రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ఎంఎస్‌ఎంఈ ఫార్మా కంపెనీల ప్రతినిధులతో కేంద్ర రసాయనాలు & ఎరువుల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా సమావేశమయ్యారు. ఎంఎస్‌ఎంఈ ఫార్మా రంగంలో స్వీయ నియంత్రణ ఆవశ్యకతను నొక్కి చెప్పారు


"ఎంఎస్‌ఎంఈ ఫార్మా కోస్ ఔషధాల నాణ్యత పట్ల అప్రమత్తంగా ఉండటం మరియు స్వీయ నియంత్రణ ద్వారా మంచి తయారీ ప్రక్రియల వైపు వేగంగా వెళ్లడం చాలా ముఖ్యం"

ఎంఎస్‌ఎంఈ ఫార్మా కోస్ కోసం షెడ్యూల్ ఎం త్వరలో తప్పనిసరి చేయబడుతుంది

"భారతదేశంలో తయారయ్యే ఔషధాల నాణ్యతతో ఎటువంటి రాజీ ఉండదు"

నకిలీ మందులు తయారు చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలి- డాక్టర్ మన్సుఖ్ మాండవియా

Posted On: 11 JUL 2023 1:57PM by PIB Hyderabad

"ఎంఎస్‌ఎంఈ  ఫార్మా కంపెనీలు ఔషధాల నాణ్యత పట్ల అప్రమత్తంగా ఉండటం మరియు స్వీయ నియంత్రణ ద్వారా మంచి తయారీ ప్రక్రియల (జిఎంపి) వైపు వేగంగా వెళ్లడం చాలా ముఖ్యం" అని కేంద్ర రసాయనాలు & ఎరువులు మరియు ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈరోజు ఎంఎస్‌ఎంఈ రంగానికి చెందిన ఫార్మా కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా తెలిపారు.

ఎంఎస్‌ఎంఈ ఫార్మా రంగంలో స్వీయ నియంత్రణ ఆవశ్యకతను గట్టిగా నొక్కిచెప్పిన కేంద్ర మంత్రి..భారతదేశం 'ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్' హోదాను కొనసాగించడానికి దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. "ఫార్మాస్యూటికల్ రంగంలో మన ప్రపంచ స్థానం మన ఉత్పత్తుల నాణ్యత ద్వారా సృష్టించబడింది. విలువ మరియు నాణ్యత పరంగా మనం ఈ స్థానాన్ని పటిష్టం చేయడానికి అన్ని చర్యలను తప్పనిసరిగా చేపట్టాలి. కాబట్టి స్వీయ నియంత్రణ పాత్ర కీలకం అవుతుంది అని ఆయన పేర్కొన్నారు.

 

image.png


బేసిస్ ఇండస్ట్రీ యొక్క హామీ, నేడు తీసుకున్న ఒక ప్రధాన నిర్ణయం. ఎంఎస్‌ఎంఈ ఫార్మా రంగానికి దశలవారీగా షెడ్యూల్ ఎం తప్పనిసరి చేయబడుతుంది. "ఇది నాణ్యత హామీకి సహాయపడుతుంది మరియు సమ్మతి భారాన్ని కూడా తగ్గిస్తుంది" అని కేంద్ర మంత్రి చెప్పారు.

నకిలీ మందులను తయారు చేసే అన్ని ఫార్మాస్యూటికల్ తయారీ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ)ని డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఆదేశించారు. భారత్‌లో తయారయ్యే ఔషధాల నాణ్యతతో ఎలాంటి రాజీ ఉండబోదని ఆయన ఉద్ఘాటించారు. నాణ్యత పాటించని, నకిలీ మందులను తయారు చేసే తయారీదారుల పట్ల ప్రభుత్వం ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ తయారీ కంపెనీలను తనిఖీ చేసేందుకు ప్రత్యేక స్క్వాడ్‌లను ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

image.png

 

ఫార్మా ఉత్పత్తులకు సంబంధించిన నాణ్యతను నిర్ధారించడానికి, నియంత్రణ అధికారులు రిస్క్ బేస్డ్ ఇన్స్పెక్షన్ మరియు ప్లాంట్‌ల ఆడిట్‌ను ప్రారంభించారని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే 137 సంస్థలను తనిఖీ చేశామని, 105 సంస్థలపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. 31 సంస్థలలో ఉత్పత్తి నిలిపివేయబడిందని 50 సంస్థలపై ఉత్పత్తి/విభాగ లైసెన్స్‌ల రద్దు & సస్పెన్షన్‌లు జారీ చేయబడ్డాయని వివరించారు. దీంతోపాటు 73 సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా, 21 సంస్థలపై హెచ్చరిక లేఖలు జారీ చేసినట్టు చెప్పారు.

శ్రీమతి ఎస్. అపర్ణ, సెక్రటరీ (ఫార్మా), డాక్టర్ రాజీవ్ రఘువంశీ, డిసిజిఐ మరియు డిపార్ట్‌మెంట్ నుండి సీనియర్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. అలాగే ఐడిఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ విరంచి షా మరియు ఇతర ఆఫీస్ బేరర్లు కూడా పాల్గొన్నారు.


 

****



(Release ID: 1938794) Visitor Counter : 180