రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

రహదారి భద్రతను మెరుగుపరచడానికి ఎక్స్‌ప్రెస్‌వేలు మరియు జాతీయ రహదారులపై సిగ్నల్స్‌ కోసం కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది

Posted On: 21 JUL 2023 6:44PM by PIB Hyderabad

రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఒఆర్‌టిహెచ్‌) ఎక్స్‌ప్రెస్‌వేలు మరియు జాతీయ రహదారులపై సిగ్నల్స్‌ ఏర్పాటు కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఆమోదించిన తాజా మార్గదర్శకాలు డ్రైవర్లకు మెరుగైన దృశ్యమానత మరియు స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని అందించడానికి ఉత్తమ పద్ధతులు మరియు ప్రపంచ ప్రమాణాలను చేర్చడం ద్వారా రహదారి భద్రతను మరింత మెరుగుపరచడంపై దృష్టి సారించింది.

రహదారి సంకేతాలు రహదారి ప్రయాణంలో ముఖ్యమైన భాగాలు. ఎందుకంటే అవి డ్రైవర్లకు ముఖ్యమైన సమాచారం మరియు సూచనలను అందిస్తాయి. తదనుగుణంగా, సంబంధిత ఐఆర్‌సి కోడ్‌లు & మార్గదర్శకాలు, వివిధ అంతర్జాతీయ కోడ్‌లలో సూచించిన ప్రస్తుత పద్ధతులు అలాగే ట్రాఫిక్ నిబంధనలను మెరుగ్గా పాటించేలా సమాచారం మరియు కార్యాచరణ దృక్పథం ప్రకారం సంకేతాలను అందించడాన్ని ఎంఒఆర్‌టిహెచ్‌ సమీక్షించింది. మార్గదర్శకాలు డ్రైవర్లకు స్పష్టమైన మరియు సంక్షిప్త మార్గదర్శకత్వం, హెచ్చరికలు, నోటీసులు మరియు నియంత్రణ సమాచారాన్ని అందించడానికి రూపొందించబడ్డాయి. తద్వారా రహదారులపై అవాంతరాలు లేని మరియు సురక్షితమైన ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి.

మార్గదర్శకాల యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలు:

 

  • మెరుగైన విజిబిలిటీ మరియు లెజిబిలిటీ: సముచితమైన ఎత్తు/దూరంలో ఉంచడం, పెద్ద అక్షరాలు, చిహ్నాలు మరియు డ్రైవర్లను త్వరితగతిన అర్థం చేసుకోవడానికి చిన్న లెజెండ్‌ల ద్వారా రహదారి సూచికల మెరుగైన దృశ్యమానతకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రతికూల పరిస్థితుల్లో కూడా కీలకమైన సమాచారం తక్షణమే కనిపించేలా మరియు అర్థమయ్యేలా చూడ్డం.
  • సహజమైన కమ్యూనికేషన్ కోసం  వర్ణనలు: అవసరమైన సందేశాలను ప్రభావవంతంగా తెలియజేయడానికి టెక్స్ట్‌తో పాటు చిత్ర ప్రాతినిధ్యాలు, తద్వారా పరిమిత అక్షరాస్యత ఉన్నవారితో సహా విభిన్న రహదారి వినియోగదారులకు అందించబడతాయి.
  • ప్రాంతీయ భాషలు: రహదారి సంకేతాలపై బహుభాషా విధానాన్ని ఆమోదించడం ఆంగ్లం మరియు ప్రాంతీయ భాషలను ఉపయోగించడం, విభిన్న రహదారి వినియోగదారులతో సమర్థవంతమైన కమ్యూనికేషన్‌ను నిర్ధారించడం, ట్రాఫిక్ నిబంధనలను బాగా అర్థం చేసుకోవడం మరియు పాటించడాన్ని ప్రోత్సహించడం.
  • ఫోకస్డ్ లేన్ క్రమశిక్షణ: డ్రైవర్లకు స్పష్టమైన  మార్గదర్శకత్వంతో వ్యూహాత్మక స్థానాలు, నిర్దేశించిన లేన్‌లకు కట్టుబడి ఉండడాన్ని ప్రోత్సహించడం మరియు ట్రాఫిక్ రద్దీని తగ్గించడం ద్వారా మెరుగైన లేన్ క్రమశిక్షణను ప్రోత్సహించడంపై ప్రత్యేక శ్రద్ధ ఇవ్వబడింది.
  • దశలవారీ అమలు: ప్రారంభ దశలో రాబోయే అన్ని హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు మరియు గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌లలో మార్గదర్శకాలు అమలు చేయబడతాయి. అదనంగా, 20,000 కంటే ఎక్కువ ప్యాసింజర్ కార్ యూనిట్‌లతో (పిఎస్‌యులు) అధిక ట్రాఫిక్ పరిమాణాన్ని ఎదుర్కొంటున్న హైవేలు కూడా ఈ మార్గదర్శకాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వబడతాయి.

దేశవ్యాప్తంగా రహదారి భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వ నిబద్ధతను ఈ మార్గదర్శకాలు  హైలైట్ చేస్తాయి. ఉత్తమ పద్ధతులు మరియు ప్రపంచ ప్రమాణాలను స్వీకరించడంతో, రోడ్డు వినియోగదారులందరికీ సురక్షితమైన మరియు సమర్థవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడం ఎంఒఆర్‌టిహెచ్‌ లక్ష్యం. ప్రమాద రహిత రహదారుల వైపు మరింత ముందుకు సాగుతుంది.

 

https://morth.gov.in/sites/default/files/circulars_document/Guidelines%20for%20provision%20of%20signages%20on%20Expressway%20and%20NHs%2020%20Jul%202023.pdf

 

***



(Release ID: 1941546) Visitor Counter : 180