వ్యవసాయ మంత్రిత్వ శాఖ
కేవలం ఉత్పత్తి ఎక్కువ చేయడానికి మాత్రమే కాకుండా సన్నకారు రైతులకు సహకారం అందించడం, విలువ ఆధారిత వ్యవస్థ అభివృద్ధి కోసం ఎఫ్‌పిఓలు చిత్తశుద్ధితో పనిచేయాలి.. శ్రీ మనోజ్ అహుజా రైతు ఉత్పత్తిదారుల సంస్థల ఏర్పాటు, అభివృద్ధి అంశంపై జాతీయ వర్క్‌షాప్
Posted On:
12 JUL 2023 5:42PM by PIB Hyderabad
రైతు ఉత్పత్తిదారుల సంస్థల ( ఎఫ్‌పిఓ) ఏర్పాటు, అభివృద్ధి చేయడానికి అమలు చేయాల్సిన చర్యలు చర్చించడానికి స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం (ఎస్ఎఫ్ఏసి) సహకారంతో కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక రోజు జాతీయ వర్క్‌షాప్‌ను నిర్వహించింది.కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ కుమార్ అహుజా అధ్యక్షతన వర్క్‌షాప్ జరిగింది.వర్క్‌షాప్ లో మాట్లాడిన శ్రీ మనోజ్ కుమార్ అహుజా కేవలం ఉత్పత్తి ఎక్కువ చేయడానికి మాత్రమే కాకుండా సన్నకారు రైతులకు సహకారం అందించడం, విలువ ఆధారిత వ్యవస్థ అభివృద్ధి కోసం ఎఫ్‌పిఓలు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. సన్నకారు రైతులకు సహకారం అందించే అంశంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
వర్క్‌షాప్ పాల్గొన్న శ్రీ కిద్వాయ్ సిబిబిఓ నిర్వహణలో ఐఏ ల పర్యవేక్షణ అంశాన్ని వివరించారు.ఎఫ్‌పిఓలకు అవసరమైన అనుమతులు, బ్యాంకుల నుంచి నిధులు పొందే అంశంలో, ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేయడం లాంటి అంశాలలో ఐఏల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు.
వర్క్‌షాప్ సాంకేతిక సదస్సును మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, ఎస్ఎఫ్ఏసి ఎండీ ప్రారంభించారు. సదస్సులో పథకం వివరాలు, పథకం అమలు కోసం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక వివరాలు అందించారు.వర్క్‌షాప్ సాంకేతిక సదస్సులో క్రింది అంశాలపై చర్చలు జరిగాయి:
* రైతులను సమీకరించడం అంశంపై సేలం వీరపాండి వత్తర కళంజియమ్‌కు చెందిన శ్రీమతి బి శివరాణి, క్రుషి వికాస్ వాగ్రామిన్ ప్రశిక్షన్ సంస్థకు చెందిన ఆశిష్ నఫాడే చర్చించారు. సిబిబిఓ లు ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని వారు సూచించారు.
* మార్కెట్ అనుసంధానం,ఓఎన్డీసీ, 900 ఎఫ్‌పిఓల ఏర్పాటు అంశంపై చర్చలు జరిగాయి. ఎఫ్‌పిఓ అనుసంధానం కోసం సైన్ క్యాచ్ నిర్వహించిన కార్యక్రమం వివరాలను అందించారు. ఈ కార్యక్రమాన్ని అన్ని ఎఫ్‌పిఓలు అమలు చేయాలని సూచించారు. అలంద్ భూటై మిల్లెట్స్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ, , కొరియా ఆగ్రో ప్రొడ్యూసర్ కంపెనీల ప్రతినిధులు ఎఫ్‌పిఓల కోసం విజయవంతంగా అమలు చేసిన మార్కెట్ అనుసంధానాలను వివరించారు.
* స్థానిక విలువ జోడింపు కోసం ఎఫ్‌పిఓ ల ద్వారా వినూత్నంగా అమలు చేయడానికి అవకాశం ఉన్న అంశాలను సత్మిలే సతీష్ క్లబ్ ఓ పాతగర్, ఈ ద్వారా ఇ-రిజిస్ట్రీ ప్రతినిధులు వివరించారు.
* గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన ఎఫ్‌పిఓ ల వివరాలను ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ (ట్రైఫెడ్) అధికారులు తెలిపారు. గిరిజనుల కోసం అమలు చేస్తున్న పథకాలు , గిరిజన ఎఫ్‌పిఓ లను ప్రోత్సహించడం ,మార్కెట్ అనుసంధానం చేయడం వంటి వివరాలు అందించారు.
* సంస్థ అమలు చేస్తున్న రుణ హామీ పథకం వివరాలు, పథకం కింద ప్రయోజనం పొందుతున్న ఎఫ్‌పిఓల వివరాలను నాబార్డ్ కు అనుబంధంగా పనిచేస్తున్న నబ్సంరక్షన్ అందించింది.
జాతీయ వర్క్‌షాప్‌కు కేంద్ర వ్యవసాయ కార్యదర్శి శ్రీ మనోజ్ అహుజా అధ్యక్షత వహించారు. కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి,శ్రీ . ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ డాక్టర్ మణిందర్ కౌర్ ద్వివేది ప్రసంగించారు. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వ్యవసాయ కార్యదర్శులు, కమిషనర్లు మరియు డైరెక్టర్లు (వ్యవసాయం) సహా 100 మందికి పైగా ప్రతినిధులు వర్క్షాప్లో పాల్గొన్నారు. పథకం అమలు కోసం ఏర్పాటైన 15 సంస్థల (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీలు) ప్రతినిధులు వర్క్షాప్లో పాల్గొన్నారు.
వర్క్‌షాప్ ఓపెన్ సెషన్‌తో ముగిసింది.
నేపథ్యం:
రైతు ఉత్పత్తిదారుల సంస్థల ( ఎఫ్‌పిఓ) ఏర్పాటు అభివృద్ధి అంశాలను చర్చించడానికి కేంద్ర ప్రాయోజిత కార్యక్రమంగా జాతీయ వర్క్‌షాప్ జరిగింది.. 6,865 కోట్ల రూపాయలతో రైతు ఉత్పత్తిదారుల సంస్థల ( ఎఫ్‌పిఓ) పథకం అమలు జరుగుతోంది. రైతు ఆదాయాన్ని గణనీయంగా పెంచడానికి రూపొందించిన పథకాన్ని 2020లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. 86% కంటే ఎక్కువ ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో పథకం రూపొందింది. .ఈ పథకం కింద విలువ వ్యవస్థను అభివృద్ధి చేసి చిన్న,సన్నకారు రైతులకు ప్రయోజనం కలిగించడానికి ఈ పథకం అమలు జరుగుతుంది. ఉత్పత్తి, రవాణా వ్యయాన్ని తగ్గించి రైతుల ఆదాయాన్ని ఎక్కువ చేయడానికి పథకం కింద చర్యలు అమలు జరుగుతాయి. వివిధ వ్యాపార కార్యకలాపాల కోసం ఎఫ్‌పిఓ లు తీసుకున్న రుణాలకు పథకం కింద హామీ అందిస్తారు. . ఈ పథకం కింద ఇప్పటి వరకు మొత్తం 6,319 ఎఫ్‌పిఓలు నమోదు అయ్యాయి.
****
(Release ID: 1939113)
Visitor Counter : 177