ఆయుష్

సాంప్రదాయ ఔషధాలపై ఆసియాన్ దేశాల సదస్సుకు భారతదేశం ఆతిథ్యం


- 2023 జూలై 20న న్యూఢిల్లీలో ఈ సదస్సు నిర్వహణ

- దాదాపు దశాబ్దం తర్వాత న్యూఢిల్లీలో జరుగుతున్న భారత్-ఆసియాన్ సదస్సులో కంబోడియా, వియత్నాం సహా పది ఆసియాన్ దేశాలు పాల్గొంటాయి.



- సాంప్రదాయ వైద్య విధానాలలో "యాక్ట్ ఈస్ట్ పాలసీ" విస్తరణకు ఆయుష్ అపూర్వమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది: కేంద్ర ఆయుష్ మంత్రి

Posted On: 13 JUL 2023 2:05PM by PIB Hyderabad

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖఆసియాన్కు భారత మిషన్ మరియు ఆసియాన్ సెక్రటేరియట్ మద్దతుతో ఆయుష్ మంత్రిత్వ శాఖ 20 జూలై 2023 ఆసియాన్ దేశాల కోసం సాంప్రదాయ ఔషధాలపై సదస్సును నిర్వహించనుంది. ఇందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోందిసాంప్రదాయ ఔషధాలపై సమావేశం భారతదేశం మరియు ఆసియాన్ దేశాల మధ్య వేదికను బలోపేతం చేయడానికి వారి ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి మరియు సాంప్రదాయ ఔషధాల రంగంలో భవిష్యత్ సహకారం కోసం ఒక రోడ్మ్యాప్ను రూపొందించడాన్ని ఇది లక్ష్యంగా పెట్టుకుంది.  ఈ రోజు ఏర్పాటు చేసిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మీడియాను ఉద్దేశించి ఆయుష్ కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ “భారతదేశం మరియు ఆసియాన్ల మధ్య బహుముఖ సంబంధం భాగస్వామ్య భౌగోళికచారిత్రక మరియు నాగరికత సంబంధాల యొక్క బలమైన పునాదిపై ఉందిఇది చాలా పురాతనమైనదిరెండు సహస్రాబ్దాలకు పైగా ఈ సంబంధం కొనసాగుతోంది." అని అన్నారు.  “నవంబర్ 2014లో మయన్మార్‌లో జరిగిన 12వ ఆసియాన్ ఇండియా సమ్మిట్‌లో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ని ప్రకటించారు, ఇది వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊతమిచ్చిందన్నారు. దాదాపు ఒక దశాబ్దం తర్వాత సాంప్రదాయ వైద్యంపై భారత ఆసియాన్ సదస్సు జరగడం, ఆసియాన్‌తో భారతదేశ సహకారాన్ని మరింతగా పెంచుకోవడంలో ఒక ప్రధాన ముందడుగు. మంత్రిత్వ శాఖ సాధించిన విజయాల గురించిన వివరాలను పంచుకుంటూ, “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014 సంవత్సరం నుండి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ క్రింద ఆయుష్ శాఖను పెంచినప్పటి నుండి గత 9 సంవత్సరాలలో ఆయుష్ రంగం అనేక రెట్లు అభివృద్ధి చెందింది. ఆయుష్ ఒక స్వతంత్ర మంత్రిత్వ శాఖగా

ఎదిగింది" అన్నారు.  ఈ రోజు మంత్రిత్వ శాఖ బ్రిటీష్, అమెరికా, జపాన్, బ్రెజిల్, జర్మనీ నుండి అనేక అగ్రశ్రేణి అంతర్జాతీయ సంస్థలతో పాటు సీఎన్ఐఆర్, డి.ఎస్.టి, డి.బి.టి, ఐఐటీలు మొదలైన జాతీయ సంస్థలతో వివిధ నాన్-కమ్యూనికేబుల్ వ్యాధి పరిస్థితులలో ఆయుష్ వ్యవస్థలపై అధిక నాణ్యత పరిశోధనను చేపట్టేందుకు నిమగ్నమై ఉంది. డయాబెటిస్ మెల్లిటస్, క్యాన్సర్, మానసిక ఆరోగ్యం అలాగే కోవిడ్ వంటి అంటు వ్యాధులపై పరిశోధనలో కూడా నిమగ్నమై ఉంది.  ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడిన వివిధ ప్రాజెక్టుల పరిశోధన ఫలితాలను పంచుకోవడానికి ఆసియాన్ సదస్సు వేదికను అందిస్తుంది. అదేవిధంగా, ఆసియాన్ దేశాలు కూడా తమ అనుభవాలను పంచుకుంటాయి. ఈ సదస్సు లక్ష్యాలను ఆయన మరింతగా హైలైట్ చేస్తూ.. "సాంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించడానికి ఆసియాన్ సభ్య దేశాలలో రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లో ఇటీవలి పరిణామాలను పంచుకోవడానికి కూడా ఈ సమావేశం ఒక వేదికను అందిస్తుంది" అని కేంద్ర మంత్రి తెలిపారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆయుష్ ఉత్పత్తులు మరియు సేవల ఎగుమతిని పెంచడానికి ఆయుష్‌లో బలమైన అంతర్జాతీయ సహకారాన్ని ఏర్పాటు చేసుకుంది. 'సాంప్రదాయ ఔషధాల రంగంలో సహకారం', 'ఆయుష్ పీఠాల ఏర్పాటు'పై అవగాహన ఒప్పందాలపై  విజయవంతంగా సంతకం చేసింది. విదేశీ విశ్వవిద్యాలయాలు/ఇన్‌స్టిట్యూట్‌లలో మరియు వివిధ స్థాయిలలో 'సహకార పరిశోధన' చేపట్టడం కోసం ఒప్పందాలు జరిగాయి.  ఇది ఆసియాన్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆయుష్కు బలమైన గుర్తింపును తెచ్చిపెట్టిందిన్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే  ఒకరోజు సదస్సులో మొత్తం 75 మంది పాల్గొననున్నారు. ఎనిమిది ఆసియాన్ దేశాల నుండి అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. ఇద్దరు అంతర్జాతీయ ప్రతినిధులు వర్చువల్ మోడ్ ద్వారా ఆలోచనలు చేసి సంప్రదాయ ఔషధాలపై తమ ఆలోచనలను పంచుకుంటారు.

******



(Release ID: 1939485) Visitor Counter : 151