిన నేత తో తనకు గల ప్రగాఢమైనటువంటి వ్యక్తిగత అనుబంధాన్ని కూడా ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకోవడం తో పాటు తాను ఆయన నుండి ఎంతో నేర్చుకొన్నానన్నారు.
ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి -
‘‘శ్రీ మదన్ దాస్ దేవి గారి కన్నుమూత వార్త తెలిసి అత్యంత దుఃఖం కలిగింది. ఆయన తన పూర్తి జీవనాన్ని దేశ సేవ కు అంకితం చేసి వేశారు. ఆయన తో నాకు ప్రగాఢమైన అనుబంధం ఉండటం ఒక్కటే కాకుండా సదా ఎంతో నేర్చుకొనే అవకాశాలు కూడా లభించాయి. ఈ శోక ఘడియ లో ఆయన యొక్క కుటుంబ సభ్యుల కు మరియు కార్యకర్త లు అందరి కి ఆ ఈశ్వరుడు ఊతాన్ని అందించు గాక. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
***
DS/AK
(Release ID: 1942006)
Visitor Counter : 142
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam