ప్రధాన మంత్రి కార్యాలయం
జాపాన్-ఇండియా అసోసియేశన్ (జిఐఎ) యొక్క చైర్ మన్ మరియు జాపాన్ పూర్వ ప్రధాన మంత్రి మాన్య శ్రీ యోశీహిదే సుగా తో సమావేశమైన ప్రధాన మంత్రి
పార్లమెంట్సభ్యుల యొక్క గణేశ సమూహం మరియు పారిశ్రమిక జగతి కి చెందిన ప్రముఖుల తో కూడిన ఒకప్రతినిధివర్గం తో కలసి భారతదేశం సందర్శన కు తరలివచ్చిన మాన్య శ్రీ సుగా
ప్రత్యేక వ్యూహాత్మకమరియు ప్రపంచ భాగస్వామ్యాన్ని బలపరచుకొనే విషయం లో అభిప్రాయాల ను పరస్పరం వెల్లడిచేసుకొన్నారు
‘గణేశ నో కాయి’ పార్లమెంటేరియన్ ల సమూహం మరియు కీడ్ నరేన్ ల సభ్యుల తో కూడాఫలప్రదమైన సంభాషణ చరిపిన ప్రధాన మంత్రి
Posted On:
06 JUL 2023 7:11PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాపాన్-ఇండియా అసోసియేశన్ (జిఐఎ) చైర్ మన్ మరియు జాపాన్ పూర్వ ప్రధాని మాన్య శ్రీ యోశీహిదే సుగా తో ఈ రోజు న సమావేశమయ్యారు. శ్రీ సుగా 100 మంది కి పైగా సభ్యుల తో కూడిన ఒక ప్రతినిధివర్గం తో కలసి భారతదేశం సందర్శన కు తరలివచ్చారు. ఈ ప్రతినిధి వర్గం లో ప్రభుత్వాధికారులు, కీడ్ నరేన్ (జాపాన్ బిజ్ నెస్ ఫెడరేశన్) మరియు పార్లమెంట్ సభ్యుల తో కూడినటువంటి ‘‘గణేశ్ నొ కాయి’’ సమూహం తాలూకు సభ్యులు ఉన్నారు. తొలిసారి భారత పర్యటనకు వచ్చారు.
జెఐఎ అధ్యక్షుని గా ఒకటో సారి భారతదేశం సందర్శనకు వచ్చినటువంటి శ్రీ సుగా కు ప్రధాన మంత్రి స్వాగతం పలికారు. నేతలు ఇద్దరూ పెట్టుబడులు మరియు ఆర్థిక సహకారం, రైల్ వేస్, ఉభయ దేశాల కు చెందిన ప్రజల మధ్య పరస్పర స్నేహ సంబంధాలు, నైపుణ్యాభివృద్ధి రంగాల లో భాగస్వామ్యం సహా భారతదేశం మరియు జాపాన్ ల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక మరియు అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టపరచడం గురించి వారి వారి అభిప్రాయాల ను ఒకరి కి మరొకరు తెలియ జేసుకొన్నారు.
రెండు దేశాల మధ్య పార్లమెంటరీ సంబంధాల ను బలపరచుకొనే విషయం లో “గణేశ నో కాయి’ పార్లమెంటరీ సమూహం సభ్యుల తో ప్రధాన మంత్రి సార్థకమైన మాటామంతీ ని జరిపారు. ఆయన జాపాన్ లో యోగ కు మరియు ఆయుర్వేదాని కి ప్రజాదరణ పెరుగుతుండడాన్ని వారు స్వాగతించారు. భారతదేశం మరియు జాపాన్ ల మధ్య సాంస్కృతిక సంబంధాల ను మరింత పటిష్టపరచే పద్ధతుల ను గురించి కూడా వారు మాట్లాడుకొన్నారు.
కీడ్ నరేన్ సభ్యుల ను ప్రధాన మంత్రి భారతదేశం లోకి ఆహ్వానించారు. బిజ్ నెస్ ఇకోసిస్టమ్ ను మెరుగుపరచడం కోసం ప్రభుత్వం అమలుపరచినటువంటి విస్తృతమైన సంస్కరణల ను ప్రధాన మంత్రి వారికి వివరించారు. ప్రస్తుత పెట్టుబడుల ను విస్తరించడానికి మరియు సహకారం తాలూకు క్రొత్త మార్గాల ను అన్వేషించడానికి ముందుకు రావాలంటూ జాపాన్ పెట్టుబడిదారుల కు ఆయన ఆహ్వానం పలికారు.
***
DS/LP
(Release ID: 1937884)
Visitor Counter : 162
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam