నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

అమలులోకి వచ్చిన 'ఇండియా క్లైమేట్‌ ఎనర్జీ డాష్‌బోర్డ్‌' (ఐసీఈడీ)


వాతావరణ కార్యాచరణ పురోగతిని తెలుసుకోవడానికి దాదాపు వాస్తవ-సమయ సమాచారం అందించనున్న ఐసీఈడీ

500 కొలమానాలు కలిగిన సమీకత డేటాబేస్‌తో ఉండే వినియోగదారు-స్నేహపూర్వక వేదిక

Posted On: 20 JUL 2023 5:49PM by PIB Hyderabad

'ఇండియా క్లైమేట్‌ ఎనర్జీ డాష్‌బోర్డ్‌' (ఐసీఈడీ) 3.0ను నీతి ఆయోగ్ ఈ రోజు విడుదల చేసింది. ప్రభుత్వం ప్రచురించిన మూలాధారాల ఆధారంగా ఇంధన రంగం, వాతావరణం, సంబంధిత ఆర్థిక విభాగాల సమాచారం కోసం దాదాపు వాస్తవ-సమయ సమాచారం అందించేందుకు సృష్టించిన ఏక గవాక్ష వేదిక ఇది.

వినియోగదారు-స్నేహపూర్వక వేదికగా ఐసీఈడీ 3.0ను అభివృద్ధి చేశారు. విశ్లేషణాత్మక ఇంజిన్‌ ద్వారా సమాచారాన్ని ఉచితంగా చూడడానికి, విశ్లేషించడానికి ఇది అనుమతిస్తుంది. కీలక సవాళ్లను గుర్తించేలా ఇంధనం & వాతావరణ రంగాలపై అవగాహన పెంచుతుంది. అందుబాటులో ఉన్న కొలమానాల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. అందువల్ల, భారతదేశం స్వచ్ఛ ఇంధన పరివర్తన పురోగతిని పర్యవేక్షించడంలో ఈ పోర్టల్‌ చాలా ఉపయోగపడుతుంది.

ఈ డ్యాష్‌బోర్డులో 500 పైగా కొలమానాలు, 2000కు పైగా సమాచార గ్రాఫిక్స్‌, అనేక దృశ్యరూప సమాచారాలను అందిస్తుంది. దీనివల్ల, భారతదేశ ఇంధన రంగంపై వినియోగదార్లకు సంపూర్ణ అవగాహన లభిస్తుంది.

 

***


(Release ID: 1941287) Visitor Counter : 248


Read this release in: English , Urdu , Marathi , Hindi