మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మూడవ సింగపూర్ - ఇండియా హ్యాకథాన్ విజేతలను సన్మానించిన కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, సింగపూర్ ఉపప్రధాని లారెన్స్ వాంగ్
మూడవ సింగపూర్-ఇండియా హ్యాకథాన్ 2023 లో ఆర్థిక మోసాలను
గుర్తించడానికి, ఆర్థిక అక్షరాస్యతను అందించడానికి చూపిన పరిష్కారాలకు ఉన్నత గౌరవం
విజ్ఞానం, పరిశోధన , సృజనాత్మకత శక్తితో, భారతదేశం , సింగపూర్ రెండూ భవిష్యత్తు కోసం మెరుగ్గా సిద్ధం కావడానికి, పరస్పర ప్రగతి సాధించడానికి, ప్రపంచ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నాయి - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
'పాఠశాలలు నుండి నైపుణ్యాల వరకు' మొదలుకొని అన్ని రంగాలలో భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై అర్థవంతమైన సంభాషణలు జరిపిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ , శ్రీ లారెన్స్ వాంగ్
Posted On:
16 JUL 2023 7:47PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ విద్య, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, సింగపూర్ ఉపప్రధాని, ఆర్థిక మంత్రి శ్రీ లారెన్స్ వాంగ్ గుజరాత్ లోని గాంధీనగర్ లో 3వ సింగపూర్ - ఇండియా హ్యాకథాన్ విజేతలను సత్కరించారు.
భారత విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఇ), సింగపూర్ కు చెందిన నాన్యాంగ్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం (ఎన్ టి యు, సింగపూర్ ) సంయుక్తంగా సింగపూర్-ఇండియా హ్యాకథాన్ మూడవ ఎడిషన్ ను నిర్వహించాయి.
ఈ హ్యాకథాన్ లో నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ, ఎమిటీ యూనివర్శిటీ, ద్వారకాదాస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విద్యార్థులు సృష్టించిన ఇన్సైడర్ ట్రేడింగ్ అనుమానితులను గుర్తించడంలో రెగ్యులేటర్లకు సహాయపడే ఒక సాధనం-
మొదటి విద్యార్థి బహుమతిని గెలుచుకుంది.
స్టార్టప్ కేటగిరీలో టాప్ విన్నర్ గా నిలిచిన హక్దర్షక్ 2.8 మిలియన్ల మంది భారతీయులు ప్రభుత్వ సంక్షేమ సేవల్లో 700 మిలియన్ డాలర్లను అన్ లాక్ చేయడానికి వీలు కల్పించినందుకు గానూ అవార్డు గెలుచుకున్నారు. గుజరాత్ లోని ఐఐటీ గాంధీనగర్ లో జీ20 ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో జరిగిన ఈ హ్యాకథాన్ ఫైనల్ లో భారత్, సింగపూర్ కు చెందిన అత్యుత్తమ స్టార్టప్ లు, విద్యార్థులు పాల్గొన్నారు. 600 మందికి పైగా విద్యార్థులు, స్టార్టప్ లు, ఇన్వెస్టర్లు, విధాన నిర్ణేతలు, కార్పొరేట్లు, విద్యావేత్తలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ విజ్ఞానమే శక్తి అని అన్నారు. ఎస్ఐహెచ్ వంటి చొరవలు విజ్ఞాన మార్పిడిని సులభతరం చేయడానికి , మన రెండు దేశాల యువత లో సృజనాత్మక సామర్థ్యాన్ని వెలికితీయడానికి ఒక అద్భుతమైన మార్గం అని అన్నారు. ఆ దిశగా ముందుకు సాగడానికి , సాధారణ సామాజిక సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడానికి పరిధులకు అతీతంగా హ్యాకథాన్ సంస్కృతిని తీసుకెళ్లాలని అన్నారు. విజ్ఞానం, పరిశోధన, ఆవిష్కరణల శక్తితో భారత్, సింగపూర్ దేశాలు రెండూ భవిష్యత్తు కోసం మెరుగ్గా సిద్ధం కావడానికి, పరస్పర ప్రగతి సాధించడానికి, ప్రపంచ అభివృద్ధి ని ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నాయని శ్రీ ప్రధాన్ అన్నారు.
ఆధునిక అభివృద్ధి అనేది విజ్ఞానం, పరిశోధన, సృజనాత్మకత అనే మూడు అక్షాలపై ఆధారపడి ఉందని ఆయన అన్నారు. విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా సింగపూర్ గత 30-40 ఏళ్లలో విజ్ఞానం, విద్యలో నైపుణ్యం ద్వారా రూపాంతరం చెందిందని శ్రీ ప్రధాన్ అన్నారు.
ఎన్ ఇ పి 2020 ద్వారా భారతదేశం విజ్ఞాన ఆధారిత సమాజంగా మారడంలో గొప్ప పురోగతి సాధించిందని, రాబోయే 25 సంవత్సరాల అమృత్ కాల్ భారతదేశానికి వాగ్దానం , సామర్థ్యాలతో నిండి ఉందని, సింగపూర్-ఇండియా హ్యాకథాన్ వంటి కార్యక్రమాల ద్వారా సన్నిహిత సహకారం రెండు దేశాల మధ్య విజ్ఞాన బదిలీకి సహాయపడుతుందని శ్రీ ప్రధాన్ నొక్కి చెప్పారు.
సింగపూర్ ఉపప్రధాని, ఆర్థిక మంత్రి శ్రీ లారెన్స్ వాంగ్ మాట్లాడుతూ, సింగపూర్-ఇండియా హ్యాకథాన్ ప్రత్యేకమైనది , విలువైనదని, ఇరు దేశాల నాయకుల మద్దతు ఉందని, భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మోడీ దార్శనికత నుండి ఇది రూపు దిద్దుకుందని అన్నారు. పోస్ట్ (కోవిడ్ -19) మహమ్మారి అనంతరం తొలిసారి గాంధీనగర్ కు వచ్చినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి హ్యాకథాన్ మన ఉత్తమ యువతను, వారి
ఆలోచనలను ఏకతాటిపైకి తెస్తుందని అన్నారు.
ఫైనాన్షియల్ ఫ్రాడ్ డిటెక్షన్, ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ అండ్ క్రెడిట్ ఆఫరింగ్, సీ లెవల్ రైజ్ అండ్ కోస్టల్ ఫ్లడ్, ఫుడ్ రీసైక్లింగ్ ఆప్టిమైజ్ చేయడం, కార్బన్ ఫుట్ ప్రింట్ మానిటరింగ్, సింగపూర్-ఇండియా ట్రేడ్ కనెక్టివిటీని పెంచడం అనే ఆరు ప్రాబ్లమ్ స్టేట్ మెంట్లకు పరిష్కారాలను ప్రదర్శించడానికి ఈ హ్యకథాన్ లో బృందాలు పోటీ పడ్డాయి.
ఈ ఏడాది సింగపూర్-ఇండియా హ్యాకథాన్ ఎన్టీయూ సింగపూర్, ఐఐటీ గాంధీనగర్ వంటి పరిశోధనలను విస్తృతంగా నిర్వహించే విద్యా సంస్థలను మాత్రమే కాకుండా, ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన ప్రపంచ సవాళ్లను ప్రభావితం చేసే స్టార్టప్ లను ఏర్పాటు చేయడంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశం చేయడానికి రెండు దేశాలకు చెందిన ప్రముఖ కార్పొరేట్లు , ప్రభుత్వ రంగాన్ని కూడా ఏకతాటిపైకి తెచ్చిందని
ఆయన అన్నారు.
శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ , శ్రీ లారెన్స్ వాంగ్ ఈ సందర్భంగా 'పాఠశాలలు నుండి నైపుణ్యాల వరకు' మొదలుకొని అన్ని రంగాలలో పరస్పర భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయడంపై అర్థవంతమైన సంభాషణలు జరిపారు.
భారత దేశ ప్రాధాన్యాలు అయిన పాఠశాలల్లో వృత్తి విద్యను ఏకీకృతం చేయడం, క్లిష్టమైన నైపుణ్యాలతో యువతకు సాధికారత కల్పించడం, భవిష్యత్తుకు దోహదపడే శ్రామిక శక్తి, విద్యా సంస్థలు, ఉపాధ్యాయులు ,శిక్షకుల సామర్థ్యాన్ని పెంపొందించడం, పరిశోధన ఆవిష్కరణ లో సహకారం గురించి మంత్రులు చర్చించారు.
విద్య, నైపుణ్యాభివృద్ధిలో సహకారం కోసం జీ-టు-జీ అవగాహన ఒప్పందాన్ని ఖరారు చేసి సంతకం చేయాలని, పరస్పరం ఉత్తమ పద్ధతులను చేర్చడానికి , మన భవిష్యత్ తరాలకు విజ్ఞానం , నైపుణ్యాల భాగస్వామ్యం పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడానికి ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేయాలని వారు తీర్మానించారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018లో సింగపూర్ అధికారిక పర్యటన లో తొలి సింగపూర్ -ఇండియా హ్యాకథాన్ ను ప్రారంభించారు. 2018లో సింగపూర్ లోనూ, 2019లో భారత్ లోని ఐఐటీ మద్రాస్ లోనూ గత రెండు ఈవెంట్ లు జరిగాయి.
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మూడవ హ్యాకథాన్ సందర్భంగా లిఖితపూర్వక సందేశాన్ని పంపారు, "ఎన్ టియు సింగపూర్-ఇండియా హ్యాకథాన్ 2023 గురించి తెలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. భారత్ జీ20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో ఈ హ్యాకథాన్ ను నిర్వహించడం గమనార్హం. జి 20 ప్రెసిడెన్సీ మంత్రం, 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు', ఇది వసుధైక కుటుంబం అనే పురాతన భారతీయ భావనకు సంకేతం. అంటే ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం. భాగస్వామ్య భవిష్యత్తును నిర్మించడానికి కలిసి రావడమే ఈ దార్శనికత సారాంశం. సింగపూర్-ఇండియా హ్యాకథాన్ ఈ ఉదాత్త ఆలోచనను ప్రతిబింబించే కార్యక్రమం’’ అని ప్రధానమంత్రి తమ సందేశం లో పేర్కొన్నారు.
సింగపూర్ ఇండియా హ్యాకథాన్ లో పాల్గొన్న విద్యార్థులు, స్టార్టప్ లతో శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ముచ్చటించారు. ప్రజల జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపాలని, ఇన్నోవేషన్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ద్వారా ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చాలనే వారి అభిరుచిని ఆయన ప్రశంసించారు.
***
(Release ID: 1940090)
Visitor Counter : 158