మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

జాతీయ మత్స్య రైతుల దినోత్సవం 2023 వేడుక: మత్స్య రంగ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ మరియు మత్స్య రంగ స్టార్టప్ సదస్సు


మత్స్య శాఖ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్‌ను స్టార్టప్ ఇండియా హబ్ మరియు డిపిఐఐటి భాగస్వామ్యంతో ప్రారంభించింది. మత్స్య రంగంలో అసాధారణ ప్రభావాన్ని చూపే స్టార్టప్‌లను గుర్తించడం, ప్రోత్సహించడం మరియు గౌరవించడం దీని లక్ష్యం.

జులై 10న మహాబలిపురంలో జాతీయ మత్స్య రైతు దినోత్సవాన్ని జరుపుకోనున్నారు

Posted On: 08 JUL 2023 11:13AM by PIB Hyderabad

మత్స్య శాఖ ఫిషరీస్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్‌ను స్టార్టప్ ఇండియా హబ్ మరియు డిపిఐఐటి భాగస్వామ్యంతో ప్రారంభించింది, ఫిషరీస్ ఎకోసిస్టమ్‌లో అసాధారణమైన ప్రభావాన్ని సృష్టించే స్టార్టప్‌లను గుర్తించడం, ప్రోత్సహించడం మరియు గౌరవించడం దీని లక్ష్యం. భారతదేశంలో మత్స్య పర్యావరణ వ్యవస్థ సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతోంది, ప్రస్తుతం 21 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఫిషరీస్ స్టార్టప్‌లు ఉన్నాయి.

 

ఫిషరీస్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ నాలుగు సమస్య ప్రకటనలలో దరఖాస్తులను కోరింది. ఈ ఛాలెంజ్‌కు 121 స్టార్టప్‌ల నుండి సమస్య ప్రకటనలలో దరఖాస్తులు వచ్చాయి. కఠినమైన విశ్లేషణ తర్వాత, 12 స్టార్టప్‌లు ఛాలెంజ్ విజేతలుగా ఎంపిక చేయబడ్డాయి.

 

ఎంపికైన స్టార్టప్‌లను మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ మరియు ఫిషరీస్ పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రులు డాక్టర్ సంజీవ్ కుమార్ బల్యాన్‌, శ్రీ పర్షోత్తం రూపాలాతో పాటు, వివిధ రాష్ట్రాల మత్స్యశాఖ ఇంచార్జి మంత్రుల సమక్షంలో సత్కరిస్తారు. 10 జూలై 2023న తమిళనాడులోని మహాబలిపురంలో జాతీయ మత్స్య రైతు దినోత్సవం సందర్భంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులుపాల్గొంటారు.

 

ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన కింద ఎంపిక చేసిన స్టార్టప్‌లు తమ ఆవిష్కరణలను కొనసాగించడంలో సహాయపడటానికి రూ 2 లక్షల నగదు గ్రాంట్‌ అందించబడుతుంది.

 

10 జూలై, 2023న మహాబలిపురంలో జరిగే జాతీయ మత్స్య రైతు దినోత్సవ వేడుకలో దేశవ్యాప్తంగా ఉన్న  మత్స్యకార ఆవిష్కర్తలలో అత్యుత్తమమైన 30 అసాధారణమైన స్టార్టప్‌లను ప్రదర్శిస్తుంది. స్టార్టప్‌లు తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడంలో సహాయపడేందుకు ప్రత్యేక సెషన్‌లు కూడా ఏర్పాటు చేయబడతాయి.

 

***



(Release ID: 1938363) Visitor Counter : 114