మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

జిల్లాలకు సంబంధించి 2020–21, 2021–22 కాలానికి జిల్లాల


పనితీరు వర్గీకరణ సూచిక (పిజిఐ–డి) ఉమ్మడి నివేదికను విడుదల చేసిన కేంద్రవిద్యా మంత్రిత్వశాఖ.

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ,కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి పిజిఐ–డి నివేదిక
2020–21 సంవత్సరానికి 748 జిల్లాల గ్రేడింగ్ నిర్వహించింది.

Posted On: 09 JUL 2023 5:13PM by PIB Hyderabad

కేంద్ర విద్యా మంత్రిత్వశాఖలోని  పాఠశాల విద్య, అక్షరాస్యతా విభాగం ఈరోజు 2020–21, 2021–22 విద్యా సంవత్సరాలకు సంబంధించి,
వివిధ జిల్లాల పనితీరు ప్రమాణాల వర్గీకరణ ఉమ్మడి నివేదికను విడుదల చేసింది.  ఈ పిజిఐ– డి నివేదిక జిల్లా స్థాయిలో పాఠశాల విద్యా పనితీరును
అంచనా వేస్తుంది. ఇందుకు సమగ్ర విశ్లేషణకు వీలుగా ఇండెక్స్ను రూపొందించారు.

భారత విద్యా వ్యవస్థ , ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థ. ఇందులో 14.9 లక్షల పాఠశాలలు, 95 లక్షల మంది ఉపాధ్యాయులు,
26.5 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు. వీరు వివిధ సామాజిక, ఆర్థిక నేపథ్యాలు కలిగిన వారు. పాఠశాల విద్య, అక్షరాస్యతా విభాగం రాష్ట్రాలకు సంబంధించి పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ –పిజిఐకి  రూపకల్పన చసి, 2017–18 నుంచి 2020–21 వరకు నివేదికను విడుదల చేసింది.రాష్ట్ర పిజిఐ రూపకల్పనలొ సాధించిన విజయంతో దేశంలో పాఠశాల విద్యకు సంబంధించి జిల్లా స్థాయి పనితీరు గ్రేడింగ్కు రూపకల్పన చేసింది.
జిల్లాలనుంచి ఆన్లైన్ ద్వారా సమాచారం తెప్పించారు. పిజిఐ–డి జిల్లాస్థాయిలో విద్యా వ్యవస్థలో గల అంతరాలను గుర్తించి వికేంద్రీకృత పద్ధతిలో పరిస్థితిని మెరుగుపరిచేందుకు రాష్ట్ర విద్యాశాఖలకు ఉపకరిస్తుంది.
సూచికల వారీగా పిజిఐ స్కోరు ను బట్టి ఏ విషయంలో జిల్లాలలో పరిస్థితి మెరుగుపరచాలో తెలుస్తుంది.2018–19,2019–20 సంవత్సరానికి పిజిఐ –డి నివేదిక విడుదల  కాగా,ప్రస్తుతం విడుదల అయినది 2020–21,2021–22 సంవత్సరాలకు సంబంధించిన  ఉమ్మడి నివేదిక..పిజిఐ –డి లో 83 సూచికలకు సంబంధించి 600 పాయింట్ల వెయిటేజ్ ఉంటుంది. వీటిని ఆరు గ్రూపులుగా విభజించారు. అవి ఫలితాలు, చురుకైన తరగతిగది కార్యకలాపాలు,మౌలిక సదుపాయాలు, విద్యార్థుల చేరిక, పాఠశాల భద్రత, పిల్లల భద్రత, డిజిటల్ అభ్యసన , పరిపాలనా ప్రక్రియలు.

ఈ కేటగిరీలను తిరిగి 12 డొమెయిన్లుగా విభజించారు.  అవి అభ్యసన సామర్ధ్య ఫలిఆలు, నాణ్యత,అందుబాటు ఫలితాలు, టీచర్ల అందుబాటు, ప్రొఫెషనల్ అభివృద్ధి ఫలితాలు,అభ్యసన నిర్వహణ, అభ్యసన ప్రోత్సాహక కార్యకలాపాలు, పాఠశాల భద్రత, విద్యార్థి రక్షణ, డిజిటల్ అభ్యసన, నిధుల సమ్మిళితం,వాడకం, సిఆర్సి పనితీరు పెంపు, హాజరుపర్యవేక్షక వ్యవస్థ, పాఠశాల నాయకత్వ అభివృద్ధి వంటివి ఉన్నాయి.

పిజిఐ–డి , జిల్లాలను పది గ్రేడ్లుగా విభజిస్తుంది. గరిష్ఠ గ్రేడు దక్ష్, ఇది మొత్తం పాయింట్లలో 90 శాతం పాయింట్లకు పైగా సాధించిన  వాటికి ఇస్తారు. పిజిఐ–డిలో కనిష్ఠ గ్రేడు ఆకాంక్షి,
ఇందులో మొత్తం పాయింట్లలో 10 శాతం వరకు మాత్రమే సాధించిన వాటికి దీనిని కేటాయిస్తారు.పిజిఐ–డి అంతిమ లక్ష్యం ఆయా జిల్లాలు పాఠశాల విద్యను ప్రాధాన్యతా అంశంగా స్వీకరించి అవి అత్యున్నత స్థాయి గ్రేడ్ సాధించే దిశగా పనితీరు మెరుగుపరచుకునేలా చేయడమే.
2020–21,2021–22సంవత్సరాలకు సంబంధించి పిజిఐ–డి ఉమ్మడి నివేదికను https://www.education.gov.in/statistics-new?shs_term_node_tid_depth=396&Apply=Apply లింక్పై గమనించవచ్చు.

 

****



(Release ID: 1938591) Visitor Counter : 164