యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
'ఫిట్ ఇండియా క్విజ్ 2022' రాష్ట్ర స్థాయి విజేతలను రేపు ముంబైలో సన్మానించనున్న కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్
प्रविष्टि तिथि:
22 JUL 2023 6:03PM by PIB Hyderabad
2వ 'ఫిట్ ఇండియా క్విజ్'లో రాష్ట్ర స్థాయి విజేతలను కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ సన్మానించనుంది. రేపు, ముంబైలోని BKCలో సన్మాన వేడుకను నిర్వహిస్తుంది. కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఫిట్ ఇండియా క్విజ్ 2022 రాష్ట్ర స్థాయి విజేతలకు నగదు బహుమతులు, ధృవపత్రాలను కేంద్ర మంత్రి ప్రదానం చేస్తారు.
ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఫిట్ ఇండియా క్విజ్‌ను ప్రారంభించారు. ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని 2019లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెంచి, ఆరోగ్యకర భారత్‌ను తీర్చిదిద్దడం దీని లక్ష్యం.
ఫిట్ ఇండియా క్విజ్ 2022లో విజేతలకు ₹3.25 కోట్ల నగదు బహుమతి అందుతుంది. పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న దేశంలో అతి పెద్ద క్విజ్ ఇది. 'ఫిట్ ఇండియా నేషనల్ ఫిట్‌నెస్ అండ్ స్పోర్ట్స్ క్విజ్' రెండో ఎడిషన్‌ను, గత ఏడాది ఆగస్టు 29న, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రామాణిక్ ప్రారంభించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశ క్రీడా చరిత్ర, శారీరక దారుఢ్యం, పోషకాహారానికి సంబంధించిన ప్రశ్నలను ఈ క్విజ్‌లో అడుగుతారు.
****
(रिलीज़ आईडी: 1941845)
आगंतुक पटल : 132