వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జులై 7, 8 తేదీల్లో రెండు రోజుల చింతన శిబిరం


రైతుల సంక్షేమం కోసం సంప్రదాయ బంధనాలను తెంచుకుంటూ సరికొత్త ఆలోచనలు, నవకల్పనలకు వేదికగా మారనున్న రెండు రోజుల చింతన శిబిరం

వ్యవసాయంలో సాధించిన పురోగతిమీద మేథో మథనానికి మాత్రమే ఈ శిబిరం పరిమితం కాదు, భవిష్యత్ అవసరాల కోసం పథక రచన చేయటం, ఎగుమతులను గరిష్ఠం చేయటం, వ్యవసాయాన్ని ఆధునీకరించటం కూడా దీని లక్ష్యం

Posted On: 06 JUL 2023 5:37PM by PIB Hyderabad

వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ, వ్యవసాయ పరిశోధన, విద్యా విభాగం ఉమ్మడిగా 2023 జులై 7,8 తేదీల్లో పూశాలోని ఎన్ ఏ ఎస్ సి కాంప్లెక్స్ లో రెండు రోజుల చింతన శిబిరాన్ని ఏర్పాటు చేశాయి.  ఈ కార్యక్రమానికి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖామంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమార్,  సహాయ మంత్రులు శ్రీ కైలాస చౌదరి, సుశ్రీ శోభా కరండ్లజే హాజరవుతారు. 

ఈ కార్యక్రమంలో ముందుగా నిర్దేశించిన అంశాలైన వాతావరణ అనుకూల వ్యవసాయం, వ్యవసాయంలో ప్రైవేట్ రంగాన్ని వాడుకోవటం, వ్యవసాయంలో డిజిటల్ టెక్నాలజీ వినియోగం, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల పెంపు, వ్యవసాయ ఆధారిత వ్యాపారాన్ని సులభతరం చేయటం, వ్యవసాయ విస్తరణను పటిష్టపరచటం, భూసార ఆరోగ్యానికి సమీకృత పోషక యాజమాన్యం మీద చర్చిస్తారు. రైతుల సంక్షేమం కోసం సంప్రదాయ బంధనాలను తెంచుకుంటూ సరికొత్త ఆలోచనలు, నవకల్పనలకు వేదికగా ఈ రెండు రోజుల చింతన శిబిరం ఒక విశిష్టమైన అవకాశం కలిగిస్తుంది.

ఈ విధంగా వ్యవసాయాన్ని సమున్నత స్థాయికి తీసుకువెళ్ళే దిశగా సాగుతుంది.  మంత్రిత్వశాఖ అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన నిపుణులు పాల్గొనే ఈ రెండు రోజుల కార్యక్రమంలో చర్చించే అంశాలు ఈ శిబిరానికి అత్యంత ప్రాధాన్యం తెచ్చిపెట్టాయి. భారత వ్యవసాయ పరిశోధనామండలి లోని   సంబంధిత విభాగాల అధిపతులు ఆయా అంశాల మీద చర్చలను ప్రారంభిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ నిపుణులు ఈ సమాలోచనలలో పాల్గొంటారు. 

వ్యవసాయంలో సాధించిన పురోగతిమీద మేథో మథనానికి మాత్రమే ఈ శిబిరం పరిమితం కాదు, భవిష్యత్ అవసరాలకోసం  పథక రచన చేయటం, ఎగుమతులను గరిష్ఠం చేయటం, వ్యవసాయాన్నియ ఆధునీకరించటం కూడా దీని లక్ష్యం. రైతును కేంద్రం చేసుకుంటూ విధాన రూపకల్పన చేసే ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవటానికి సహాయపడటం, ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచటం ధ్యేయంగా ఇవి సాగుతున్నాయి.  

ఈ రెండు రోజుల కార్యక్రమం వలన i) వాతావరణానికి తగినట్టుగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దటం  ii)  సమీకృత పోషకాల యాజమాన్యంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవటం, సుస్థిర వ్యవసాయం కోసం ఎరువుల వాడకాన్ని సమతుల్యం చేయటం, iii) మొక్కల రక్షణకు పర్యావరణ హితమైన విధానాలను ప్రోత్సహించే వివిధ సంస్థల మధ్య సమన్వయం సాధించటం iv) ప్రకృతి వ్యవసాయ విధానాల ద్వారా సాగును, సుస్థిరతను పెంచటం  v) వ్యవసాయ విద్యా విస్తరణ పటిష్టపరచటం, డిజిటైజ్ చేయటం vi) ఎగుమతులు పెంచటానికి రాష్ట్రాల స్థాయిలో వ్యూహాల రూపకల్పన vii) ఉత్పత్తి ఆధారిత వ్యూహానికి బదులు మార్కెటింగ్ ఆధారిత వైఖరిని అవలంబించటం పెరుగుతాయి. 

 

ఈ రెండు రోజుల చర్చల వలన భారత వ్యవసాయాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్ళే మార్గాలు రూపొందగలవని  ఆశిస్తున్నారు. ఆ విధంగా ఆరైతుల ఆదాయాన్ని పెంచటం లక్ష్యంగా పెట్టుకున్నారు. 

***




(Release ID: 1937864) Visitor Counter : 137