రాష్ట్రపతి సచివాలయం
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏజీఎం సెరిమోనియల్ సెషన్ కు అధ్యక్షత వహించిన రాష్ట్రపతి
प्रविष्टि तिथि:
17 JUL 2023 1:22PM by PIB Hyderabad
రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో ఈరోజు (జూలై 17, 2023) ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఏజీఎం సెరిమోనియల్ సెషన్‌కు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. భారతీయ సంప్రదాయంలో దాతృత్వం అత్యంత ముఖ్యమైన మానవీయ విలువగా పరిగణిస్తామని అన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ 100 ఏళ్లకు పైగా ప్రజలకు సేవ చేస్తోందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో రెడ్‌క్రాస్ సహాయక చర్యల ద్వారా తన నిబద్ధతను ప్రదర్శించిందని ఆమె తెలిపారు. సొసైటీ సభ్యులు, వాలంటీర్లందరూ మానవాళికి అంకితభావంతో, సేవ చేస్తున్నందుకు ఆమె అభినందించారు. మానవ సేవ పట్ల వారి అంకితభావం, కరుణ, నిస్వార్థ స్ఫూర్తి ఇతరులకు స్ఫూర్తినిస్తుందని ఆమె అన్నారు. మానవాళి సంక్షేమం కోసం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నిరంతరం కృషి చేస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ దేశవ్యాప్తంగా 100కి పైగా రక్తదాన కేంద్రాలు, మొబైల్ ప్రచారాల ద్వారా భారతదేశ రక్త అవసరాలలో 10 శాతం తీరుస్తోందని తెలుసుకుని రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. అవసరమైన వారి కోసం సురక్షితంగా రక్తాన్ని సేకరించి స్వచ్ఛంద రక్తదాన సంస్కృతిని పెంపొందించడం ద్వారా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అద్భుతమైన పాత్ర పోషిస్తోందని ఆమె అన్నారు. రక్తదానానికి సంబంధించిన అపోహలను తొలగించి, ప్రజలను, ముఖ్యంగా యువతను ఈ ఉదాత్తమైన సామాజిక లక్ష్యంతో అనుసంధానం చేయాలని రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులను ఆమె కోరారు.
Please click here to see the President's Speech -
***
(रिलीज़ आईडी: 1940376)
आगंतुक पटल : 221