గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించిన 4062 ఖాళీలను భర్తీ చేసేందుకు ఇఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ (ఇఎస్ఎస్ఇ)- 2023కు నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్ఇఎస్‌టిఎస్
Posted On:
14 JUL 2023 11:56AM by PIB Hyderabad
గిరిజన వ్యవహారాల పరిధిలోని స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (ఎన్ఇఎస్‌టిఎస్- నెస్ట్స్ - గిరిజన విద్యార్ధులకు జాతీయ విద్యా సంస్థ), ఇఎంఆర్ఎస్‌ల కోసం బోధన, బోధనేతర సిబ్బంది కోసం నియామక డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. ఇఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ (ఇఎస్ఎస్ఇ)- 2023లో భాగంగా 4062 ఖాళీలను భర్తీ చేసేందుకు ఎన్ఇఎస్‌టిఎస్ ఇటీవలే నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
దీని ఫలితంగా, ఇఎంఆర్ఎస్‌లలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఇఎంఆర్ఎస్‌ల లో నాణ్యత కలిగిన మానవవనరులను స్థానం కల్పించడం సాధ్యమవుతుంది.
ఇందుకోసం దరఖాస్తుల ప్రక్రియ 30.06.2023న ప్రారంభమైంది.
సిబిఎస్ఇ సహకారంతో నెస్ట్స్ బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఇఎస్ఎస్ఇ- 2023ను ఒఎంఆర్ ఆధారిత (పెన్- పేపర్) పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తోంది. ఇఎంఆర్ఎస్‌లలో గల ఖాళీలను దిగువన పట్టికలో ఇవ్వడం జరిగింది -
స్థానం
ఖాళీలు
ప్రిన్సిపాల్ 303
పిజిటి 2266
అకౌంటెంట్ 361
జూ. సెక్రటేరియేట్ అసిస్టెంట్ (జెఎస్ఎ) 759
ల్యాబ్ అటెండెంట్ 373
మొత్తం 4062
ఆన్‌లైన్ దరఖాస్తుల వివరణాత్మక ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, ప్రతి పోస్టుకు సంబంధించిన సిలబస్‌కు సంబంధించిన ఇతర వివరాలు emrs.tribal.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న ఇఎంఆర్ఎస్‌ల లో ఉన్న ఖాళీ స్థానాలను భర్తీ చేసేందుకు నియామక ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. దరఖాస్తులను స్వీకరించేందుకు నిర్దేశించిన పోర్టల్ 30.06.2023 నుంచి 31.07.2023 వరకు తెరిచి ఉంటుంది.
గిరిజన జనాభా 50% లేక అంతకన్నా ఎక్కువ ఉన్న ప్రతి బ్లాకులోనూ, 20,000 లేదా అంతకు మించిన ఎస్టీలు ఉన్న ప్రాంతంలో గిరిజన జనాభాకు నాణ్యత కలిగిన విద్యను అందించేందుకు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రతిష్ఠాత్మక చొరవ ఇఎంఆర్ఎస్.
***
(Release ID: 1939657)
Visitor Counter : 351