సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఫీచర్, నాన్-ఫీచర్ ఫిల్మ్‌ల ప్రదర్శనకు ఎంట్రీల అహ్వానం
- ఎన్ఎఫ్డీసీ 54వ ఐఎఫ్ఎఫ్ఐలోని ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శనకు ఎంట్రీలు
प्रविष्टि तिथि:
17 JUL 2023 3:37PM by PIB Hyderabad
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ)ని నిర్వహించే సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ యొక్క నోడల్ ఏజెన్సీ అయిన నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ), ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించేందుకు ఫీచర్, నాన్-ఫీచర్ విభాగాలు రెండింటిలోనూ భారతీయ చిత్రాల కోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. 2023 నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో జరిగే 54వ ఎడిషన్ ఫెస్టివల్‌లో ఎంపిక చేసిన చిత్రాలను ప్రదర్శిస్తారు. భారతీయ పనోరమా విభాగం ఐఎఫ్ఎఫ్ఐ యొక్క ప్రధాన ఆస్తి. ప్రముఖ జ్యూరీచే ఎంపిక చేయబడిన భారతీయ భాషల చిత్రాలను ఇది ప్రోత్సహిస్తుంది. ఐఎఫ్ఎఫ్ఐ అలాగే భారతదేశం మరియు విదేశాలలో జరిగే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు, ద్వైపాక్షిక సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల క్రింద నిర్వహించబడే భారతీయ చలనచిత్ర వారాల్లో ప్రమోట్ చేయడం లక్ష్యంగా ఇది పని చేస్తోంది. సాంస్కృతిక మార్పిడి ప్రోటోకాల్‌వెలుపల ప్రత్యేక భారతీయ చలనచిత్రోత్సవాలు, భారతదేశంలో ప్రత్యేక భారతీయ పనోరమా ఉత్సవాలను ఇది నిర్వహిస్తుంది. వారి వ్యక్తిగత నైపుణ్యాన్ని వినియోగించడం, ప్రముఖ జ్యూరీ ప్యానెల్‌లు, ఫీచర్ ఫిల్మ్ విభాగానికి 12 మంది సభ్యులు మరియు నాన్-ఫీచర్ ఫిల్మ్ విభాగానికి 6 మంది సభ్యులు ఏకాభిప్రాయానికి సమానంగా పరిగణిస్తారు, ఇది ఆయా వర్గాల భారతీయ పనోరమా చిత్రాల ఎంపికకు దోహదం చేస్తుంది.
గరిష్టంగా 26 సినిమాలకు ఎంపిక..
ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో గరిష్టంగా 26 సినిమాలు, నాన్ ఫీచర్ విభాగంలో 21 చిత్రాలు ఎంపిక కానున్నాయి. ఎంపికలలో 2023 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ యొక్క ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ మరియు ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్ ఉంటాయి. సినిమాటిక్, మేటి ఇతివృత్తం మరియు కళా సౌందర్య శ్రేష్ఠతతో కూడిన విభిన్నమైన చలనచిత్రాలు భారతీయ పనోరమా యొక్క షరతులు, విధానానికి అనుగుణంగా ఎంపిక చేయబడతాయి. చలనచిత్రాల అర్హత ప్రమాణాలు మరియు సమర్పణ ప్రక్రియ వివరాలను ఐఎఫ్ఎఫ్ఐ వెబ్‌సైట్‌లో వివరంగా తెలుసుకోవచ్చు. చిత్రాల ఎంపికకు రెండు ప్రాథమిక అర్హత ప్రమాణాలు ఉన్నాయి, ముందుగా అన్ని చలనచిత్రాలు తప్పనిసరిగా ఆంగ్ల ఉపశీర్షికలను కలిగి ఉండాలి. రెండవది ఆగస్ట్ 30, 2022 నుండి జూలై 31, 2023 వాటి చిత్రాలను పూర్తి చేయాలి లేదా ఈ వ్యవధిలో సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ పొంది ఉండాలి. సినిమాల ఎంట్రీల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 10, 2023. అర్హత ప్రమాణాల వివరాలను ఇక్కడ యాక్సెస్ చేయవచ్చు: https://www.iffigoa.org/ip-rules-and-regulations.html
*****
(रिलीज़ आईडी: 1940381)
आगंतुक पटल : 205