రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఇండియన్ నేవీ క్విజ్ - సెయిల్ బియాండ్ హారిజాన్


జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రెండు రౌండ్లలో ఇండియన్ నేవీ రెండవ ఎడిషన్ క్విజ్ నిర్వహణ

జాతీయ స్థాయిలో జరిగే పోటీలో దేశం నలుమూలల నుంచి 10,000కు పైగా పాఠశాలలు పాల్గొనే అవకాశం - గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ఫైనల్స్

ఇంటర్నేషనల్ రౌండ్ లో పాల్గోనున్న జీ- 20 (+09) దేశాల ఆహ్వానితులు - ఇండియా గేట్ వద్ద ఫైనల్స్ నిర్వహణ
వివరాలు theindiannavyquiz.in

Posted On: 21 JUL 2023 12:38PM by PIB Hyderabad

జీ-20 సెక్రటేరియట్, భారత నౌకాదళం , నేవీ వెల్ఫేర్ అండ్ వెల్నెస్ అసోసియేషన్ (ఎన్ డబ్ల్యూడబ్ల్యూఈ) సహకారంతో  నిర్వహిస్తున్న ఇండియన్ నేవీ క్విజ్ 'G20 THINQ ' రెండో ఎడిషన్ ను  భారత నౌకాదళం ప్రారంభించింది. వివిధ ప్రాంతాలు, భౌగోళిక ప్రాంతాలకు చెందిన యువతను ఏకతాటిపైకి తెచ్చి, 'వసుదైక  కుటుంబం ' - ప్రపంచమే ఒకే కుటుంబం  స్ఫూర్తితో శాశ్వత స్నేహాలు ఏర్పడాలి అన్న లక్ష్యంతో   జాతీయ, అంతర్జాతీయ క్విజ్ పోటీగా ఈ క్విజ్ ను రూపొందించారు.  9 నుంచి 12వ తరగతి వరకు చదివే పాఠశాల విద్యార్థులకు, తత్సమాన విద్యార్థులకు ఒక ప్రత్యేకమైన, మరుపురాని అనుభవాన్ని అందిస్తుంది.

గత ఏడాది దేశవ్యాప్తంగా 6425 పాఠశాలలు పాల్గొన్న THINQ  -22 అద్భుత విజయం సాధించింది. దీనిని స్ఫూర్తిగా తీసుకొని ఈ   ఏడాది  అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని భారత నౌకా దళం నిర్ణయించింది.  ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు స్ఫూర్తితో పనిచేయాలని జీ--20 దేశాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా నౌకాదళం క్విజ్ రూపొందింది.  జాతీయ వారసత్వ, సంస్కృతి, విలువల ప్రతిబింబించే విధంగా క్యిజ్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  

జీ- 20 THINQ   రెండు స్థాయిల్లో  జరుగుతుంది.  నేషనల్ రౌండ్,ఇంటర్నేషనల్ రౌండ్ పోటీలు నిర్వహిస్తారు.  నేషనల్ రౌండ్ లో దేశం వివిధ ప్రాంతాలకు చెందిన  10,000కు పైగా పాఠశాలలు పాల్గొంటాయని అంచనా. 2023 నవంబర్ 16న ముంబైలో జరిగే సెమీ ఫైనల్స్ జరుగుతుంది. సెమీ ఫైనల్ లో పాల్గొనడానికి  పదహారు పాఠశాలలను ఎంపిక చేస్తారు.  2023 నవంబర్ 18న ప్రఖ్యాత గేట్వే ఆఫ్ ఇండియా వద్ద ఫైనల్ లో మొదటి 8 స్థానాల్లో నిలిచిన  జట్లు జాతీయ కిరీటం కోసం పోటీ పడతాయి. అంతర్జాతీయ రౌండ్ లో పాల్గొనడానికి  ఇద్దరు ప్రధాన విద్యార్థులు , ఒక స్టాండ్ బై తో కూడిన భారత జట్టును జ్యూరీ ఎంపిక చేస్తుంది.  సెమీ ఫైనల్ చేరే  మొత్తం పదహారు జట్ల సభ్యులు  నావల్ డాక్ యార్డ్ ను సందర్శిస్తారు. యుద్ధ నౌకలు, జలాంతర్గాముల్లో పనిచేస్తున్న నౌక దళ సిబ్బందితో వీరు మాట్లాడుతారు. 

ఇంటర్నేషనల్ రౌండ్ లో జీ-20 (+09) దేశాలకు చెందిన  ఆహ్వానితులు పాల్గొంటారు, ప్రతి దేశం తొమ్మిది నుండి పన్నెండో తరగతి వరకు లేదా తత్సమానమైన తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థుల బృందాన్ని నామినేట్ చేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇంగ్లీష్ లో క్విజ్ నిర్వహిస్తారు. 2023 నవంబర్ 22న ప్రఖ్యాత ఇండియా గేట్ వద్ద జరిగే అంతర్జాతీయ ఫైనల్స్ లో  భారత జట్టుతో పాటు పాల్గొనడానికి  పదకొండు అంతర్జాతీయ జట్లను   పాల్గొనడానికి ఎంపిక చేస్తారు 

సాంస్కృతిక అవగాహన, సుహృద్భావం పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించాలని నౌకా దళం నిర్ణయించింది.  పోటీల్లో పాల్గొనేవారు మధురమైన జ్ఞాపకాలు , కొత్త, శాశ్వత స్నేహాలతో తిరిగి వెళ్తారని నౌకాదళం హామీ ఇస్తోంది.

నేషనల్ రౌండ్ కోసం పాఠశాల రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం ప్రారంభమయ్యాయి.  ఇప్పటికే వెయ్యికి పైగా పాఠశాలలు పోటీల్లో పాల్గొనడానికి రిజిస్టర్ అయ్యాయి.  అన్ని పాఠశాలలు ఈ ప్రత్యేకమైన పోటీలో పాల్గొనాలని, ఉత్తమ విద్యార్థులను పోటీకి పంపాలని నౌకా దళం కోరింది. 

 

మరిన్ని వివరాలు, రిజిస్ట్రేషన్ కోసం అధికారిక G20 THINQ  వెబ్ సైట్  'theindiannavyquiz.in'ను సందర్శించండి.

ఆలస్యం చేయకండి ! రిజిస్ట్రేషన్లు 31 జూలై 20 23 తో ముగుస్తాయి.  సరిహద్దులకు అతీతంగా జరుగుతున్నక్విజ్ లో పాల్గొని విజయవంతం చేయండి.  

 

***


(Release ID: 1941502) Visitor Counter : 175