బొగ్గు మంత్రిత్వ శాఖ
సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ 600 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక
రెన్యూవబుల్ ఎనర్జీలో రూ.1000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలి
Posted On:
11 JUL 2023 3:33PM by PIB Hyderabad
కోల్ ఇండియా లిమిటెడ్ అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి అనుబంధ సంస్థల్లో ఒకటైన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఈ సిఎల్), రాబోయే సంవత్సరాల్లో 600 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్‌టాప్, గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పవర్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనుంది. వ్యాపారాన్ని విస్తరించడం, "నెట్ జీరో ఎనర్జీ" లక్ష్యాన్ని సాధించాలన్న దిశగా సాగుతోంది. 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సిఓప్-26లో ప్రకటించిన “పంచామృతం” అనే పెద్ద లక్ష్యానికి అనుగుణంగా ఈ వ్యూహం ఉంది. ఎస్ఈసిఎస్, మినీరత్న పీఎస్యు, పై ప్రాజెక్టులను రూ.1000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చుతో అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లలో కొన్ని రెస్కో (రెన్యూవబుల్ ఎనర్జీ సర్వీస్ కంపెనీ)/బిఓఓ (బిల్డ్-ఓన్-ఆపరేట్) మోడ్‌లో అమలు అవుతాయి.
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో విస్తరించి ఉన్న ఎస్ఈసిఎల్ కార్యాచరణ ప్రాంతాలలో 180 మెగావాట్ల కంటే ఎక్కువ సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఇప్పటికే వివిధ దశల అభివృద్ధిలో ఉన్నాయి. ఇది ఇటీవల జోహిల్లా, జమున-కోత్మా, కుస్ముండా ప్రాంతాలలో 580 కేడబ్ల్యూపి సామర్థ్యం గల రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టులను ప్రారంభించింది.
జోహిల్లా ప్రాంతంలో, కమీషన్ చేసిన సామర్థ్యం దాదాపు 280 కేడబ్ల్యూపి ఉంది, ఇది మొత్తం కంపెనీలో అత్యధిక సామర్థ్యం గల రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్ట్. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ జీఎం కార్యాలయం, ఎస్ఈసిఎల్ నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయం, ప్రాంతీయ ఆసుపత్రి, ఏరియా గెస్ట్‌హౌస్‌లో సోలార్ ప్యానెల్‌లు ఏర్పాటు అయ్యాయి. ఈ ప్రాజెక్ట్ సుమారు 4,20,000 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది ఏటా దాదాపు రూ. 21 లక్షల విద్యుత్ వ్యయం ఆదా అవుతుంది.
అమలులో ఉన్న అతిపెద్ద రెండు సోలార్ ప్రాజెక్టులు ఒక్కొక్కటి 40 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో ఉన్న భట్‌గావ్,బిష్రాంపూర్ ప్రాంతాలలో కంపెనీ సొంత భూమిలో 40 మెగావాట్ల గ్రౌండ్ మౌంటెడ్, గ్రిడ్ కనెక్ట్ చేసిన సోలార్ పీవీ ప్లాంట్ అభివృద్ధి జరుగుతుంది. ప్రాజెక్ట్ అమలు దశలో ఉంది. మధ్యప్రదేశ్‌లోని జోహిల్లా ప్రాంతంలో మరో 40 మెగావాట్ల గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పీవీ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్టుపై యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ఎస్ఈసిఎల్ కూడా 4 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్ట్ కోసం టెండర్‌ను దాఖలు చేసింది. మధ్యప్రదేశ్‌లోని సోహగ్‌పూర్ ప్రాంతంలోని శారదా ఓసీ గనిలో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఇన్‌స్టాలేషన్ సాధ్యాసాధ్యాలను కూడా అన్వేషిస్తోంది.
కంపెనీ కార్బన్ పాదముద్రను తగ్గించి, మరింత స్థిరమైన భవిష్యత్తు దిశగా పయనించే విస్తృత ప్రణాళికలో భాగంగా 2026 నాటికి 3000 మెగావాట్ల సామర్థ్యం గల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా నికర-సున్నా స్థితిని సాధించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని కోల్ ఇండియా లిమిటెడ్ నిర్దేశించింది. ఇటీవల కోల్ ఇండియా సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (ఎస్జెవిఎన్ఎల్)తో జతకట్టింది,
2022-23 ఆర్థిక సంవత్సరంలో సిఐఎల్ మొత్తం బొగ్గు ఉత్పత్తిలో దాదాపు నాలుగింట ఒక వంతు ఎస్ఈసిఎల్ సహకారం అందించిందని గుర్తుంచుకోవాలి. బొగ్గు తవ్వకాలలో కార్బన్ పాదముద్రను తగ్గించడానికి, నికర సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యం వైపు వెళ్లేందుకు ఇది పునరుత్పాదక శక్తిని ప్రోత్సహిస్తోంది. పై ప్రాజెక్టుల నుండి ఉత్పత్తి చేయబడిన విద్యుత్‌తో, బొగ్గు గనులు, అనుబంధ కార్యకలాపాల కోసం కంపెనీ తన విద్యుత్ అవసరాలను సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.
****
(Release ID: 1938832)
Visitor Counter : 163