బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2023–24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 8. 4 శాతం వృద్ధితో 222.93 మిలియన్ టన్నులకు చేరిన బొగ్గు ఉత్పత్తి.


కోల్ ఇండియా లిమిటెడ్ ఉత్పత్తి 9.85 శాతం పెరిగి 175.35 మిలియన్ టన్నులకు చేరిక.

తొలి త్రైమాసికంలో బొగ్గు పంపిణీలో 6.97 శాతం పెరుగుదల

బొగ్గు నిల్వల స్థితి37.62 శాతం వృద్ధితో 107.15 మిలియన్ టన్నులకు చేరిక

Posted On: 03 JUL 2023 3:55PM by PIB Hyderabad

బొగ్గు మంత్రిత్వశాఖ 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 8.40 శాతం వృద్ధితో మొత్తం బొగ్గు ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధిని సాధించింది.
దీనితో 2022–23 తొలి త్రైమాసికంలో 205.65 మిలియన్ టన్నులుగా ఉన్న బొగ్గు ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 222.93 మిలియన్ టన్నులకు చేరుకుంది.
మరోవైపు కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) 9.85 శాతం ప్రగతిని సాధించి, 2023–24 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో 175.35 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించింది. గత ఏడాది ఇదే కాలంలో , సంస్థ ఉత్పత్తి 159.63 మిలియన్ టన్నులు మాత్రమే. కాప్టివ్  గనులు, ఇతరాలు కూడా ఉత్పత్తిలో వృద్ధి సాధించాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 4.74 శాతం వృద్ధితో  30.48 మిలియన్ టన్నుల వృద్ధిని సాధించింది. 2022–23 లో ఇదే కాలానికి  29.10 మిలియన్ టన్నులు . ఈ పురోగతి అంతా ఈ రంగంలోని సానుకూల ధోరణి కారణంగా సాధ్యమైంది.

అదే విధంగా బొగ్గు పంపిణీ కూడా పెరుగుదల సాధించింది. ఇది 2023–24 తొలి త్రైమాసికంలో ప్రాథమిక అంచనాల  ప్రకారం, 239.69 మిలియన్ టన్నులకు చేరుకుంది. 2022–23 ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికకంలో 6.97 శాతం వృద్ధితో ఇది 224.08 మిలియన్ టన్నులు.  కోల్ ఇండియా  లిమిటెడ్ (సిఐఎల్) 2023–24 ఆర్ధిక సంవత్సరం  తొలి త్రైమాసికంలో 186.21 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించింది. 2022–23 తొలి త్రైమాసికంలో ఇది 5.32 శాతం వృద్ధితో 176.81 మిలియన్ టన్నులు గా ఉంది. అదే సమయంలో,ఎస్.సి.సి.ఎల్, కాప్టివ్, ఇతర సంస్థలు వరుసగా 17.30 మిలియన్ టన్నులు, 29.97 మిలియన్ టన్నుల బొగ్గుఉత్పత్తిని 2022–23 తొలి త్రైమాసికంలో సాధించాయి. వీటి వృద్ధి వరుసగా 4.45 శాతం, 18.16 శాతం గా ఉంది. ఈ గణాంకాలను గమనించినపుడు, దేశవ్యాప్తంగా బొగ్గు సరఫర సజావుగా  , సమర్ధతతో సాగుతున్నట్టు తెలుస్తుంది.

దీనికి తోడు బొగ్గు నిల్వల స్థితి  తగినంత గా ఉంది. 2023 జూన్ 30 నాటికి  బొగ్గు  నిల్వలు  రికార్డు స్థాయిలో 107.15 మిలియన్ టన్నులు (ప్రాథమిక అంచనాల ప్రకారం) ఉన్నాయి. అదే 2022 జూన్ 30 నాటికి బొగ్గు నిల్వలు 77.86 మిలియన్ టన్నులు మాత్రమే. దీనిని బట్టి బొగ్గు నిల్వలలో 37.62 శాతం వృద్ధి కనిపించింది. దీనితో నానాటికి పెరుగుతున్న బొగ్గు డిమాండ్ను తట్టుకోవడానికి ఈ  నిల్వలలో వృద్ధి వీలు కల్పిస్తుంది.

 బొగ్గు  ఉత్పత్తులను గణనీయంగా పెంచడానికి బొగ్గు మంత్రిత్వశాఖ  సాగిస్తూ వచ్చిన ప్రయత్నాలు, ఎలాంటి అంతరాయాలు లేకుండా బొగ్గు నిరంతర సరఫరాకు వీలు కల్పించడం, వంటి వాటితో భారతదేశం ఇంధన డిమాండ్ను తట్టుకుని  ,శరవేగంతో అభివృద్ధి దిశగా సాగిపోతుండడానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  ఈ సానుకూల పరిణామాలు, దేశ ఇంధన రంగంలో దేశాన్ని ప్రముఖ స్థాయిలో నిలబెట్టడంతో పాటు , ఎలాంటి అంతరాయాలు లేని  నిరంతర విద్యుత్ సరఫరాకు ,ఆత్మనిర్భర్ భారత్కు ఇది మార్గం సుగమం చేస్తోంది.

 

***


(Release ID: 1937486) Visitor Counter : 148


Read this release in: English , Urdu , Hindi , Kannada