భారత ఎన్నికల సంఘం
ఎన్నికల సహకారానికి సంబంధించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన భారతదేశం మరియు పనామా
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నికల సంస్థలతో పాలుపంచుకోవడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రక్రియలను బలోపేతం చేయడానికి ఈసీఐ కట్టుబడి ఉంది:సీఈసీ రాజీవ్ కుమార్
ఎన్నికల సహకారాన్ని ఈసీఐ విస్తరిస్తోంది; బ్రెజిల్-చిలీ-మెక్సికోతో అవగాహన ఒప్పందం తర్వాత ఈసీఐతో ఎంఓయూ సంతకం చేసిన నాల్గవ లాటిన్ అమెరికా దేశం పనామా.
Posted On:
07 JUL 2023 3:59PM by PIB Hyderabad
ఎన్నికల నిర్వహణ మరియు పరిపాలన రంగంలో తమ కొనసాగుతున్న సహకారం కోసం సంస్థాగత ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి పనామా సిటీలో భారత ఎన్నికల సంఘం మరియు పనామా ఎలక్టోరల్ ట్రిబ్యునల్ (ఈటీ) ఈరోజు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ శ్రీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ఈసీఐ ప్రతినిధి బృందం, పనామా ఎలక్టోరల్ ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ మేజిస్ట్రేట్ మిస్టర్ ఆల్ఫ్రెడో జుంకా వెండెహేక్‌తో రెండు ఎన్నికల నిర్వహణ సంస్థల (ఈఎంబి) మధ్య సహకారాన్ని మరియు విజ్ఞాన మార్పిడిని బలోపేతం చేయడంపై పరస్పర చర్చలు జరిపింది. కార్యక్రమంలో మొదటి వైస్ ప్రెసిడెన్షియల్ మేజిస్ట్రేట్ శ్రీ ఎడ్వర్డో వాల్డెస్ ఎస్కోఫరీ మరియు పనామా ఈటీ రెండవ వైస్ ప్రెసిడెంట్ మేజిస్ట్రేట్ శ్రీ లూయిస్ ఎ. గుయెర్రా మోరేల్స్ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఈసీ శ్రీ రాజీవ్ కుమార్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ఎమ్ఒయు ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల సంస్థలతో నిమగ్నమై, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రక్రియలను బలోపేతం చేయడానికి ఈసీఐకి ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు. "ప్రపంచంలోని ఉత్తమ ఎన్నికల సమగ్రత అభ్యాసాల నుండి నేర్చుకుంటూనే ఈసీఐ ఇతర దేశాలకు ఉచిత, న్యాయమైన మరియు పారదర్శక ఎన్నికలను నిర్వహించడంలో దాని నైపుణ్యం మరియు పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి కట్టుబడి ఉంది" అని ఆయన అన్నారు. ఇంటరాక్షన్ సందర్భంగా పనామా ఈటీ ప్రిసైడింగ్ మేజిస్ట్రేట్ శ్రీ. ఆల్ఫ్రెడో ఎన్నికలలో సాంకేతికత మరియు సోషల్ మీడియా వినియోగంపై రెండు ఈఎంబిల మధ్య సహకారం గురించి చర్చించారు.
ఈసీఐ తన 'అంతర్జాతీయ సహకార కార్యక్రమం' ద్వారా విదేశీ ఎన్నికల నిర్వహణ సంస్థలతో (ఈఎంబీలు) దాని లింకులు మరియు సహకారాన్ని విస్తరిస్తోంది. గత సంవత్సరాల్లో మెక్సికో, బ్రెజిల్ మరియు చిలీతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేసిన తరువాత, ఇది లాటిన్ అమెరికా ప్రాంతంలో ఈఎంబీతో ఈసీఐసంతకం చేసిన నాల్గవ అవగాహన ఒప్పందంగా ఉంది. ఈఎంబీలు మరియు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ సంస్థలతో మొత్తం 31 ఎంయూలు ఉన్నాయి.
భారత ఎన్నికల సంఘం మరియు పనామా ఎలక్టోరల్ ట్రిబ్యునల్ అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్ (ఏ-డబ్ల్యూఈబి)లో సభ్యులు. 'సమ్మిట్ ఫర్ డెమోక్రసీ' ఆధ్వర్యంలో 'కోహోర్ట్ ఆన్ ఎలక్షన్స్ ఇంటెగ్రిటీ' కోసం మార్చి 2023లో ఈసీఐ నిర్వహించిన 'ఇన్‌క్లూజివ్ ఎలక్షన్స్ అండ్ ఎలక్షన్స్ ఇంటెగ్రిటీ' అనే అంతర్జాతీయ సదస్సుకు పనామా ఈటీకి చెందిన అధికారులు కూడా హాజరయ్యారు. ఏప్రిల్ 2021లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈసీఐ నిర్వహించిన "అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం"లో కూడా పనామా ఈటీకి చెందిన అధికారులు పాల్గొన్నారు. అలాగే జూన్ 2021లో ఐఐఐడీఈఎంలో ఐటీఈసీ ప్రోగ్రామ్ కింద ఎన్నికల ప్రణాళికపై శిక్షణా కోర్సుకు కూడా హాజరయ్యారు.
సంతకాల కార్యక్రమంలో ఇరు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈసీఐ ప్రతినిధి బృందం ఏ-డబ్లూఈబి యొక్క 11వ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మీటింగ్ మరియు కొలంబియాలోని కార్టజేనాలో జరిగే అంతర్జాతీయ సమావేశానికి హాజరవుతుంది. అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్ (ఏ-డబ్లూఈబి) అనేది 119 ఈఎంబీలు సభ్యులుగా & 20 ప్రాంతీయ సంఘాలు/సంస్థలు అసోసియేట్ సభ్యులుగా ప్రపంచవ్యాప్తంగా ఎలక్షన్ మేనేజ్‌మెంట్ బాడీస్ (ఈఎంబిలు) యొక్క అతిపెద్ద సంఘం.
******
(Release ID: 1938078)
Visitor Counter : 178