పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మధ్యప్రదేశ్‌లోని ఖజరహోలో జూలై 25న జరగనున్న 5వ హెలికాప్టర్ & స్మాల్ ఎయిర్‌క్రాఫ్ట్ సమ్మిట్

Posted On: 23 JUL 2023 10:13AM by PIB Hyderabad
  • సమ్మిట్‌ను ప్రారంభించనున్న  మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్  మరియు కేంద్ర పౌర విమానయాన & ఉక్కుశాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా
  • మారుమూల మరియ కొండ ప్రాంతాల్లో ఉడాన్ పథకం పరిధిని మెరుగుపరచడమే ఈ సమ్మిట్‌ లక్ష్యం


5వ హెలికాప్టర్ అండ్ స్మాల్‌ ఎయిర్‌క్రాఫ్ట్ సమ్మిట్‌ను  మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వం, పవన్ హన్స్ లిమిటెడ్ మరియు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌ఐసిసిఐ)లు సంయుక్తంగా 25 జూలై 2023న మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో నిర్వహిస్తున్నాయి. ఈవెంట్ యొక్క థీమ్ "చివరి మైలును చేరుకోవడం: హెలికాప్టర్లు & చిన్న విమానాల ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీ". దీనిని మధ్యప్రదేశ్  ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మరియు కేంద్ర పౌర విమానయాన & ఉక్కుశాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా ప్రారంభిస్తారు. ఈవెంట్ ఫార్మాట్‌లో ప్రారంభ సెషన్‌తో పాటు సాంకేతిక సెషన్ ఉంటుంది.

సమ్మిట్ యొక్క విస్తృత లక్ష్యాలు:

 

  • భారతీయ హెలికాప్టర్ మరియు స్మాల్ ఎయిర్‌క్రాఫ్ట్ పరిశ్రమ వృద్ధి కథనాన్ని చర్చించడానికి పరిశ్రమ వాటాదారులందరికీ మరియు విధాన రూపకర్తలకు ఉమ్మడి వేదికను అందించడం
  • మారుమూల మరియు కొండ ప్రాంతాలలో ఉడాన్ స్కీమ్  పరిధిని మెరుగుపరచడం మరియు దేశంలోని గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ కనెక్టివిటీని విస్తరించడం
  • అంతరాయం లేని సేవలను అందించడం ద్వారా ఇప్పటికే ఉన్న మరియు  టూరిజం హాట్‌స్పాట్‌లు ఉన్న ప్రదేశాలకు హెలికాప్టర్ & స్మాల్ ఎయిర్‌క్రాఫ్ట్ కనెక్టివిటీని పెంచడం

భారతదేశ రవాణా పర్యావరణ వ్యవస్థలో హెలికాప్టర్లు మరియు చిన్న విమానాలు సమగ్ర పాత్ర పోషిస్తాయి. సివిలియన్ హెలికాప్టర్‌లు, ప్రత్యేకించి మారుమూల ప్రాంతాలలో పర్యాటకానికి విపరీతమైన సామర్థ్యాన్ని అందిస్తూ పర్యాటకులు సుందరమైన ప్రకృతి దృశ్యాలు మరియు సాంస్కృతిక గమ్యస్థానాలను ప్రత్యేక మార్గాల్లో అనుభవించడానికి వీలు కల్పిస్తూ, మెరుగైన ప్రాప్యతకు దోహదం చేస్తాయి. హెలికాప్టర్ సేవలు అందించే ఇతర పాత్రలలో అత్యవసర వైద్య సేవలు మరియు వరదల సమయంలో విపత్తు నిర్వహణ, రెస్క్యూ ఆపరేషన్లు మొదలైనవి కూడా ఉన్నాయి.

అదేవిధంగా చిన్న విమానాలు వ్యాపార మరియు విశ్రాంతి ప్రయాణీకులకు సమర్థవంతమైన మరియు సౌకర్యవంతమైన రవాణా ఎంపికలను అందిస్తాయి. ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి మరియు అంతగా అభివృద్ధి చెందని గమ్యస్థానాల అన్వేషణను ప్రోత్సహిస్తాయి. తద్వారా విమానయానం మరియు పర్యాటక పరిశ్రమలు ఒకదానికొకటి ప్రయోజనం పొందుతాయి. ఉపాధి అవకాశాలను పెంపొందించుకుంటాయి మరియు దేశవ్యాప్తంగా ఆర్థిక వృద్ధిని పెంచుతాయి.

భారత పౌర విమానయాన పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న కీలక సమయంలో ఈ సమ్మిట్ జరగుతుంది. ఆర్థికం మరియు ఉపాధి  అనే రెండు ముఖ్యమైన అంశాలు ఎల్లప్పుడూ దానితో పాటు తీసుకువస్తున్నందున ఈ రంగం ఇప్పుడు భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళికి అవసరమైనదిగా మారింది.

5వ హెలీ సమ్మిట్ భారతదేశ పౌర విమానయాన పరిశ్రమను మరింత పెంచే సమర్థవంతమైన మరియు హేతుబద్ధమైన నిర్ణయాలను అమలు చేయడానికి విధాన నిర్ణేతలతో నిమగ్నమై మరియు సహకరించడానికి పరిశ్రమ వాటాదారులను కలిసి తీసుకువస్తుంది.

5వ హెలికాప్టర్ & స్మాల్ ఎయిర్‌క్రాఫ్ట్ సమ్మిట్‌ టీజర్‌ను ఇక్కడ చూడవచ్చు:

https://twitter.com/MoCA_GoI/status/1682617297276370944?s=20

4వ హెలీ-ఇండియా సమ్మిట్ 2022 గురించిన సమాచారాన్ని ఇక్కడ చదవవచ్చు:

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1866510

 

***


(Release ID: 1941883) Visitor Counter : 171