చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లఖ్‌నవూలోని జాతీయ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయంలో శిక్షణ కార్యక్రమం


16 జిల్లాల నుంచి శిక్షణకు హాజరైన 45 మంది శిక్షణార్థులు

Posted On: 11 JUL 2023 12:38PM by PIB Hyderabad

కేంద్ర న్యాయ విభాగం ప్రారంభించిన 'పాన్ ఇండియా లీగల్ లిటరసీ & లీగల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్' కింద, న్యూదిల్లీలోని జాతీయ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయం (ఎన్‌ఎల్‌యూ) ఒక శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. లఖ్‌నవూలోని డా.ఆర్‌.ఎం.ఎల్‌. జాతీయ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయంలో, ఈ నెల 6-8 తేదీల్లో, ఈ కార్యక్రమం జరిగింది. 16 జిల్లాల నుంచి 45 మంది శిక్షణార్థులు 3 రోజుల శిక్షణ కోసం హాజరయ్యారు.

శిక్షణ కార్యక్రమంలో 10 సెషన్లు జరిగాయి. లింగ వివక్షతో చేసే హింస నుంచి సైబర్ నేరాల వరకు వివిధ సామాజిక-చట్టపరమైన సమస్యలు, చట్టం కింద అందించిన రక్షణల గురించి ప్రొఫెసర్ బి.బి. పాండే, అడ్వొకేట్‌ అభా సింఘాల్ జోషి, అడ్వొకేట్‌ రేణు మిశ్రా, డా.కె.ఎ. పాండె, డా.అపరాజిత భట్, మిస్టర్ చమ్‌కౌర్ సింగ్‌ ఈ సెషన్లలో వివరించారు.

Image

**********


(Release ID: 1938635) Visitor Counter : 175