హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో 108 అడుగుల ఎత్తైన శ్రీరాముని విగ్రహానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా


మంత్రాలయంలో ఏర్పాటు చేయనున్న 108 అడుగుల శ్రీరాముని విగ్రహం మన సనాతన ధర్మ సందేశాన్ని యావత్ ప్రపంచానికి అందించడమే కాకుండా దేశంలోనూ, ప్రపంచంలోనూ వైష్ణవ సంప్రదాయాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

మంత్రాలయం దాస సాహిత్య ప్రకల్పం ఆధ్వర్యంలో గృహనిర్మాణం, అన్నదానం, ప్రాణదానం, విద్యాదానం, తాగునీరు, గోసంరక్షణ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు.

గొప్ప విజయనగర సామ్రాజ్యం తుంగభద్ర నది ఒడ్డున ఉద్భవించింది. ఇది మొత్తం దక్షిణాది నుండి ఆక్రమణదారులను తరిమికొట్టడం ద్వారా స్వదేశ్ మరియు స్వధర్మాన్ని పునరుద్ధరించింది.

ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ పనులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.

త్వరలో శ్రీరామ మందిరంలో రాంలాలా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. వందేళ్ల తర్వాత మరోసారి శ్రీరాముడు తన సొంత స్థలంలో కొలువుదీరనున్నారు.

Posted On: 23 JUL 2023 6:38PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో 108 అడుగుల ఎత్తైన శ్రీరాముని విగ్రహానికి కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా ప్రసంగిస్తూ "ఈరోజు కర్నూలులోని మంత్రాలయంలో 500 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించనున్న శ్రీరాముని మహా విగ్రహానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. మంత్రాలయంలో నెలకొల్పనున్న ఈ 108 అడుగుల శ్రీరాముని విగ్రహం అనేక యుగాలుగా వెలుగులీనుతున్న మన సనాతన ధర్మ సందేశాన్ని యావత్ ప్రపంచానికి అందిస్తుందని..దేశంలోనూ, ప్రపంచంలోనూ వైష్ణవ సంప్రదాయాన్ని బలోపేతం చేస్తుందని చెప్పారు. మన హిందూ సంస్కృతిలో 108 చాలా పవిత్రమైన సంఖ్య అని శ్రీ షా అన్నారు.

తుంగభద్ర నది ఒడ్డున ఉన్న మంత్రాలయం గ్రామంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ఉందని, రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర హోంమంత్రి, సహకార శాఖ మంత్రి తెలిపారు. మంత్రాలయం గ్రామం రాఘవేంద్ర స్వామి ఆలయానికి ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. ఈ ప్రదేశానికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. గొప్ప విజయనగర సామ్రాజ్యం తుంగభద్ర నది ఒడ్డున ఉద్భవించింది, ఇది మొత్తం దక్షిణాది నుండి ఆక్రమణదారులను తరిమికొట్టడం ద్వారా స్వదేశ్ మరియు స్వధర్మాన్ని పునరుద్ధరించింది. మంత్రాలయం దాస్ సాహిత్య ప్రకల్పం కింద గృహనిర్మాణం, అన్నదానం, ప్రాణదానం, విద్యాదానం, తాగునీరు, గోసంరక్షణ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని శ్రీ షా తెలిపారు.

ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారని అమిత్ షా అన్నారు. ఇప్పుడు త్వరలో శ్రీరామ మందిరంలో రామ్‌లాలా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు మరియు వందల సంవత్సరాల తర్వాత మరోసారి శ్రీరాముడు తన సొంత స్థలంలో కొలువుతీరనున్నారని తెలిపారు. మంత్రాలయంలో శ్రీరాముని బృహత్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి మఠంలోని మఠాధీశుడు, అత్యంత గౌరవనీయమైన సన్యాసి మధ్వాచార్య జీ, సన్యాసి రాఘవేంద్ర స్వామి జీ, దక్షిణాదిలోని అత్యంత గొప్ప వైష్ణవ సంప్రదాయం మరియు దానిలోని సాధువులందరికీ నివాళులర్పించారు.



 

******


(Release ID: 1941981) Visitor Counter : 159