పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పోర్ట్ బ్లెయిర్‌లోని వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 18 JUL 2023 3:28PM by PIB Hyderabad

710 కోట్ల వ్యయంతో 40837 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం నిర్మించబడింది.

ఇది రద్దీ సమయాల్లో 1200 మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా విమానాశ్రయ ఆవరణలో స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు కేంద్ర పౌర విమానయాన మరియు ఉక్కు శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, జనరల్ విజయ్ కుమార్ సింగ్ (రిటైర్డ్), ఎం ఓ ఎస్, సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ, అడ్మిరల్ డీ. కె. జోషి (రిటైర్డ్), లెఫ్టినెంట్ గవర్నర్, అండమాన్ & నికోబార్ దీవులు మరియు శ్రీ రాజీవ్ బన్సల్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి సమక్షంలో ప్రారంభించారు. 

 

విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనాన్ని రూ. 710 కోట్లతో, 40,837 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, రద్దీ సమయాల్లో 1200 మంది ప్రయాణికులకు సేవలు అందించగల సామర్థ్యం తో నిర్మించారు. ఇది ప్రస్తుత సామర్థ్యం కంటే మూడు రెట్లు ఎక్కువ. సుందరమైన ద్వీపాల యొక్క గొప్ప జీవవైవిధ్యం నుండి ప్రేరణ పొందిన పోర్ట్ బ్లెయిర్ టెర్మినల్ భవనం సముద్రం మరియు ద్వీపం యొక్క అందాలను ప్రతిబింబించే ముత్యపుచిప్ప ఆకారపు నిర్మాణం. టెర్మినల్ భవనం పగటిపూట పూర్తిగా సహజమైన వెలుగు వచ్చే విధంగా రూపొందించబడింది. స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ విగ్రహాన్ని కూడా విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు.

 

ఈవెంట్‌ను హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిమోట్ బటన్‌ను నొక్కడం ద్వారా టెర్మినల్ భవనాన్ని ప్రధాని ప్రారంభించారు  ఇతర ప్రముఖులు విమానాశ్రయంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.  స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ (వీర్ సావర్కర్) కి నివాళిగా ఆయన విగ్రహాన్ని పౌర విమానయాన మరియు ఉక్కు శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా, ఎం ఓ ఎస్,జనరల్ విజయ్ కుమార్ (రిటైర్డ్) మరియు ఇతర ప్రముఖులు  విమానాశ్రయం ఆవరణలో ఆవిష్కరించారు. .

 

ఈ సందర్భంగా పౌర విమానయాన మరియు ఉక్కు శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా మాట్లాడుతూ “మన దేశంలోని అత్యంత అందమైన పర్యాటక రత్నాలలో అండమాన్ నికోబార్ ఒకటి. ఇది భారత స్వాతంత్ర్య చరిత్రలో ముఖ్యమైన  సంఘటనలకు సాక్షిగా నిలిచింది. వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం వృక్షజాలం మరియు జంతుజాలం ​​యొక్క అద్భుతమైన జీవవైవిధ్యాన్ని సూచిస్తుంది. ముత్యపు చిప్ప ఆకారంలో రూపొందించబడిన ఈ విమానాశ్రయానికి పగటిపూట కాంతికి విద్యుత్ అవసరం లేదు. సుస్థిరత పరంగా, ఈ విమానాశ్రయంలో డబుల్ ఇన్సులేటింగ్ సిస్టమ్, ఎల్ ఈ డీ లైటింగ్, వర్షపు నీటి ఇంకుడు గుంతలుమరియు సోలార్ నీటి ప్లాంట్ ఉన్నాయి.

 

ఈ విమానాశ్రయంతోపాటు, షిబ్‌పూర్, కార్ నికోబార్ మరియు క్యాంప్‌బెల్‌లలో 3 అదనపు విమానాశ్రయాలు, అలాగే షాహీద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్ మరియు పోర్ట్ బ్లెయిర్‌లలో 4 వాటర్ ఏరోడ్రోమ్‌లను రూ. 150 కోట్లు పెట్టుబడితో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేతృత్వంలో, సేవ, సుష‌ష‌న్ మరియు గ‌రీబ్ క‌ళ్యాణ్‌కి వంటి పథకాలకు మేము అంకితం అయ్యాము. రాబోయే కాలంలో ఈ విమానాశ్రయం ఉపాధి, విద్య మరియు పెట్టుబడులకు ముఖ ద్వారం అవుతుంది.

 

వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పోర్ట్ బ్లెయిర్ ఎయిర్‌పోర్ట్ అని కూడా పిలుస్తారు, ఇది అండమాన్ నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్‌కు దక్షిణంగా 2 కి.మీ దూరంలో ఉంది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ పేరు వున్న ఈ విమానాశ్రయం అండమాన్ & నికోబార్ దీవుల ఏకైక వాణిజ్య విమానాశ్రయం. పోర్ట్ బ్లెయిర్ ప్రశాంతమైన అండమాన్ & నికోబార్ దీవుల రాజధాని. దక్షిణ అండమాన్ ద్వీపం యొక్క తూర్పు తీరంలో ఉన్న పోర్ట్ బ్లెయిర్ 500 కంటే ఎక్కువ సహజమైన ద్వీపాలకు ప్రవేశ ద్వారం. ఇది సందడిగా ఉండే వాణిజ్య కేంద్రం మరియు అండమాన్ & నికోబార్ దీవుల ప్రభుత్వ కార్యాయాలలన్నీ ఇక్కడే వుంటాయి. పోర్ట్ బ్లెయిర్ స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్, సీ క్రూయిజ్‌లు  వంటి నీటి ఆధారిత కార్యకలాపాలను మరియు ప్రాంతం యొక్క చరిత్ర మరియు సంస్కృతి యొక్క సంగ్రహావలోకనం అందిస్తుంది.

***


(Release ID: 1940601) Visitor Counter : 185