ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చంద్రయాన్-3 మనదేశ ప్రజల ఆశల ను మరియు కలల ను నెరవేర్చుతుంది: ప్రధాన మంత్రి

Posted On: 14 JUL 2023 11:47AM by PIB Hyderabad

చంద్రగ్రహాని కి భారతదేశం చేపట్టిన మూడో లూనర్ మిశన్ ‘చంద్రయాన్-3 యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు.

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -

భారతదేశం యొక్క అంతరిక్ష రంగం గురించి ప్రస్తావించవలసి వస్తే, 2023 జులై 14 వ తేదీ ని సదా సువర్ణాక్షరాల తో లిఖించడం జరుగుతుంది. మన మూడో చంద్ర గ్రహ సాహస యాత్ర అయినటువంటి చంద్రయాన్-3 తన ప్రస్థానానికై బయలుదేరనుంది. ఈ ప్రశంసనీయమైనటువంటి మిశన్ మన దేశ ప్రజల ఆశల ను మరియు స్వప్నాల ను ముందుకు తీసుకు పోతుంది.

కక్ష్య లోకి పంపే ప్రక్రియ తరువాత చంద్రయాన్-3 ను లూనార్ ట్రాన్స్ ఫర్ ట్రాజెక్టరీ లోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. 3,00,000 కిలో మీటర్ ల పై చిలుకు దూరాన్ని దాటి ఇది రాబోయే కొన్ని వారాల లో చంద్రుడి ని చేరుకొంటుంది. చంద్రయాన్ కు అమర్చినటువంటి వైజ్ఞానిక ఉపకరణాలు చంద్రగ్రహం ఉపరితలాన్ని అధ్యయనం చేయడం తో పాటు మన జ్ఞానాన్ని పెంపొందింప చేస్తాయి.

మన శాస్త్రవేత్త ల చలవ తో, అంతరిక్ష రంగం లో భారతదేశం యొక్క ఇతిహాసం చాలా సమృద్ధమైంది గా ఉంది. చంద్రయాన్-1 ని ప్రపంచం లో చంద్ర గ్రహం తాలూకు మిశన్స్ లో ఒక మార్గదర్శి అని భావించడం జరుగుతున్నది. ఎందుకంటే అది జాబిల్లి ఉపరితలం పైన జల సంబంధి అణువులు ఉన్నాయి అని రూఢిపరచింది. ప్రపంచమంతటా 200 కు పైచిలుకు విజ్ఞానశాస్త్ర సంబంధి ప్రచురణల లో దీనిని గురించిన ప్రస్తావన ఉంది.

చంద్రయాన్-1 కి పూర్వం , చంద్ర గ్రహం పూర్తి గా ఎండిపోయినటువంటిది అని, భౌగోళిక పరంగా నిష్క్రియం మరియు నిర్జన ఖగోళ పిండమని నమ్మే వారు. ఇక, దీనిని జలం ఉనికి కలిగినటువంటి మరియు అనుబంధ పొరల లో మంచు ఆనవాళ్లతో పాటు ఒక గతిశీలమైనటువంటి మరియు భౌగోళికం గా అది ఒక చురుకైన ఖగోళీయ ఖండమని లెక్కకు తీసుకోవడం జరుగుతోంది. బహుశా భవిష్యత్తు లో దీని పైన నివాసాల ను ఏర్పరచుకోవడమనేది సాధ్యం కావచ్చు!

చంద్రయాన్-2 కూడా అంతే ముఖ్యమైంది గా ఉండింది. ఎందుకంటే దీనికి జోడించిన ఆర్బిటర్ నమోదు చేసినటువంటి డేటా తొలి సారి రిమోట్ సెన్సింగ్ మాధ్యం ద్వారా క్రోమియమ్, మేంగనీజ్ మరియు సోడియమ్ ఉనికి ని పసిగట్టింది. ఇది చందమామ యొక్క మేగ్మేటిక్ వికాసం గురించిన సమాచారం మరింత గా తెలియగలదు.

చంద్రయాన్ యొక్క ప్రముఖ వైజ్ఞానిక పరిణామాల లో చంద్ర గ్రహం మీద సోడియం తాలూకు తొలి ప్రపంచ మానచిత్రం, క్రేటర్ ఆకారాల సమూహం తాలూకు అధిక సమాచారం, ఐఐఆర్ఎస్ ఉపకరణం అండ తో చంద్రుని ఉపరితలం మీద నీటి తో ఏర్పడిన మంచు యొక్క స్పష్టమైన రూపు ను వెదకడం మరియు ఇంకా ఎన్నో అంశాలు భాగం గా ఉన్నాయి. ఈ మిశను ను గురించి ఇంచుమించు 50 ప్రచురణల లో వివరించడం జరిగింది.


చంద్రయాన్- 3 మిశన్ కై ఇవే శుభాకాంక్షలు. ఈ మిశను ను గురించి, మరి అలాగే అంతరిక్షం, విజ్ఞానశాస్త్రం, ఇంకా నూతన అన్వేషణ.. వీటిలో దేశం సాధించిన ప్రగతి ని గురించి మరింత ఎక్కువ గా విషయాల ను తెలుసుకోవలసిందంటూ మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీనితో మీ అందరి కి బోలెడంత గర్వం కలుగుతుంది.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/AK


(Release ID: 1939494) Visitor Counter : 197